Sesa
-
చిన్న షేర్లకు డిమాండ్
స్టాక్ మార్కెట్ల జోరు కొసాగుతోంది. జీడీపీపై అంచనాలతో బుధవారం హైజంప్ చేసిన మార్కెట్లు గురువారం సైతం కొత్త రికార్డులను సాధించాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 22,792ను తాకగా, నిఫ్టీ గరిష్టంగా 6,819ను చేరింది. ఇవి చరిత్రాత్మక గరిష్ట స్థాయిలు కాగా, అమ్మకాల ఒత్తిడితో ఇండెక్స్‌లు చివర్లో డీలాపడ్డాయి. వెరసి సెన్సెక్స్ కేవలం 13 పాయింట్ల లాభంతో 22,715 వద్ద నిలవగా, నిఫ్టీ యథాతథంగా 6,796 వద్దే స్థిరపడింది. కాగా, ఇటీవల జోరుమీదున్న చిన్న షేర్లు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో మరోసారి దూసుకెళ్లాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు మార్కెట్లను మించుతూ 0.6% బలపడగా, ట్రేడైన షేర్లలో 1,551 లాభపడ్డాయి. 1,251 షేర్లు తిరోగమించాయి. మోడీ ఎఫెక్ట్‌తో అదానీ ఎంటర్ప్రైజెస్ 22% జంప్‌చేయడం విశేషం! క్యాపిటల్ గూడ్స్, రియల్టీ ఓకే బీఎస్ఈలో పవర్ ఇండెక్స్ 2.5% పుంజుకోగా, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ 1.5% లాభపడ్డాయి. అయితే హెల్త్‌కేర్ అదే స్థాయిలో డీలాపడింది. పవర్, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో రిలయన్స్ ఇన్ఫ్రా, భారత్ ఎలక్ట్రానిక్స్, పుంజ్‌లాయిడ్, క్రాంప్టన్ గ్రీవ్స్, జిందాల్ సా, టాటా పవర్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, భెల్, ఎన్టీపీసీ, పీటీసీ, సద్భావ్ ఇంజినీరింగ్ 9-2.5% మధ్య దూసుకెళ్లాయి. ఇక రియల్టీ షేర్లు హెచ్‌డీఐఎల్, యూనిటెక్, ఇండియాబుల్స్ 5.5-3% మధ్య బలపడ్డాయి. హెల్త్‌కేర్‌లో అరబిందో, స్ట్రైడ్స్, గ్లెన్‌మార్క్, డాక్టర్ రెడ్డీస్, లుపిన్, సన్ ఫార్మా 3.5-2% మధ్య నీర సించాయి. మిడ్ క్యాప్స్ జోష్ సెన్సెక్స్ దిగ్గజాలలో ఎస్బీఐ 2.5%, హెచ్‌యూఎల్ 1.5% చొప్పున లాభపడగా, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఐసీఐసీఐ 1%పైగా నష్టపోయాయి. ఇక మిడ్ క్యాప్స్‌లో బీఈఎంఎల్, మహీంద్రా సీఐఈ, జిందాల్ స్టెయిన్లెస్, ఎస్ఆర్ఎఫ్, ఎస్సార్ ఆయిల్, ఎన్సీసీ, ఎడిల్వీజ్, శ్రేయీ ఇన్ఫ్రా, ఎస్సార్ పోర్ట్స్ 18-7% మధ్య ఎగశాయి. బుధవారం రూ. 1,044 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్ఐఐలు తాజాగా రూ. 343 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. -
ఎఫ్ఐఐల దూకుడు
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) అండతో స్టాక్ మార్కెట్లు రోజుకో కొత్త రికార్డును నెలకొల్పుతున్నాయి. గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 119 పాయింట్లు లాభపడి 22,214 వద్ద నిలవగా, 40 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ 6,642 వద్ద ముగిసింది. ఇవి కొత్త రికార్డులుకాగా, ఇంట్రాడేలోనూ సెన్సెక్స్ 22,308, నిఫ్టీ 6,674 పాయింట్లను చేరడం ద్వారా సరికొత్త గరిష్టాలను నమోదు చేశాయి! ఇందుకు ఎఫ్ఐఐల పెట్టుబడుల దూకుడు సహకరిస్తోంది. గత మూడు రోజుల్లో రూ. 3,700 కోట్లను ఇన్వెస్ట్ చేసిన ఎఫ్ఐఐలు తాజాగా రూ. 2,192 కోట్ల విలువైనషేర్లను కొనుగోలు చేశారు. అయితే దేశీయ ఫండ్స్ రూ. 592 కోట్ల అమ్మకాలను చేపట్టాయి. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్న అంచనాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రభుత్వ బ్యాంకు షేర్లకు డిమాండ్ కొనసాగింది. కాగా, జెట్ ఎతిహాద్ డీల్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఫిర్యాదును కాంపిటీషన్ కమిషన్ కొట్టివేయడంతో జెట్ ఎయిర్వేస్ 3% ఎగసింది. ఒక దశలో 7% వరకూ దూసుకెళ్లింది. ఈ బాటలో స్పైస్‌జెట్ సైతం 3.5% లాభపడింది. విమానయాన రంగ సంస్థలు వచ్చే మార్చి వరకూ విదేశీ రుణాలను సమీకరించుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ అనుమతించడం ఇందుకు దోహదపడింది. మొబైళ్ల ద్వారా ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్.. క్యాపిటల్ మార్కెట్లపట్ల ఇన్వెస్టర్లకు మరింత అవగాహన కల్పించేందుకు సెబీ మొబైల్, ఇంటర్నెట్ మాధ్యమాలను వినియోగించుకోనుంది. ఇందుకు పారిశ్రామిక సమాఖ్యలు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, డిపాజిటరీలు తదితరాలతో చేతులు కలపనుంది. తద్వారా ఇన్వెస్టర్లకు క్యాపిటల్ మార్కెట్ల పట్ల మరింత అవగాహన కల్పిం చడం, విజ్ఞానాన్ని పెంచడం వంటి కార్యక్రమాల్లో ఈ సంస్థలను భాగస్వాములను చేయనుంది. దీనిలో భాగంగాగత డిసెంబర్లోనే సెబీ ఇన్వెస్టర్ల సమస్యలు-పరిష్కార మార్గాలు పేరిట కార్యక్రమాలు కూడా ప్రారంభించింది. -
ఆర్బీఐ ఎఫెక్ట్.. 248 పాయింట్ల ర్యాలీ
మార్కెట్ ను ఆశ్యర్యపరుస్తూ రిజర్వుబ్యాంక్ పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లను యథాతథంగా వుంచడంతో బుధవారం స్టాక్ సూచీలు ర్యాలీ జరిపాయి. వరుసగా ఆరు రోజుల పతనానికి బ్రేక్‌వేస్తూ బీఎస్ఈ సెన్సెక్స్ 20,917 పాయింట్ల గరిష్టస్థాయి వరకూ ర్యాలీ సాగించింది. చివరకు క్రితం ముగింపుకంటే 248 పాయింట్ల పెరుగుదలతో 20,860 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేబాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 78 పాయింట్లు ఎగిసి 6,217 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఈ దఫా సమీక్షలో వడ్డీ రేట్ల పెంపు తప్పదన్న అంచనాలతో మార్కెట్ వరుస క్షీణతను నమోదుచేస్తున్నది. ఆరు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 714 పాయింట్లు పతనమయ్యింది. తాజా ర్యాలీలో రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, పవర్ షేర్లు జోరుగా పెరిగాయి. డీఎల్ఎఫ్, బీహెచ్ఈఎల్, టాటా పవర్లు 4-6 శాతం మధ్య పెరిగాయి. రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్ సీ బ్యాంక్, ఎస్బీఐలు 2-3% మధ్య పెరిగాయి. బ్యాంకింగ్ షేర్లలో లార్జ్‌క్యాప్స్‌కంటే మిడ్‌సైజ్ పీఎస్‌యూ బ్యాంకు షేర్లు పెద్ద ర్యాలీ జరిపాయి. రంగాలవారీగా అన్నింటికంటే ఎక్కువగా రియల్టీ ఇండెక్స్ 3.5% ర్యాలీచేయగా, బ్యాంకింగ్ ఇండెక్స్ 1.4% పెరిగింది. ఎఫ్ఐఐలు రూ. 1,196 కోట్ల నిధుల్ని కుమ్మరించగా, డీఐఐలు రూ. 413 కోట్లు వెనక్కు తీసుకున్నాయి. టెస్కో వాటా కొనుగోలుచేయడంతో ట్రెంట్ 10% ఎగిసింది. ఫెడ్ నిర్ణయం కోసం ఎదురుచూపు... ఇన్వెస్టర్ల అంచనాలకు భిన్నంగా వడ్డీ రేట్లు పెంపునకు బ్రేక్‌వేసినప్పటికీ, ఆర్బీఐ చర్యకు మార్కెట్ తగినంతగా పెరగలేదని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. రేట్ల పెంపు అంచనాలతో గతవారం రోజుల్లో 3 శాతంపైగా క్షీణించిన సూచీలు, ఆర్బీఐ నిర్ణయం తర్వాత 1.2 శాతమే పెరిగాయి. రానున్న ఫెడ్ నిర్ణయం నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించడమే చిన్నర్యాలీకి కారణమని ఆ వర్గాలు విశ్లేషించాయి. ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ఉపసంహరణను ప్రారంభించనున్నట్లు ఫెడ్ ప్రకటిస్తే ఇక్కడ వడ్డీ రేట్లు హఠాత్తుగా పెరిగే అవకాశం వుందన్న భయాలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయని, టాపరింగ్ వాయిదాపడితే గురువారం సూచీలు మరికొంత పెరిగే ఛాన్స్ వుందని ఆ వర్గాలు వివరించాయి. నిఫ్టీలో లాంగ్ బిల్డప్ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మ్యాజిక్ ఫలితంగా నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టులో లాంగ్ బిల్డప్ జరిగినట్లు డెరివేటివ్ డేటా వెల్లడిస్తున్నది. డిసెంబర్ ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్టుల ముగింపునకు మరో ఐదురోజులే గడువు ఉన్నా, తాజాగా నిఫ్టీ ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో 1.76 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం ఓఐ 2.20 కోట్లకు చేరింది. స్పాట్ నిఫ్టీతో పోలిస్తే ఫ్యూచర్ ప్రీమియం 32 పాయింట్లకు పెరిగిపోయింది. స్పాట్ నిఫ్టీ 6,117 పాయింట్ల వద్ద ముగియగా, ఫ్యూచర్ 6,249 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. క్రితం రోజు ఈ ప్రీమి యం 21 పాయింట్లే. డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు దగ్గరపడుతున్నా, ఇలా ప్రీమియం పెరిగిపోవడం భారీ షార్ట్ కవరింగ్‌ను, లాంగ్ బిల్డప్‌ను సూచిస్తుంది. అలాగే ఫెడ్ నుంచి ప్రతికూల నిర్ణయం ఏదైనా వెలువడితే తప్ప, నిఫ్టీ 6,200 దిగువకు తగ్గకపోవొచ్చన్న అంచనాలతో ఈ స్ట్రయిక్ వద్ద పుట్ రైటింగ్ జరిగింది. దాంతో 6,200 పుట్ ఆప్షన్ ఓఐలో 16.18 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. ఇదే సమయంలో 6,300 స్ట్రయిక్ వద్ద స్వల్పంగా కాల్ రైటింగ్ జరగడంతో 80 వేల షేర్లు యాడ్ అయ్యాయి. సాధారణ పరిస్థితుల్లో 51 లక్షల షేర్ల పుట్ బిల్డప్ కలిగిన 6,200 స్థాయి నిఫ్టీకి మద్దతునివ్వవచ్చని, 71.50 లక్షల షేర్ల కాల్ బిల్డప్ వున్న 6,300 స్థాయి నిఫ్టీ పెరుగుదలను నిరోధించవచ్చని ఆప్షన్ రైటింగ్ విశ్లేషిస్తున్నది.