setup
-
ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు..అంతా సెట్
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరానికి (2022–23) సంబంధించి ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను త్వరలో ఖరారు చేయబోతున్నారు. దీనిపై రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇప్పటికే కసరత్తు చేపట్టింది. అన్ని యూనివర్సిటీల ఉప కులపతులతో మౌఖికంగా సంప్రదింపులు కూడా జరిపినట్టు తెలిసింది. జనవరి 15లోగా వీసీలతో ఉత్తర ప్రత్యుత్తరాల ప్రక్రియను పూర్తి చేసి నెలాఖరు కల్లా షెడ్యూల్‌ను ప్రకటించే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈసారి అన్ని సెట్స్ కూడా సకాలంలో నిర్వహించే వీలుందని విద్యా మండలి ధీమా వ్యక్తం చేస్తోంది. వర్సిటీలకు జనవరిలో లేఖలు.. ఉన్నత విద్యా మండలి నేతృత్వంలో ఏటా ఎంసెట్ (ఇంజనీరింగ్, అగ్రికల్చర్), ఈసెట్, ఐసెట్, పీజీ సెట్, ఎడ్‌సెట్, లాసెట్ ప్రధానంగా నిర్వహిస్తుంటారు. ఈసారి ఉమ్మడి పీహెచ్డీ ప్రవేశ పరీక్ష కూడా చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి ఈపాటికే ఉమ్మడి పరీక్షల కేలండర్‌ను ప్రకటించాలి. కరోనా వల్ల ఈ ఏడాది పరీక్షల్లో జాప్యం జరిగింది. ఎంసెట్ ప్రక్రియ డిసెంబర్ మూడో వారం వరకూ సాగింది. ఎడ్‌సెట్, లాసెట్ సీట్ల కేటాయింపు ఇంకా కొనసాగుతోంది. దీంతో కొత్త కేలండర్ విషయంలో ఉన్నతాధికారులు తర్జన భర్జన పడ్డారు. ఇటీవలి సమావేశంలో దీనిపై చర్చించి వీసీలు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. దీంతో ఏ సెట్‌ను ఏ యూనివర్సిటీకి అప్పగించాలి, ఎవరిని సెట్ కన్వీనర్‌గా నియమించాలో కసరత్తు మొదలైంది. జనవరి మొదటి వారంలో విశ్వవిద్యాలయాల వీసీలకు లేఖ రాయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ప్రతి వర్సిటీలోనూ కమిటీ ఏర్పాటు చేసి ఆ వర్సిటీకి కేటాయించిన సెట్ నిర్వహణకు కన్వీనర్‌ను ఎంపిక చేస్తారు. ఎంసెట్‌పై ప్రత్యేక దృష్టి ఉన్నత విద్యా మండలి ప్రధానంగా ఎంసెట్‌పై దృష్టి పెడుతోంది. పరీక్ష సకాలంలో నిర్వహించినా కౌన్సెలింగ్ విషయంలో జేఈఈ మెయిన్, అడ్వాన్స్ పరీక్షలను పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. జేఈఈ సీట్ల కేటాయింపు పూర్తయ్యాక ఈ ఏడాది ఎంసెట్ ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో సీట్లు పెద్దగా మిగిలిపోకుండా కాపాడగలిగారు. వచ్చే ఏడాదీ ఇదే తరహాలో సెట్ నిర్వహణపై కసరత్తు ప్రారంభించారు. అలాగే డిమాండ్ లేని కోర్సులు, విద్యార్థులు చేరని కాలేజీల జాబితాను సిద్ధం చేస్తున్నారు. వీటిని పరిగణనలోనికి తీసుకున్నాకే అనుబంధ గుర్తింపు ఇవ్వాలని ఉన్నత విద్యా వర్గాలు ఆలోచిస్తున్నాయి. అనుకున్న సమయానికే పరీక్షలు వీలైనంత వరకు అనుకున్న సమయానికే వచ్చే ఏడాది ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. త్వరలోనే వీసీలకు అధికారికంగా లేఖలు రాస్తాం. జవాబు వచ్చాక ఏ వర్సిటీకి ఏ సెట్ నిర్వహణ ఇవ్వాలో నిర్ణయిస్తాం. ఈ ప్రక్రియ జనవరిలోనే పూర్తి చేసి షెడ్యూల్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్) -
కేబుల్ ఆపరేటర్లను అనుమానిస్తున్నారు
సెటాప్ బాక్సుల ధరలు ఒకేలా ఉండాలి కేబుల్ టీవీ ఆపరేటర్ల జిల్లా అధ్యక్షుడు వెంకట్రావు పి.గన్నవరం : ఒకొక్క కంపెనీ సెటాప్ బాక్సు ఒక్కో రకంగా ఉండడం వల్ల, కేబుల్ ఆపరేటర్లను వినియోగదారులు అనుమానిస్తున్నారని కేబుల్ టీవీ ఆపరేటర్ల సంఘ జిల్లా అధ్యక్షుడు అడపా వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. కేబుల్ టీవీ ఆపరేటర్ల సమస్యలపై ఈ నెలాఖరులో విజయవాడలో రాష్ట్ర స్థాయి సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆదివారం స్థానిక అంబేడ్కర్ కమ్యూనిటీ హాలులో పి.గన్నవరం నియోజకవర్గ కేబుల్ టీవీ ఆపరేటర్ల సమావేశం జరిగింది. సంఘ నియోజకవర్గ అధ్యక్షుడు ఉలిశెట్టి బాబీ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి వెంకట్రావు మాట్లాడుతూ కేబుల్ టీవీ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. కార్పొరేట్ కంపెనీలు విక్రయిస్తున్న సెటాప్ బాక్సుల ధరలన్నీ ఒకేలా ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమకు గుర్తింపు కార్డులు ఇచ్చి, భద్రత కల్పించాలని, రాయితీతో కూడిన రుణాలు మంజూరు చేయాలని కోరారు. కేబుల్ ఆపరేటర్లతో పే చానల్స్ నిర్వాహకులు అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని విడనాడాలని సమావేశం డిమాండ్ చేసింది. వినియోగదారులకు మెరుగైన సేవలందించాలని తీర్మానించింది. సమావేశంలో సంఘ నాయకులు ఎస్.సూర్యనారాయణ, ఇడుపుగంటి రామ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
విశాఖలోనే తెలుగు కేంద్రం నెలకొల్పాలి
భాషాప్రియుల మనోగతం వచ్చే నెల 5న ఉన్నతస్థాయి సమావేశం సాక్షి, విశాఖపట్నం : తెలుగు వారి చిరకాల ఆకాంక్ష.. ఎట్టకేలకు నెరవేరింది. తెలుగు భాషకు ప్రాచీన హోదాపై ఇన్నాళ్లూ ఉన్న అడ్డంకి తొలగిపోయింది. చాన్నాళ్లుగా తెలుగుకు ప్రాచీన భాష హోదాకు తమిళనాడు ప్రభుత్వం అడ్డుపడుతూ వచ్చింది. ఏళ్ల తరబడి నలుగుతూ వచ్చిన ఈ వివాదానికి మద్రాసు హైకోర్టు తెరవేసింది. తెలుగుకు ప్రాచీన హోదాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పు యావత్ తెలుగు జాతిలోనూ సంబరాన్ని నింపుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలుగు క్లాసికల్ సెంటర్ ఏర్పాటుపైనే అందరి దష్టి కేంద్రీకతమై ఉంది. విశాఖలోనే ఆ సెంటరు ఏర్పాటుకు అనుకూలమన్న వాదన వినిపిస్తోంది. ప్రాచీన హోదా దక్కిన నేపథ్యంలో సంబంధిత భాషాభివద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులను కేటాయిస్తుతంది. వీటితో కేంద్రం ఏర్పాటుతో పాటు తెలుగు భాష విస్తతికి అవసరమైన అన్నిటిని సమకూర్చుకోవచ్చు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగువారుండే రాష్ట్రాలు రెండయ్యాయి. దీంతో ఇప్పుడు కేంద్రం ఇవ్వబోయే నిధులు రెండు రాష్ట్రాలకు రూ.50 కోట్ల చొప్పున పంచుతారా? లేక వందేసి కోట్లు ఇస్తారా? అన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఏది ఏమైనా తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కడమే ప్రధానంగా మారింది. తమిళ భాషకు దశాబ్దం కిందటే ప్రాచీన హోదా లభించింది. ఈ కాలంలో తమిళ భాష విశేషంగా ప్రాచుర్యం పొందడానికి కేంద్ర నిధులు బాగా దోహదపడ్డాయి. అవార్డులు, పురస్కారాలు, యువ రచయితలకు ప్రోత్సాహకాలు వంటì వాటికి ఆ ప్రభుత్వం వినియోగించింది. కొలంబో, సింగపూర్‌ల్లోనూ శాఖలు ఏర్పాటు చేసుకుంది. విశాఖ అనుకూలం.. తెలుగు ప్రాచీన భాష క్లాసికల్ సెంటర్ ఏర్పాటుకు విశాఖపట్నం అనువైనదని తెలుగు భాషాపండితులు, కవులు, రచయితలు, సాహితీవేత్తలు పేర్కొంటున్నారు. ఇప్పటికే సాంస్కృతిక రాజధానిగా విశాఖకు పేరుంది. సెంటర్ ఏర్పాటుకు నగరంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం సరైనదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏయూలో విశాలమైన పలు భవనాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో సెంటర్‌కు అనుకూలమైనవి ఉన్నాయి. అన్నిటికీ మించి 1931లో అప్పటి వీసీ సర్వేపల్లి రాధాకష్ణన్ తెలుగు శాఖను అవిభక్త తెలుగు రాష్ట్రాల్లోకెల్లా తొలిసారిగా ఏర్పాటు చేశారు. ప్రఖ్యాత తెలుగు ఆచార్యులు తోమాటి దోణప్ప, బూదరాజు రాధాకష్ణ, చేకూరి రామారావు, బద్రిరాజు చక్రవర్తి తదితరులు ఏయూ విద్యార్థులే. వీటన్నిటిని దష్టిలో ఉంచుకుని విశాఖలోనే తెలుగు భాష క్లాసికల్ సెంటర్ ఆవశ్యకతపై వచ్చే నెల 5న విశాఖలో ఓ ఉన్నత స్థాయి కమిటీ సమావేశం కానున్నట్టు తెలిసింది. విశాఖ అనువైనది.. మద్రాసు హైకోర్టు తెలుగు భాషకు ప్రాచీన హోదా ఇవ్వడం ఎంతో శుభపరిణామం. తెలుగు భాష క్లాసికల్ సెంటర్ ఏర్పాటుకు విశాఖ అనువైనది. ఇప్పటికే విశాఖ సాంస్కృతిక రాజధానిగా భాసిల్లుతోంది. ఈ నేపథ్యంలో ఈ సెంటర్ కూడా ఏర్పాటయితే తెలుగు భాష మరింత విరాజిల్లుతుంది. ఇందుకవసరమైన స్థలం, భవనాలు ఏయూలో ఖాళీగా ఉన్నాయి. పైగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తొలి తెలుగు శాఖ ఏయూలోనే ఏర్పాటైంది. సత్వరమే కార్యాచరణకు పూనుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు కేంద్రానికి పంపాలి. –రామతీర్థ, కవి, రచయిత, అనువాదకులు తీర్పు కనువిప్పు కావాలి.. మద్రాస్ హైకోర్టు తెలుగు భాషకు ప్రాచీన హోదాకు అడ్డంకులు తొలగించడం సంతోషకరం. ఈ తీర్పు నేపథ్యంలోనైనా ప్రభుత్వ పాఠశాలల్లో విధిగా ఒక సబ్జెక్టులోనైనా తెలుగు బోధన కొనసాగించాలి. అలా అయితేనే వచ్చే వందేళ్ల తర్వాత కూడా అన్ని వర్గాల వారూ తెలుగు మాట్లాడగలుగుతారు. అమెరికాలో తెలుగు కోసం తపిస్తుంటే ఇక్కడ బోధనలో తెలుగునే లేకుండా చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులకు కనువిప్పు కలగాలి. తెలుగు క్లాసికల్ సెంటర్ విశాఖలో ఏర్పాటు చేయడం సమంజసం. –ప్రొ. చందు సుబ్బారావు, రచయిత, విమర్శకుడు కల నెరవేరింది తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కాలన్న కల ఇన్నాళ్లకు నెరవేరింది. కోర్టు తీర్పు ఎంతోకాలంగా చూస్తున్న ఎదురు చూపులకు పన్నీటి జల్లులాంటిది. తెలుగు భాషాభిమానులకు, తెలుగు ప్రజలకు ఎంతో సంతోషాన్నిస్తోంది. సాంస్కృతిక రాజధాని విశాఖలో తెలుగు భాష క్లాసికల్ సెంటర్ ఏర్పాటు చేయాలి. –నారాయణరావు, కార్యదర్శి, విశాఖ సాహితీ సంస్థ -
పుస్తకాల నగరం..!
ఇంటి ముందు ప్రహరీ గోడ.. దానికి ఆనుకుని ఓ షెల్ఫ్.. అందులో పుస్తకాలు.. ఏమిటి ఈ సెటప్ అనుకుంటున్నారా? ఇది సెకండ్ హ్యాండ్ పుస్తకాల దుకాణం. మరి అమ్మే వ్యక్తి ఎక్కడ అని చూస్తున్నారా? వీటిని విక్రయించడానికి ప్రత్యేకంగా ఎవరూ ఉండరు. ఎవరికి కావాల్సిన పుస్తకాలను వారు తీసుకుని, నిర్దేశిత ధరను అక్కడ ఏర్పాటు చేసిన బాక్సులో వేస్తే సరిపోతుంది. యూకే వేల్స్ సమీపంలోని ‘హే ఆన్ వై’ అనే పట్టణంలో ఈ ‘హానెస్టీ బుక్‌షాప్స్’ దర్శనమిస్తాయి. ఇక్కడ ఇలాంటి దుకాణాలతోపాటు మామూలు పుస్తకాల షాపులు కూడా వందల సంఖ్యలో ఉంటాయి. అందుకే ఇది పుస్తకాల నగరంగా ప్రసిద్ధి చెందింది. ఏటా ఈ పట్టణానికి దాదాపు 5 లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు. అలాగే ప్రతి ఏటా మే చివర్లో సాహిత్య పండుగ పేరుతో ఓ ఉత్సవం నిర్వహిస్తారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి దాదాపు 80 వేల మంది రచయితలు, సాహిత్యాభిమానులు, పబ్లిషర్లు హాజరవుతారు.