separatist leaders
-
‘ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేశాం’
జమ్మూ కశ్మీర్: ఉగ్రవాద కార్యకలాపాలకు విదేశాల నుంచి నిధులు సేకరించారన్న కేసులో నిందితులుగా ఉన్న.. ఆషియా, మసరత్ ఆలామ్, సబీర్ షాలు నేషన్ల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) విచారణలో కీలక అంశాలను వెల్లడించారు. నిషేధిక ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా (జేయూడీ)కు తాము నిధులను సమీకరించామని విచారణలో ఒప్పుకున్నారు. జేయూడీ కార్యకలాపాలకు నిధులు మళ్లిస్తున్నారన్న ఆరోపణలతో వారిని ఈనెల 4న ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నిధుల మళ్లింపులో నిజాలు బయటకు రావడంతో అధికారులు వారిని అరెస్ట్ చేశారు. దీనికి నిరసనగా.. వారి మద్దతు దారులు కశ్మీర్ లోయలో నిరసనలు చేపట్టారు. కాగా కశ్మీర్లో భద్రతా బలగాలపైకి రాళ్లు విసురుతూ అల్లర్లు సృష్టిస్తున్న ఆరోపణలతో ఆషియాపై 2017లో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
జమ్మూ కశ్మీర్లో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్
-
ఎన్నికల వేళ.. నేతల గృహనిర్భందం
శ్రీనగర్ : కట్టుదిట్టమైన భద్రత నడుమ జమ్మూ కశ్మీర్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యాయి. మొదటి విడతగా 12 జిల్లాల్లోని 30 మున్సిపాలిటీలో గల 400 వార్డులకు ఎన్నికలు జరుగునున్నాయి. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు చోటుచేసుకుండా వేర్పాటువాదల నాయకుల్ని ముందస్తుగా గృహనిర్భందంలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా మీర్వాజ్ ఉమర్ ఫరూఖ్, సయ్యద్ అలీ షా గిలానీ, యాసీన్ మాలిక్ వంటి కరుడుగట్టిన వేర్పాటువాద నాయకుల్ని గృహనిర్భందం చేసి ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. 13 ఏళ్ల అనంతరం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను.. ప్రధాన పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌స్సీ), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) బహిష్కరించిన విషయం తెలిసిందే. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 35(ఎ)పై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆ రెండు పార్టీలు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఇదివరికే ప్రకటించాయి. ప్రధాన పార్టీలు రెండూ బరిలో నుంచి తప్పుకోవడంతో.. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ నెలకొంది. జమ్మూ ప్రాంతంలో బలమైన క్యాడర్ గల బీజేపీ.. ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేస్తామని ఈ రాష్ట్ర మాజీ సీఎం కవీంద్ర గుప్తా ధీమా వ్యక్తం చేశారు. కాగా 400 స్థానాలకుగాను 1283 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. పలు ప్రాంతాల్లో అలర్లు జరిగే అవకాశం ఉన్నందున్న కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని భద్రత దళాలు ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేయగా, మరోకొన్ని ప్రాంతాల్లో 2జీ సేవలు అందిస్తున్నారు. -
శ్రీనగర్‌లో ఆంక్షలు.. ఇంటర్నెట్ సేవల నిలిపివేత
శ్రీనగర్ : భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు పౌరుల మరణించడంతో ఆదివారం అధికారులు ఆంక్షలు విధించారు. వేర్పాటువాద నాయకులు ఆదివారం బంద్‌కు పిలుపునివ్వడంతో అధికారులు పలుచోట్ల ఆంక్షలు విధించి ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. శనివారం షోపియాన్ జిల్లాలోని గనోపోరా గ్రామంలో జరిగిన అల్లర్లలో ఇద్దరు యువకులు మరణించారు. మరో ఎనిమిది మంది నిరసనకారులు గాయపడ్డారు. ఈ ఘటనపై రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ విచారణకు ఆదేశించారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వేర్పాటువాద నాయకులు సయ్యద్ అలీ గిలానీ, మిర్విజ్ ఉమర్ ఫరూక్, యాసిన్ మాలిక్‌లు ఆదివారం కాశ్మీర్ వ్యాలీ బంద్‌కు పిలుపునిచ్చారు. శ్రీనగర్‌లోని ఖనీర్, రైనీవారీ, నౌహాటా, ఎంఆర్ గుంజ్ ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా నిబంధనలు విధించారు. బారాముల్లా, బన్నిహాల్ పట్టణాల మధ్య రైల్వే సేవలను ముందు జాగ్రత్తగా నిలిపివేశారు. గస్తీకి వెళ్లిన ఆర్మీ కాన్వాయ్‌పైకి 100 మందితో కూడిన నిరసన కారుల గుంపు ఒక్కసారిగా రాళ్ల దాడికి దిగడంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపవలసి వచ్చిందని రక్షణ శాఖ అధికార ప్రతినిథి కల్నల్ రాజేష్ కలియా తెలిపారు. కాన్వాయ్‌లో 4 వాహనాలు ఉన్నాయని, నిరసనకారులు రాళ్లు విసురుతూ వాహనాలను చుట్టుముట్టి నిప్పుపెట్టడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. అలాగే ఓ జూనియర్ ఆర్మీ అధికారి వద్ద నున్న ఆయుధాన్ని లాక్కోవడానికి ప్రయత్నించారని చెప్పారు. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపడంతో జావేద్ అహ్మద్ భట్(20), సోహైల్ జావిద్ లోనె(24) అనే ఇద్దరు మృతిచెందారని ఆయన తెలిపారు. -
అసంతృప్తి వ్యక్తం చేసిన వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ : దేశ విచ్ఛిన్నానికి యత్నించిన వ్యక్తులకు మేధావులు మద్ధతు ఇవ్వటంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశాన్ని నాశనం చేసే శక్తులకు అండగా నిలుస్తూ.. సొంత సైన్యంపైనే సదరు మేధావులు పోరాటాలు చేయటం దారుణమని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో జాతీయ విచారణ సంస్థ(ఎన్ఐఏ) మాజీ డైరెక్టర్ జనరల్(తొలి) రాధా వినోద్ రాజు సంస్మరణ సభలో వెంకయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ‘‘అసమ్మతికి ఈ దేశంలో చోటు ఉంటుంది. కానీ, దేశ విచ్ఛిన్నాన్ని అనుమతించే ప్రసక్తే లేదు. అఫ్జల్ గురు, యాకుబ్ మెమోన్ లాంటి వాళ్ల పుట్టిన రోజులు జరపాల్సిన అవసరం మనకు ఏంటి? ఈ విషయంలో కొందరు మేధావుల తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది అని వెంకయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. కశ్మీర్లో ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని అందిస్తున్న అల్లర్లకు రెచ్చగొడుతున్న కొందరు వేర్పాటువాదుల నిజ స్వరూపాన్ని ఎన్ఐఏ బయటపెట్టిందని వెంకయ్య ప్రశంసలు కురిపించారు. అయితే పక్కా ఆధారాలతో వేర్పాటువాదులు పట్టుబడుతున్నప్పటికీ వారికి మద్ధతుగా మేధావులు పోరాటాలు చేస్తున్నారని.. కానీ, సామాన్యుల ప్రాణాలు పోతున్నప్పుడు మాత్రం వాళ్లు కనీసం నోరు కూడా మెదపరని ఆయన తెలిపారు. పైగా దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుల మీద, సైన్యం మీద ఆరోపణలు చేస్తూ కాలం గుడుపుతున్నారని.. అయినప్పటికీ ప్రజల నైతిక మద్ధతు మాత్రం సైన్యానికే ఉంటుందన్న విషయాన్ని వాళ్లు(మేధావులు) గుర్తుంచుకుంటే మంచిదని వెంకయ్య సూచించారు. ఇక ఈ కార్యక్రమంలో హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, ఎన్ఐఏ కీలక అధికారులు పాల్గొన్నారు. -
ఆర్టికల్ 35ఏ జోలికొస్తే ఊరుకోం!
శ్రీనగర్: ఒకవేళ సుప్రీం కోర్టు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 35ఏకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని వేర్పాటువాద నేతలు కశ్మీర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ అంశంలో ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నా రాష్ట్రం మరో పాలస్తీనాగా మారుతుందని హెచ్చరించారు. ఈ మేరకు వేర్పాటువాద నేతలు సయ్యద్ అలీషా గిలానీ, ఉమర్ ఫారుఖ్, యాసిన్ మాలిక్‌లు ఆదివారం ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. కశ్మీర్ పౌరులకు విశేషాధికారాలు కల్పిస్తున్న ఆర్టికల్ 35ఏ చట్టబద్ధతపై సుప్రీంకోర్టు విచారణ జరపనున్న సంగతి తెలిసిందే. ‘ఒకవేళ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, ప్రయోజనాలకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టండి’ అని కోరారు. అధికార పీడీపీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్)కు మిత్రుడిగా మారిందని వారు ప్రకటనలో విమర్శించారు. -
అల్లుడు, మరో ఆరుగురు నేతలు అరెస్టు!
న్యూఢిల్లీ: కశ్మీర్ వేర్పాటువాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉగ్రవాదులకు నిధులు అందించడం, కశ్మీర్‌లోయలో అలజడికి ప్రేరేపించడం ఆరోపణలపై ఏడుగురు వేర్పాటువాద నేతలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం అరెస్టు చేసింది. అరెస్టైన వారిలో కరుడుగట్టిన వేర్పాటువాద నేత సయెద్ అలీషా గీలానీ అల్లుడు అల్తాఫ్ అహ్మద్ షా అలియాస్ అల్తాఫ్ ఫంతోష్ కూడా ఉన్నాడు. ఇంకా అరెస్టైన వారిలో వేర్పాటువాద నేతలు నయీం ఖాన్, బిట్టా కరాటే, అయాజ్ అక్బర్, టీ సైఫుల్లా, మేరాజ్ కల్వాల్, సయీద్ ఉల్ ఇస్లాం ఉన్నారు. వీరిలో బిట్టా కరాటేను ఢిల్లీలో అదుపులోకి తీసుకోగా, మిగతావారిని శ్రీనగర్‌లో అరెస్టు చేసి.. ఢిల్లీకి తరలించి విచారిస్తున్నారు. వీరికి గతంలోనే ఎన్ఐఏ నోటీసులు ఇచ్చినప్పటికీ.. వీరు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ముందస్తు కస్టడీలో ఉండటంతో గతంలో ఎన్ఐఏ ప్రశ్నించలేకపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా వీరి అరెస్టు ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ఢిల్లీలో విచారణకు హాజరుకావాల్సిందిగా వేర్పాటువాద నేతలకు ఎన్ఐఏ నోటీసులు ఇచ్చినప్పటికీ ఎవరూ స్పందించలేదు.