ఆ వైద్యులకు సేవే శిక్ష
విజయవాడ: డ్రైంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోయిన వైద్యులను సేవలు అందించటమే శిక్షగా కోర్టు తీర్పునిచ్చింది. కృష్ణా జిల్లా విజయవాడ పోలీసులు రెండు రోజుల క్రితం చేపట్టిన తనిఖీల్లో మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న ముగ్గురు వైద్యులు దొరికారు. ప్రముఖ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న రమేష్, సతీష్, సునీల్‌లను శనివారం కోర్టులో హాజరుపరిచారు. మూడో మెట్రోపాలిటన్ కోర్టు ఈ ముగ్గురికీ స్థానిక బందరురోడ్డులోని నిర్మల్‌హృదయ్ భవనంలో రెండు రోజులపాటు వృద్ధులకు సేవలు అందించాలని ఆదేశించింది. ఈ మేరకు వారు సేవలు అందించటం ప్రారంభించారు.