ఎస్సీ, బీసీ కార్యాలయాల పరిశీలన
కొత్తగూడెం రూరల్:
కొత్తగూడెం మండలం విద్యానగర్ కాలనీలోని ఎఎస్డబ్ల్యూఓ కార్యాలయంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. బీసీ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు శనివారం ఇక్కడకు వచ్చి భవన సముదాయాలను పరిశీలించి వెళ్లారు. ఎస్సీ, బీసీ రుణాల మంజూరు తదితర కార్యక్రమాలకు ఈ కార్యాలయాలనే వినియోగించనున్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరం కొత్త రుణాలు ఈ జిల్లా నుంచే వెలవడనున్నాయి.