settelments
-
ఎట్టకేలకు రెండేళ్ల వివాదానికి పరిష్కారం!
ఫిన్‌టెక్ స్టార్టప్ భారత్‌పే సహవ్యవస్థాపకులు అష్నీర్ గ్రోవర్ రెండేళ్లుగా సంస్థతో కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించుకున్నారు. అష్నీర్, సంస్థకు జరిగిన ఒప్పందం ప్రకారం ఇకపై తాను భారత్‌పేతో ఏ హోదాలో కొనసాగరు. కంపెనీలోని తన షేర్లను కుటుంబ ట్రస్ట్‌కు బదిలీ చేస్తారు. ఇరువైపులా ఉన్న చట్టపరమైన కేసులను ఉపసంహరించుకోనున్నారు.అసలేం జరిగిందంటే..భారత్‌పేలో విధులు నిర్వహించే సమయంలో అష్నీర్ గ్రోవర్ దంపతులు విలాసాలకు అలవాటుపడి రూ.81 కోట్లు సంస్థ నిధుల్ని కాజేశారు. ట్యాక్స్ క్రెడిట్, జీఎస్టీ అధికారులకు పెనాల్టీ చెల్లింపుల్లో అవకతవకలు, ట్రావెల్ ఏజెన్సీలకు అక్రమ చెల్లింపులు, నకిలీ ఇన్వాయిస్లను సృష్టించడం, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఆ కుంభకోణం వెలుగులోకి రావడంతో భారత్‌పే వారిద్దరిని సంస్థ నుంచి తొలగించింది. ఇదే అంశంపై అష్నీర్ దంపతుల్ని విచారించాలని కోరుతూ భారత్‌పే ఢిల్లీ హైకోర్ట్‌ను ఆశ్రయించింది. ఆ కేసులో వాళ్లిద్దరూ విదేశాలకు పారిపోకుండా గతేడాది నవంబర్‌లో ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) లుకౌట్ నోటీసులు జారీ చేసింది. వీరిపై ఐపీసీ సెక్షన్లు 406, 408, 409, 420, 467, 120బీ, 201 కింద కేసులు నమోదు చేశారు. అష్నీర్ గ్రోవర్, మాధురీ గ్రోవర్, శ్వేతాంక్ జైన్ (మాధురి సోదరుడు), సురేష్ జైన్ (అష్నీర్ మామ), దీపక్ గుప్తా (అష్నీర్ బావమరిది)పై భారత్‌పే గతంలోనే ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల సంస్థ నిధుల దుర్వినియోగంలో అష్నీర్ బావమరిది దీపక్‌గుప్తాకు సంబంధం ఉందనే ఆరోపణలతో తనను అదుపులోకి తీసుకున్నట్లు ఈవోడబ్ల్యూ తెలిపింది.ఈ నేపథ్యంలో అష్నీర్ సంస్థతో రెండేళ్లుగా సాగుతున్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలిపారు. సంస్థ కూడా ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. ఒప్పందంలో భాగంగా ఇకపై గ్రోవర్‌కు భారత్‌పేతో సంబంధం ఉండదు. తాను కంపెనీలో ఏ హోదాలోనూ కొనసాగరు. గ్రోవర్ షేర్లు ఫ్యామిలీ ట్రస్ట్‌కి బదిలీ చేయబడతాయి. అందులో కొంతభాగం కంపెనీ అభివృద్ధికి తోడ్పడే ‘రెసిలెంట్ గ్రోత్ ట్రస్ట్’కు బదిలీ చేయనున్నారు.ఇదీ చదవండి: యాపిల్‌కు రూ.1.29 లక్షల జరిమానా‘భారత్‌పేతో ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించుకున్నాను. సంస్థ వృద్ధికి సరైన దిశలో పాటుపడుతున్న మేనేజ్మెంట్, బోర్డు సభ్యులపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇకపై సంస్థ కార్యకలాపాల నుంచి వైదొలుగుతున్నాను. నాకు చెందిన కొన్ని షేర్లను నా ఫ్యామిలీ ట్రస్ట్ నిర్వహిస్తుంది. సంస్థతో ఉన్న చట్టపరమైన కేసులను రద్దు చేసుకున్నాం’ అని ఎక్స్‌లో ప్రకటించారు.I have reached a decisive settlement with BharatPe. I repose my faith in the management and board, who are doing great work in taking BharatPe forward in the right direction. I continue to remain aligned with the company's growth andsuccess. I will no longer be associated with… pic.twitter.com/gB3Pla5qQZ— Ashneer Grover (@Ashneer_Grover) September 30, 2024 -
సీడీఎస్ఎల్ సిస్టమ్‌లో మాల్వేర్
న్యూఢిల్లీ: అంతర్గత సిస్టమ్‌లోని కొన్ని మెషిన్లలో మాల్వేర్ను కనుగొన్నట్లు డిపాజిటరీ సంస్థ సీడీఎస్ఎల్ శుక్రవారం వెల్లడించింది. ఇది లావాదేవీల సెటిల్మెంట్లో జాప్యానికి దారి తీసినట్లు పేర్కొంది. అయితే, ఇన్వెస్టర్ల డేటా లేదా గోప్యనీయ సమాచారమేదీ చోరీ అయి ఉండకపోవచ్చని తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా మార్కెట్లోని మిగతా సంస్థల నుండి సిస్టమ్‌లను డిస్కనెక్ట్ చేసినట్లు సీడీఎస్ఎల్ వివరించింది. సంబంధిత ప్రాధికార సంస్థలకు ఈ ఉదంతాన్ని రిపోర్ట్ చేశామని, దీని ప్రభావాలను అధ్యయనం చేసేందుకు సైబర్ సెక్యూరిటీ సలహాదారులతో కలిసి పని చేస్తున్నట్లు తెలిపింది. -
కిమ్ కర్దాషియన్ క్రిప్టో వివాద సెటిల్మెంట్
న్యూయార్క్: క్రిప్టో కరెన్సీలను ప్రమోట్ చేసిన వివాదానికి సంబంధించి అమెరికన్ రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్ .. సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్ (ఎస్ఈసీ)తో సెటిల్మెంట్ చేసుకున్నారు. ఇందుకోసం 1.26 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు ఆమె అంగీకరించారు. అలాగే మూడేళ్ల పాటు ఏ క్రిప్టో అసెట్నూ ప్రచారం చేయబోనని కిమ్ తెలిపారు. వివరాల్లోకి వెడితే, ఎథీరియంమ్యాక్స్ సంస్థకు సంబంధించిన ఈమ్యాక్స్ క్రిప్టోకరెన్సీని తన ఇన్‌స్ట్రాగామ్ ఖాతా ద్వారా కిమ్ ప్రమోట్ చేశారు. అయితే, ఇందు కోసం ఆమె 2,50,000 డాలర్లు తీసుకున్న విషయాన్ని ఆమె వెల్లడించకపోవడం చట్టవిరుద్ధమని ఎస్ఈసీ అభియోగాలు మోపింది. ఈ నేపథ్యంలోనే వివాదానికి ముగింపు పలికేందుకు కిమ్ కర్దాషియన్ సెటిల్మెంట్కు ముందుకొచ్చినట్లు ఆమె తరఫు లాయర్ వెల్లడించారు. -
జార్జి ఫ్లాయిడ్ కుటుంబానికి 196 కోట్ల పరిహరం
మినియాపొలిస్: అమెరికాలో తీవ్ర అలజడులకు, నిరసనలకు కారణమైన జార్జి ఫ్లాయిడ్ మరణ ఉదంతంలో మరో పరిణామం చోటుచేసుకుంది. నల్లజాతీయుడైన బాధితుడి కుటుంబానికి 27 మిలియన్ డాలర్ల (సుమారు రూ.196 కోట్లు) భారీ మొత్తాన్ని పరిహారంగా చెల్లించేందుకు మినియాపొలిస్ నగర కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఫ్లాయిడ్ కుటుంబ న్యాయవాది బెన్ క్రంప్ తాజా పరిణామంపై స్పందిస్తూ.. కేసు విచారణకు ముందు జరిగిన అతి పెద్ద సెటిల్మెంట్ ఇదేనన్నారు. ఈ సెటిల్మెంట్కు ఫ్లాయిడ్ కుటుంబం ఒప్పుకుందని కూడా ఆయన చెప్పారు. ఫ్లాయిడ్ మృతికి కారకులైన చౌవిన్, ఇతర మాజీ పోలీసులపై కోర్టులో కొనసాగుతున్న విచారణకు ఈ పరిణామానికి ఎలాంటి సంబంధం లేదని న్యాయ నిపుణులు అంటున్నారు. 2020 మే 25వ తేదీన డెరెక్ చౌవిన్ అనే పోలీసు అధికారి అనుమానంతో జార్జిఫ్లాయిడ్‌ను కిందపడేసి మెడపై తొమ్మిది నిమిషాల పాటు మోకాలితో నొక్కి ఉంచడంతో ఊపిరాడక చనిపోయిన ఘటన అమెరికాలో ఆగ్రహ జ్వాలకు కారణమైంది. -
ఏఎస్సై మోహన్‌రెడ్డికి పోలీసుల రాచమర్యాదలు
-
కలకలం
నయీం ఎన్‌కౌంటర్‌తో రియల్టర్లలో గుబులు రహస్య ప్రాంతాలకు వెళ్లేందుకు సమాయత్తం? వరంగల్ : గ్యాంగ్‌స్టర్ నయీమెుద్దీన్ ఎన్కౌంటర్ జిల్లాలో కలకలం రేపింది. నయీం ముఠా గతంలో జిల్లాలోనూ సెటిల్మెంట్లు చేసినట్టు చర్చ జరుగుతోంది. నయీం స్వస్థలమైన నల్లగొండ జిల్లా భువనగిరి మన జిల్లాకు సమీప ప్రాంతం కావడంతో ముఠా సభ్యులు ఇక్కడ కూడా తమ కార్యకలాపాలు సాగించినట్టు తెలుస్తోంది. అయితే ఎవరు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో కేసులు నమోదు కాలేదు. నయీం గ్యాంగ్‌తో జిల్లాకు చెందిన కొందరు రియల్టర్లకు సుదీర్ఘకాలంగా సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ ఎవరు కూడా నోరు మెదపడం లేదు. నయీం ఎన్కౌంటర్ సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న సమాచారం మేరకు పక్క జిల్లాల్లో అరెస్టులు ప్రారంభం కావడంతో నయీంతో సంబంధాలున్న వారు రహస్య ప్రదేశాలకు వెళ్లేందుకు సమాయత్తమవుతున్నటు తెలిసింది. నయీంతో యాదగిరిగుట్టకు చెందిన కొందరితో సంబంధం ఉన్నట్లు సోషల్ మీడియాలో రావడంతో ఆ ప్రాంతంలో భూ క్రయ విక్రయాలు చేసిన మన జిల్లాకు చెందిన పలువురు ఆందోళనలకు గురువుతున్నారు. -
సెటిల్మెంట్లకు అడ్డాగా మారిన ఏలూరు
ఏలూరు : అధికారంలో ఉన్న అహంకారంతో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆపార్టీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. సెటిల్మెంట్లకు ఏలూరు అడ్డగా మారింది. ఉద్యోగాలిప్పిస్తామని రామకోటి అనే వ్యక్తి.....పలువురి వద్ద డబ్బులు వసూలు చేశాడు. అయితే ఉద్యోగాలు ఇప్పించకపోవటంతో సెటిల్మెంట్ పేరుతో రామకోటిని... డిప్యూటీ మేయర్ చోడే వెంటకరత్నం, అనుచరులు వారం రోజలపాటు నిర్బంధించి, చితకబాదారు. అయితే ఈ విషయాన్ని అందుకున్న పోలీసులు బాధితుడిని వారి వద్ద నుంచి విడిపించారు. డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నంతో పాటు, అతని అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.