Seoul court
-
‘ఇలా చేయమని దేవుడే చెప్పాడు’
సియోల్ : దక్షిణా కొరియాలో వివాదాస్పద మత గురువుగా ముద్ర పడ్డ జియోరాక్ లీ(75) అనే వ్యక్తికి 15 ఏళ్ల శిక్ష విధిస్తూ గురువారం అక్కడి కోర్టు తీర్పునిచ్చింది. వివరాలు... మన్మిన్ సెంట్రల్ చర్చి పెద్దగా ఉన్న లీకి పెద్ద సంఖ్యలో అనుచరులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే. కాగా తనను దేవుడిగా భావించే ఆ మహిళలపై లీ అత్యాచారానికి ఒడిగట్టేవాడు. దేవుడి ఆదేశాల మేరకే ఈ విధంగా చేస్తున్నానని వారిని హిప్నటైజ్ చేసేవాడు. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ అకృత్యాలు వెలుగులోకి రావడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. సుమారు 50 మంది మహిళలు, చిన్నారుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన లీకి 15 ఏళ్ల శిక్ష సరిపోదని, అయితే అతడి వయసు దృష్ట్యా ఈ మేరకు శిక్ష ఖరారు చేస్తున్నట్లు కోర్టు పేర్కొంది. కాగా తనను తాను దేవుడినని చెప్పుకొంటూ ప్రజల్ని మభ్యపెడుతున్నాడన్న ఆరోపణలతో కొరియా క్రిస్టియన్ కౌన్సిల్ లీ సభ్యత్వాన్ని రద్దు చేసింది. కొరియా మినిస్ట్రీ అసోసియేషన్ కూడా అతడిపై వివాదాస్పద నాయకుడిగా ముద్రవేసింది. -
భార్యపై రేప్ కేసు పెట్టిన భర్త!
సియోల్: మహిళలపై లైంగిక దాడులు గురించి నిత్యం వింటూనే ఉన్నాం. ఆశ్చర్యకరంగా భార్యపై భర్త రేప్ కేసు పెట్టిన ఘటన దక్షిణ కొరియాలో వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కేసులో నిందితురాలిని కోర్టు నిర్దోషిగా తేల్చడం విశేషం. శృంగారం కోసం తన భార్య షిమ్ బలవంతం చేసిందని కిమ్ అనే వ్యక్తి సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టును ఆశ్రయించాడు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా ప్రకటింది. భాగస్వామితో బలవంతపు శృంగారం సరికాదని షిమ్ కు కోర్టు హితపు పలికింది. భార్యతో సఖ్యతతో మెలగాలని కిమ్ కు సూచించింది. అయితే భర్తను 29 గంటల పాటు ఇంట్లో నిర్బంధించి, అతడిని గాయపరిచినందుకు షిమ్ కు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. వివాహ అనంతరం భాగస్వామి అంగీకారం లేకుండా బలవంతపు శృంగారానికి పాల్పడటాన్ని(మారిటల్ రేప్) 2013లో సుప్రీంకోర్టు నేరంగా గుర్తించిన తర్వాత ఇలాంటి కేసు నమోదు కావడం ఇదే మొదటిసారి.