ఆదర్శ ఉపాధ్యాయుల ర్యాలీ
కరీంనగర్: ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు తమ సమస్యలు పరిష్కరించాలని కరీంనగర్ నగరంలో మంగళవారం ర్యాలీ చేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పదవ పీఆర్సీ, సర్వీస్ రూల్స్, హెల్త్ కార్డులు, సీపీఎస్-టీ ఇంక్రిమెంట్, కారుణ్య నియామకాలు, ఇన్ సర్వీస్ ఉద్యోగుల క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రం సమర్పించారు.