Sensex rally
-
బుల్ జోష్: దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు
ఈ వారంలో జరిగే నాలుగు రోజుల ట్రేడింగ్‌లో బడ్జెట్‌పై అంచనాలు, కార్పొరేట్ క్యూ3 ఫలితాలు, నెలవారీ డెరివేటివ్స్ ఎక్స్పైరీ, ప్రపంచ పరిణామాలతో ఇన్వెస్టర్ల అప్రమత్తతో ఒడిదుడుకుల ట్రేడింగ్‌కు అవకాశం ఉండొచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో సోమవారం ఉదయం 9.46 నిమిషాల సమయానికి సెన్సెక్స్ 413 పాయింట్ల లాభంతో 61035 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 110 పాయింట్లు లాభ పడి 18138 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. ఆల్ట్రాటెక్ సిమెంట్,ఎన్టీపీసీ,జేఎస్‌డబ్ల్యూ స్టీల్,అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, గ్రసిం,టాటా స్టీల్, ఏసియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా..హీరోమోటో కార్ప్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యూపీఎల్, టాటా మోటార్స్, హిందాల్కో, కొటక్ మహీంద్రా, ఎథేర్ మోటార్స్,ఎస్బీఐ షేర్లు నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. అంతకు ముందు ఈ రోజు ఉదయం సెన్సెక్స్ 288 పాయింట్లు లాభంతో 60909 వద్ద, నిఫ్టీ 78 పాయింట్ల లాభంతో 18106 ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇక 1620 షేర్లు అడ్వాన్స్‌గా ట్రేడ్ అవుతుండగా.. 616 షేర్లు నష్టాల్లో నష్టాలతో ఆరంభించాయి. 143 షేర్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. -
కొనసాగుతున్న ర్యాలీ 2.0
నరేంద్ర మోదీ ఘన విజయ సంబరాలు స్టాక్మార్కెట్లో శుక్రవారం కూడా కొనసాగాయి. ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ రావడంతో మరిన్ని సంస్కరణలు వస్తాయనే ఆశలతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. సెన్సెక్స్ 39,000 పాయింట్లు, నిఫ్టీ 11,800 పాయింట్లపైకి ఎగబాకాయి. సెన్సెక్స్ 40 వేల పాయింట్లు, నిఫ్టీ 12 వేల పాయింట్లకు చేరిన నేపథ్యంలో లాభాల స్వీకరణ కారణంగా గురువారం నష్టపోయిన స్టాక్ మార్కెట్ శుక్రవారం కొనుగోళ్లతో కళకళలాడింది. బ్యాంకింగ్, ఆర్థిక, వాహన రంగ షేర్ల జోరుతో సెన్సెక్స్, నిఫ్టీలు జీవిత కాల గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నా, స్టాక్ సూచీలు ముందుకే దూసుకుపోయాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడటం, గత రాత్రి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బాగా పతనం కావడం సానుకూల ప్రభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 623 పాయింట్లు లాభపడి 39,435 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 187 పాయింట్లు పెరిగి 11,844 పాయింట్ల వద్ద ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రభావంతో ఈ నెల 20న నెలకొల్పిన క్లోజింగ్ రికార్డ్లను సెన్సెక్స్, నిఫ్టీలు శుక్రవారం బ్రేక్ చేశాయి. సెన్సెక్స్, నిఫ్టీ అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. సెంటిమెంట్‌కు జోష్... ఎన్నికల్లో నరేంద్ర మోదీకి ఘన విజయం దక్కిన కారణంగా కేంద్ర ప్రభుత్వం నిశ్చయాత్మక నిర్ణయాలు తీసుకోగలదనే అంచనాలు పెరిగాయని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ జయంత్ మాంగ్లిక్ వ్యాఖ్యానించారు. ఇది బిజినెస్ సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చిందని పేర్కొన్నారు. ఫలితాలు ఎలా ఉంటాయోనన్న అనిశ్చితితో పెట్టుబడులకు దూరంగా ఉన్న ఇన్వెస్టర్లు.. ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ రావడంతో జోరుగా కొనుగోళ్లు జరుపుతున్నారని నిపుణులంటున్నారు. అంతకంతకూ పెరిగిన లాభాలు... ఆసియా మార్కెట్లు అంతంతమాత్రంగానే ఉన్నా, సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. ఉదయం పదిగంటల సమయంలో లాభాలు తగ్గాయి. ఆ తర్వాత అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగడంతో సెన్సెక్స్, నిఫ్టీలు పుంజుకున్నాయి. అంతకంతకూ లాభాలు పెరుగుతూనే పోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 666 పాయింట్లు, నిఫ్టీ 202 పాయింట్ల మేర లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. బ్యాంక్ షేర్ల జోరు... ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు జోరుగా పెరిగాయి. వచ్చే నెల మొదటి వారంలో జరిగే మోనేటరీ పాలసీలో ఆర్బీఐ కీలక రేట్లను తగ్గించనున్నదని, కొత్త ప్రభుత్వం మరిన్ని మూలధన నిధులను అందించనున్నదని, బలహీన బ్యాంక్‌లను బలమైన బ్యాంక్‌ల్లో విలీనం చేసే ప్రక్రియ మరింత వేగవంతం కాగలదన్న అంచనాలు బ్యాంక్ షేర్లను లాభాల బాట నడిపిస్తున్నాయి. మరిన్ని విశేషాలు.... ► 31 సెన్సెక్స్ షేర్లలో 27 షేర్లు లాభపడగా, 4 షేర్లు–ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, హిందుస్తాన్ యూనిలివర్ నష్టపోయాయి. నిఫ్టీ 50లో 44 షేర్లు లాభాల్లో, 6 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ► ఐసీఐసీఐ బ్యాంక్ 5 శాతం లాభంతో రూ.432 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ఇంట్రాడేలో ఈ షేర్ ఆల్ టైమ్ హై, రూ.434ను తాకింది. ఈ షేర్‌తో పాలు 20కు పైగా షేర్లు జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. ఆర్తి ఇండస్ట్రీస్, సిటీ యూనియన్ బ్యాంక్, డీసీబీ బ్యాంక్, ఐనాక్స్ లీజర్, కల్పతరు పవర్, మణప్పురం ఫైనాన్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► వాటా కొనుగోళ్ల విషయమై హిందుజా గ్రూప్, ఇతిహాద్ ఎయిర్‌వేస్‌ల మధ్య ఒప్పందం కుదరకపోవడంతో జెట్ ఎయిర్వేస్ షేర్ 5 శాతం నష్టంతో రూ.148 వద్ద ముగిసింది. ► రూ.616 కోట్ల ఆర్డర్లు రావడంతో జేఎమ్‌సీ ప్రాజెక్ట్స్ షేర్ 14 శాతం లాభంతో రూ.135 వద్దకు చేరింది. ► గతంలోలాగానే ఇప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం మౌలిక రంగంపై మరిన్ని నిధులు ఖర్చు చేయగలదనే అంచనాలతో సిమెంట్ షేర్లు పరుగులు పెడుతున్నాయి. ఇంట్రాడేలో హెడెల్‌బర్గ్ సిమెంట్, జేకే లక్ష్మీ సిమెంట్, జేకే సిమెంట్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. ఇండియా సిమెంట్స్, ఓరియంట్ సిమెంట్, ఏసీసీ, అంబుజా సిమెంట్, ఆల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు 3–11 శాతం రేంజ్లో ఎగిశాయి. ► 170కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. దిలిప్ బిల్డ్‌కాన్, అవధ్ షుగర్ అండ్ ఎనర్జీ, అమృతాంజన్ హెల్త్‌కేర్, మగధ్ షుగర్ అండ్ ఎనర్జీ, జేఎమ్‌టీ ఆటో షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. 5 రోజుల్లో.. రూ. 6 లక్షల కోట్ల సంపద స్టాక్ మార్కెట్ భారీగా లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపద ఒక్క శుక్రవారం రోజే రూ.2.54 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,53,830 కోట్లు పెరిగి రూ.1,52,71,407 కోట్లకు చేరింది. ఇక ఈ వారం 5 ట్రేడింగ్ సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద రూ. 6 లక్షల కోట్ల మేర పెరిగింది. చరిత్రాత్మక వారం... వారంపరంగా చూస్తే, సెన్సెక్స్ 1,503 పాయిం ట్లు, నిఫ్టీ 437 పాయింట్లు చొప్పున పెరిగాయి. ఇరు సూచీలు దాదాపు 4% ఎగిశాయి. ఈ ఏడాది ఈ సూచీలు అత్యధికంగా లాభపడింది ఈ వారమే. ఈ వారంలోనే సెన్సెక్స్ 40,000 పాయింట్లు, నిఫ్టీ 12,000 పాయింట్లపైకి ఎగబాకాయి. గురువారం ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌హైలను తాకిన సెన్సెక్స్, నిఫ్టీలు శుక్రవారం ఆల్‌టైమ్ హై వద్ద ముగిశాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా జీవిత కాల గరిష్టానికి ఎగసింది. బ్యాంక్ నిఫ్టీ ఈ వారంలో 6% లాభపడింది. మరోవైపు ఇన్వెస్టర్ల భయా న్ని ప్రతిబింబించే ఇండియా ఓలటాలిటీ ఇం డెక్స్ ఈ వారంలో 41 శాతం క్షీణించింది. ఈ వారంలో ఈ సూచీ 44 నెలల గరిష్ట స్థాయి, 30.18కు ఎగసినా, ఎన్నికల ఫలితాల కారణంగా 16.54 స్థాయికి దిగివచ్చింది. -
మార్కెట్ల జోరు పెంచిన ఆ నాలుగు
ముంబై : బుధవారం ట్రేడింగ్ లో దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 575.70 పాయింట్ల భారీ ర్యాలీతో 25,881వద్ద, నిఫ్టీ 186.05 పాయింట్ల లాభంతో 7,934వద్ద నమోదైంది. ఇన్ఫోసిస్, హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ బ్యాంకు, టీసీఎస్ ల జోరుతో దేశీయ సూచీలు లాభాలు పండించాయి. ఐటీ, రియాల్టీ, పవర్, క్యాపిటల్ గూడ్స్, బ్యాంక్స్, ఆటో స్టాక్స్ సపోర్టుతో కీలకమైన మార్కు 7,900ను నిఫ్టీ అధిగమించింది. దేశీయ సూచీల్లో భారీ లాభాల్లో ముగియడానికి నాలుగు అంశాలు కీలకమైన పాత్ర పోషించాయి. మంచి రుతుపవనాలు... ఆశాజనకమైన రుతుపవనాల అంచనాలు దేశీయ ఈక్విటీ మార్కెట్లో లాభాల ర్యాలీ కొనసాగించేలా దోహదంచేశాయి. రుతుపవనాల వర్షపాతం సగటున అంతకముందు అంచనా వేసిన 105శాతం కంటే ఎక్కువగా 109శాతం వరకూ ఉండొచ్చని స్కైమెట్ పేర్కొంది. ఆగస్టులో 113శాతం, సెప్టెంబర్ లో 123 శాతం వర్షపాతం మనం చూడబోతున్నామని రిపోర్టు నివేదించింది. దీంతో అంచనావేసిన దానికంటే ఎక్కువగానే వర్షపాతం ఉండొచ్చన్న అభిప్రాయంతో స్టాక్ మార్కెట్లో కన్సూమర్ గూడ్సుకు డిమాండ్ పెరిగింది. దేశ ఆర్థికవ్యవస్థలో 70శాతం జనాభా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే. గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్.... గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ దేశీయ మార్కెట్లో లాభాలు పండించాయి. అమెరికా నుంచి వెలువడిన హోమ్ సేల్స్ డేటా, ఆ దేశ ఆర్థికవ్యవస్థ మెరుగుపడిందని తెలిపింది. దీంతో జూన్ లేదా జూలైలో ఫెడ్ రిజర్వు కచ్చితంగా వడ్డీరేట్లు పెంచుతాదనే సంకేతాలు వచ్చేశాయి. ఈ డేటాతో అమెరికా మార్కెట్ 1శాతం లాభంలో ముగిసింది. ఆర్థిక మందగమనం నుంచి అమెరికా బయటపడిందని తెలియడంతో, ప్రపంచమార్కెట్లు బలమైన ట్రెండ్ కొనసాగించాయి. టెక్నికల్ లిప్ట్ ఆప్... వరుసగా నష్టాల్లో నమోదవుతున్న మార్కెట్లకి కొనుగోళ్ల మద్దతు లభించడంతో, ఓ మార్కు వద్ద నిఫ్టీ, సెన్సెక్స్ లు మళ్లీ పుంజుకున్నాయి. బేరిష్ సెంటిమెంట్ మందగించి, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో 7,940 మార్కుకు నిఫ్టీ చేరుకుంది. అంతేకాక 9,000 మార్కుకు నిఫ్టీ చేరుకుంటుందనే ఎనలిస్టుల సంకేతాలు కూడా నేటి మార్కెట్లలో సెంటిమెంట్ ను బలపరిచాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. మోర్గాన్ స్టాన్లి అప్ గ్రేడ్స్....ప్రధానిగా మోదీ రెండేళ్ల పాలన ముగించుకొనడంపై మోర్గాన్ స్టాన్లి రిపోర్టు నివేదించింది. మార్కెట్లో అచ్చే దిన్ కొనసాగుతుందని, ఈక్వల్ వేయిట్ గా ఉన్న మార్కెట్లు ఓవర్ వేయిట్ లోకి అప్ గ్రేడ్ అయ్యాయని పేర్కొంది. దీంతో దేశీయ సూచీలు లాభాలను నమోదుచేశాయి. మరింత ధరల తగ్గుదల భయాందోళనలు ప్రస్తుతం లేవని, ధరలు అదుపులో ఉంటాయని, మొత్తంగా దేశంలో అప్పుల శాతం తగ్గిందని, సంస్కరణలతో ఉత్పత్తి పెరిగిందని మోర్గాన్ స్టాన్లీ ప్రకటించింది. మోర్గాన్ స్టాన్లి దేశ ఆర్థికవ్యవస్థపై ఇచ్చిన శుభసంకేతాలతో, ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ ను బలపర్చింది. -
రికార్డు నుంచి రివర్స్...
మార్కెట్ అప్డేట్ ⇒ 8 రోజుల ర్యాలీకి సెన్సెక్స్ బ్రేక్ ⇒ ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై.. ⇒ చివరకు స్వల్ప నష్టంలో ముగింపు ⇒ కొనసాగిన నిఫ్టీ రికార్డుల పర్వం ముంబై: ఎనిమిది రోజుల వరుస సెన్సెక్స్ ర్యాలీకి బుధవారం బ్రేక్ పడింది.బీఎస్ఈ సెన్సెక్స్ స్వల్ప నష్టంతో ముగిసింది. సెన్సెక్స్ క్రితం ముగింపుతో పోల్చితే 12 పాయింట్లు నష్టంతో 29,559 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే నిఫ్టీ మాత్రం 4 పాయింట్ల లాభంతో 8,914 పాయింట్ల వద్దకు చేరింది. ఇంట్రాడేలో...: ఒక దశలో సెన్సెక్స్ 29,786.32 పాయింట్ల ఆల్‌టైమ్ హైని తాకింది. అయితే చివరకు నష్టాలోకి జారింది. నిఫ్టీ ఇంట్రాడేలో 8,985 పాయింట్లను తాకినప్పటికీ, చివరకు స్వల్పంగా 4 పాయింట్ల లాభంతోనే ముగిసింది. అంటే వరుసగా తొమ్మిదవ రోజు కూడా నిఫ్టీ లాభాల్లోనే నిలిచింది. ప్రభావిత అంశాలు...: అమెరికాఫెడ్ సమీక్ష జనవరికి సంబంధించి నెలవారీ ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్టుల గడువు గురువారంతో ముగియనుండడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావితం చూపాయి. తొమ్మిది రోజుల్లో సెన్సెక్స్ 2,200 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 637 పాయింట్లు (7.69 శాతం) పెరిగింది. టాటా మోటార్స్ రూ. 7500 కోట్ల రైట్స్ ఇష్యూ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తాజాగా రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 7,500 కోట్లు సమీకరించనుంది. ఈ నిధులను వ్యాపార కార్యకలాపాల విస్తరణకు, రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ఉపయోగించనుంది. ఇష్యూ పరిమాణం, ధర, ఇష్యూ ఎప్పుడు వచ్చేది తదితర అంశాలు మార్కెట్ పరిస్థితులను బట్టి నిర్ణయించనున్నట్లు సంస్థ తెలిపింది. -
అవరోధ శ్రేణి 25,600-25,700
మోడీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారం రోజులపాటు లాభాల స్వీకరణ పేరుతో జరిగిన కరెక్షన్ నుంచి వెనువెంటనే మార్కెట్ తేరుకుని, కొత్త రికార్డుస్థాయికి పరుగులు తీయడం అనూహ్యం. మూడేళ్ల నుంచి ఈక్విటీలకు మోహం చాటేసిన ఇన్వెస్టర్లు ఇప్పుడు తాజా పెట్టుబడులకు వేచిచూడలేక, చిన్నపాటి సర్దుబాటులో కూడా కొనేస్తున్నారంటే, ఈ ర్యాలీ మరిన్ని వారాలు కొనసాగవచ్చని అంచనావేయవచ్చు. మే చివరివారంలో కరెక్షన్ జరిగిన సందర్భంగా మార్కెట్ టర్నోవర్‌తో పోలిస్తే గతవారపు ర్యాలీలో టర్నోవర్ రెట్టింపయ్యింది. ఇన్వెస్టర్ల కొనుగోలు ఆసక్తిని ఈ టర్నోవర్ ధృవపరుస్తోంది. అలాగే సూచీల బ్రేక్అవుట్ కూడా నిజమైనదేనని, రానున్న వారాల్లో ఇవి మరింత పెరగవచ్చని టెక్నికల్ చార్టులు వెల్లడిస్తున్నాయి. సెన్సెక్స్ సాకేంతికాంశాలు... జూన్ 13తో ముగిసిన వారంలో 25,735 పాయింట్ల కొత్త రికార్డుస్థాయికి చేరిన సెన్సెక్స్, అటుతర్వాత లాభాల స్వీకరణ ఫలితంగా 21,171 పాయింట్ల స్థాయికి పడిపోయింది. చివరకు అంత క్రితం వారంతో పోల్చితే 168 పాయింట్ల స్వల్పనష్టంతో 25,228 పాయింట్ల వద్ద ముగిసింది. గత సోమవారం సెన్సెక్స్ పెద్ద ర్యాలీ జరిపి 25,600 స్థాయిని దాటినా, వరుసగా ఐదురోజులపాటు 25,600-25,700 శ్రేణి వద్ద అవరోధాన్ని చవిచూసింది. ఈ కారణంగా రానున్న రోజుల్లో సెన్సెక్స్ ర్యాలీ కొనసాగాలంటే ఈ శ్రేణిని అధిగమించి ముగియాల్సివుంటుంది. అలా ముగిస్తే 26,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించవచ్చు. మధ్యలో 25,850 స్థాయి తాత్కాలికంగా నిరోధించవచ్చు. ఈ వారం మార్కెట్ బలహీనంగా మొదలైతే 25,044-25,129 పాయింట్ల శ్రేణి తక్షణ మద్దతు (6వ తేదీనాటి గ్యాప్) అందించవచ్చు. ఈ శ్రేణిని ముగింపులో కోల్పోతే దిగువన మద్దతు స్థాయిలు 24,926 పాయింట్లు, 24,645 పాయింట్లు. నిఫ్టీ మద్దతు శ్రేణి 7,484-7,497 ఎన్ఎస్ఈ నిఫ్టీ జూన్ 13తో ముగిసినవారంలో గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించినట్లు 7,700 పాయింట్ల శిఖరం వద్ద స్వల్ప అవరోధాన్ని ఎదుర్కొని 7,525 పాయింట్ల వద్దకు తగ్గింది. చివరకు అంత క్రితం వారంతో పోల్చితే 41 పాయింట్ల నష్టంతో 7,542 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం హెచ్చుతగ్గుల సందర్భంగా నిఫ్టీకి పైస్థాయిలో 7,600 వద్ద అవరోధం కలగవచ్చు. దిగువన 7,484-7,497 పాయింట్ల శ్రేణి వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. జూన్ 6న మార్కెట్ గ్యాప్‌అప్‌తో మొదలైన సందర్భంగా ఏర్పడిన ఈ గ్యాప్ సమీప భవిష్యత్తులో నిఫ్టీకి కీలకం. ఈ గ్యాప్ మద్దతును ముగింపులో కోల్పోతే క్రమేపీ 7,430 పాయింట్ల స్థాయికి తగ్గవచ్చు. ఈ లోపున మరో ముఖ్యమైన మద్దతుస్థాయి 7,360 పాయింట్లు. ఈ వారం పైన ప్రస్తావించిన గ్యాప్ మద్దతుస్థాయిని పరిరక్షించుకుని, 7,600 పాయింట్ల అవరోధాన్ని అధిగమిస్తే మరోసారి 7,680-7,700 శ్రేణిని పరీక్షించవచ్చు. ఆపైన స్థిరపడితే రానున్న రోజుల్లో 7,800-7,850 పాయింట్ల శ్రేణికి పెరగవచ్చు.