Seven mandals
-
చంద్రబాబుపై కేసీఆర్ ఫైర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరు మొగుణ్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్లు ఉందని తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు ఎద్దేవా చేశారు. బుధవారం సాయంత్రం జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు వచ్చిన ఏడు మండలాలు లాక్కున్నది చంద్రబాబు అని, న్యాయబద్ధంగా తెలంగాణకు రావల్సిన కరెంటు రాకుండా అడ్డుకున్నదీ ఆయనేనని కేసీఆర్ గుర్తు చేశారు. పెట్టే ఇబ్బందులు వాళ్లు పెట్టి, తెలంగాణ మీద ఆరోపణలు చేస్తే వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నామని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్న రైతులు మంచిగా బతకాలని కోరుకుంటున్నామని, అదే సమయంలో మేం కూడా మంచిగా బతకాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఇక.. సెబాస్టియన్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ ఇచ్చారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన ఆరోపణల మీద మాత్రం కేసీఆర్ స్పందించలేదు. -
సభలో సమరం.. 'ముంపు' గళం
ఖమ్మం: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా పార్లమెంట్లో పోలవరం ముంపు మండలాలపై వాడీవేడి చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముంపులోని ఆదివాసీలు, గిరిజనులను పట్టించుకోవడం లేదని.. ఆ ప్రాంతంలో ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధికి చర్యలు తీసుకోలేదని.. కేంద్రం కూడా వీరి విషయంలో ఎందుకు స్పందించటం లేదని ఎంపీలు ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా సభలో ముంపు మండలాల సమస్యలను ఏకరువు పెట్టారు. ఎంపీలు సీతారాంనాయక్, వినోద్, గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా గొంతెత్తారు. పార్లమెంట్లో మంగళవారం పునర్విభజన చట్టంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసినా.. పాలన, అభివృద్ధి పరంగా ముందడుగు లేదు. కనీసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల సమాచారం కూడా ముంపులోని ఆదివాసీలు, గిరిజనులకు తెలియడం లేదు. అసలు ముంపు వాసులను అక్కడి ప్రభుత్వం గాలికివదిలేసింది. మొత్తంగా ఐదు మండలాలు పూర్తిగా, రెండు మంలాలను పాక్షికంగా ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. 324 రెవెన్యూ గ్రామాల్లోని 1,90,304 మంది జనాభా ఈ ప్రాంతాల్లో ఉన్నారు. ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎంపీలు పార్లమెంట్లో ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించారని, ముంపులో ఉన్న ఆదివాసీలు, గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్పీకర్ దృష్టికి తెచ్చారు. ఎంపీ పొంగులేటి ముంపు మండలాల సమస్యలను ఒక్కొక్కటిగా సభలో ప్రస్తావించారు. ముంపు సమస్యలను ఎంపీలు ప్రస్తావించినా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాత్రం సభ్యులు ప్రస్తావించిన ప్రశ్నలకు సమాధానం అసమగ్రంగా ఇవ్వడంతో ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఎంపీ పొంగులేటి లేవనెత్తిన అంశాలు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన డీఎస్సీకి ముంపు మండలాల్లో టీటీసీ, బీఎడ్ పూర్తి చేసిన సుమారు 1,100 మంది దరఖాస్తు చేసుకున్నా తిరస్కరించారు. నాన్‌లోకల్ పేరుతో వీరిని పక్కన పెట్టారు. గిరిజన నిరుద్యోగులు అక్కడ డీఎస్సీకి అర్హత కోల్పోయారు. ముంపు మండలాల్లో ప్రభుత్వ పాలన పూర్తిగా స్తంభించింది. గిరిజనులకు ఆదరువుగా ఉన్న ఉపాధి హామీ పథకం ఈ మండలాల్లో అమలు కావడం లేదు. గిరిజనులు ఉపాధి కోసం వలసబాట పడుతున్నారు. రోడ్లు, పాఠశాలల భవనాలు, ఇతర నిర్మాణాలు ఈ ప్రాంతాంలో చేపట్టకపోవడంతో అభివృద్ధి ఆనవాళ్లు లేవు. భద్రాచలం రూరల్ మండలంలోని గ్రామాలు, బూర్గంపాడు మండల పరిధిలోని కొన్ని గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. ఈ రెండు మండలాల్లో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లో పరిధిలోకి వెళ్లిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో ప్రభుత్వాలు ప్రమాణ స్వీకారం చేయించలేదు.ఈ మండలాల్లోని ప్రజల సమస్యల కోసం ప్రజాప్రతినిధులు నినదించే అవకాశం లేకుండా పోరుుంది. గతంలో భద్రాచలం మండలంలోని ఎటపాక, పిచుకలగూడెం, కన్నాయిగూడెం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లాయి. ఈ గ్రామాల మీదుగానే తెలంగాణలో ఉన్న దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు మండలాలకు వెళ్ళాలి. ఈ పరిస్థితితో సరిహద్దు సమస్య ఏర్పడుతుంది. 324 రెవెన్యూ గ్రామాలు ఆంధ్రలో కలిపి ఎనిమిది నెలలైనా అక్కడి ప్రజలకు విద్యుత్‌ను తెలంగాణ ప్రభుత్వమే అందిస్తుంది. ముంపు మండలాల్లో 2 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 1,500 మంది తెలంగాణలో ఉంటామని ఆప్షన్ పెట్టుకుంటే ఇరు ప్రభుత్వాలు సరైన రీతితో స్పందించడం లేదు. ఎంపీలు సీతారాంనాయక్, వినోద్, గుత్తా ప్రస్తావించిన సమస్యలు.. ముంపు మండలాల పేరుతో జిల్లాలోని గిరిజన, ఆదివాసీలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపినా వారి బాగోగులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూడడం లేదు. ఈ మండలాలకు ఇంకా తెలంగాణ నుంచే విద్యుత్ సరఫరా అవుతుంది. వాజేడు, చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం మండలాల్లో రోడ్డు సౌకర్య లేకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముంపులోని ఆదితవాసీలను ఆంధ్రప్రదేశ్ పట్టించుకోవడం లేదు. కేంద్రం వారిని ఆదుకోవాలి. -
మ్యాప్ మారుతోంది
పోలవరం ప్రాజెక్ట్ ముంపు మండలాల విలీనానికి కేంద్రం పచ్చజెండా - ఖమ్మం జిల్లా నుంచి ‘పశ్చిమ’లో కలవనున్న - కుకునూరు, వేలేరుపాడు మండలాలు - బూర్గంపాడు మండల పరిధిలోని 9 గ్రామాలు మనవే - 14న అధికారికంగా ఖరారు కానున్న అటవీ భూముల విస్తీర్ణం ఏలూరు/జంగారెడ్డిగూడెం : పశ్చిమగోదావరి జిల్లా పటం మారబోతోంది. ఇప్పటివరకూ ఖమ్మం జిల్లా పరిధిలో గల పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావిత 82 గ్రామాలను మన జిల్లాలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పచ్చజెండా ఊపింది. పాల్వంచ రెవెన్యూ డివిజన్ పరిధిలోని కుకునూరు, వేలేరుపాడు మండ లాలు పూర్తిగాను (73 గ్రామాలు), బూర్గంపాడు మండలం పాక్షికంగాను (9 గ్రామాలు) జిల్లా పరం కానున్నాయి. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో గల 211 గ్రామాలు ఉభయగోదావరి జిల్లాల్లో విలీనం కానుండగా, ఆ గ్రామాల పరి ధిలో మొత్తం 3,267 హెక్టార్ల అటవీ భూమి, 182.79 హెక్టార్ల అభయారణ్యం సైతం విలీనం కానున్నాయి. ఇందులో మన జిల్లాకు ఎంత అటవీ విస్తీర్ణం అప్పగిస్తారనేది ఈ నెల 14న అధికారికంగా లెక్కలు తేలనున్నాయి. దీనికోసం రాజమండ్రి కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బీకే సింగ్, ఏలూరు టెరిటోరి యల్ డీఎఫ్‌వో రామ్మోహన్రావు హైదరాబాద్‌లో నిర్వహించే సమీక్షకు హాజ రుకానున్నారు. ఈనెల 14న సరిహద్దులు, ఇతర వివరాలను నిర్ధారించి అటవీ భూములను అధికారికంగా అప్పగిస్తారని సమాచారం. పెరగనున్న జనాభా జిల్లాలో ఇప్పటికే 39 లక్షలకు పైగా జనాభా ఉంది. కుకునూరు, వేలేరుపాడు మండలాలతోపాటు బూర్గంపా డు మండలంలోని 9 గ్రామాల విలీనం వల్ల ఆయూ ప్రాంతాల్లోని 70 వేలకు పైగా ప్రజలు మన జిల్లా పరిధిలోకి రానున్నారు. ఈ దృష్ట్యా జిల్లా జనా భా 40 లక్షలు దాటిపోనుంది. ఈ విషయూలన్నిటినీ జిల్లా గెజిట్‌లో ప్రచురించడం ద్వారా అధికారిక ప్రకటనను ప్రభుత్వం విడుదల చేయనుంది. జిల్లాలో కలిసే గ్రామాలివే కుకునూరు మండలం (34 గ్రామా లు) : తొండిపాక, మెట్టగుడెం, బంజరగూడెం, అమరవరం, కోమట్లగుడెం, ఉప్పేరు, కొయ్యగూడెం, రెడ్డిగూడెం, దామరచర్ల, ఎల్లప్పగుడెం, చీరవల్లి, కొత్తూరు, మర్రిపాడు, మాధవరం, కౌండిన్యముక్తి, వింజరం, ముత్యాలమ్మపాడు, కొండపల్లి, కోయగూడెం, మారేడుబాక, కివ్వాక, కమ్మరిగుడెం, కుకునూరు, రామసింగారం, కిష్టారం, కుర్లపాడు, లంకాలపల్లి,ఇసుకపాడు, దాచవరం, బెస్తగూడెం, ఉప్పరమద్దిగట్ల, సీతారామచంద్రపురం, కొత్తూ రు, గొమ్ముగుడెం. వేలేరుపాడు మండలం (39 గ్రామా లు) : రుద్రమకోట, పాతపూచిరాల, పూచిరాలకాలనీ, లచ్చిగుడెం, రేపాకగొమ్ము, నడిమిగొమ్ము, మద్దిగట్ల, వేలేరుపాడు, నాగులగూడెం, తాట్కూరుగొమ్ము, భూదేవిపేట, శ్రీరాంపు రం, జగన్నాథపురం, చాగరపల్లి, కొర్రాజులగూడెం, తిర్లాపురం, కన్నాయిగుట్ట, పాతనార్లవరం, నార్లవరం కాలనీ, కొత్తూరు, చిగురుమామిడి, బోళ్లపల్లి, ఎడవల్లి, బుర్రెడ్డిగూడెం, కట్కూరు, టేకూరు, కాచారం, కొయిదా, తాళ్లగొంది, పూసుగొంది, టేకుపల్లి, పేరంటాలపల్లి, చిట్టంరెడ్డిపాలెం, పడమటిమెట్ట బుర్రతోగు, తూర్పుమెట్ట, కాకిస్‌నూరు. బూర్గుంపాడు మండలం (9 గ్రామా లు) : సీతారామనగరం, శ్రీధర వేలేరు, గుంపెనపల్లి, గనపవరం, ఇబ్రహీంపేట, రావిగూడెం, అల్లిగూడెం, వెంకటాపురం, బోనగిరి పాలనాపరంగా ఏం చేస్తారో... జిల్లాలో కలుస్తున్న 82 గ్రామాల్లో ఎక్కువ శాతం గిరిజనులే ఉన్నారు. వీరంతా ఇప్పటివరకూ భద్రాచలం ఐటీడీఏ ద్వారా సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలాలను పొందుతూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో 82 గ్రామాలకు సంబంధించి ప్రత్యేకంగా ఐటీడీఏను ఏర్పాటు చేస్తారా లేక మన జిల్లాలోని కేఆర్ పురం ఐటీడీఏ పరిధిని పెంచుతారా అనే విషయం ప్రభుత్వం నిర్ణ యం తీసుకోవాల్సి ఉంది. రాష్ట్రంలో గల ఐటీడీఏలతో పోల్చుకుంటే కేఆర్ పురం ఐటీడీఏ కేవలం మూడు మండలాలతోనే నిర్వహించబడుతోంది. ప్రస్తుతం దీని పరిధిలో 53 వేల మంది గిరిజనులు ఉన్నారు. జిల్లాలో కలుస్తున్న మూడు మండలాలతో కలుపుకుంటే జంగారెడ్డిగూడెం డివిజన్ పరి ధిలోని మండలాల సంఖ్య 9కి చేరుతోంది. విస్తీర్ణపరంగా పెద్ద రెవెన్యూ డివిజన్‌గా ఉన్న జంగారెడ్డిగూడెం డివి జన్ మూడు మండలాల విలీనంతో మరింత పెరగనుంది. దీనివల్ల పరిపాలన క్లిష్టతరమయ్యే పరిస్థితి నెల కొంది. పైగా ఈ మూడు మండలాలు జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయానికి సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇప్పటికే ఒక ఎక్సైజ్ రేంజ్, అటవీ శాఖ రేంజ్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా రెవెన్యూ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. పరిపాలనా సౌలభ్యం కోసం అక్కడ ఉప కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారా? లేక జంగారెడ్డిగూడెం నుంచే పర్యవేక్షిస్తారా అనేది తేలాల్సి ఉంది. -
కేంద్రం మొండిగా వ్యవహరించింది: కేసీఆర్
-
కేంద్రం మొండిగా వ్యవహరించింది: కేసీఆర్
హైదరాబాద్: పోలవరంపై కేంద్రం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని తెలంగాణ సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపే బిల్లును లోక్‌సభ ఆమోదించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ని పూర్తిగా ఉల్లంఘించారని మండిపడ్డారు. తాను స్వయంగా కేంద్రం, రాష్ట్రపతిని కలిసి పోలవరం డిజైన్ మార్చాలని కోరినా కేంద్రం మొండిగా వ్యవహరించిందని వాపోయారు. బీజేపీ, టీడీపీలు విప్ జారీ చేసి పంతం నెగ్గించుకుంటుంటే తెలంగాణ టీడీపీ, బీజేపీ ఎంపీలు అడ్డుకుని ఉండాల్సిందని అన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు ఈ విషయంలో పార్లమెంట్లో ఎంత పోరాటం చేసినా కేంద్రం మందబలంతో గొంతు నొక్కివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాల మనోభావాలను కేంద్రం పట్టించుకోలేదన్నారు. పార్లమెంట్లో ఆమోదం పొందినప్పటికీ భద్రాచలంలోని ఏడు మండలాలను కాపాడుకునే విషయంలో ఎలాంటి కార్యాచరణ రూపొందించుకోవాలన్న దానిపై ఆలోచన చేస్తున్నామన్నారు. న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని కేసీఆర్ చెప్పారు. -
ఆ ఏడు మండలాలు ఇక ఆంధ్రకే
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. దీంతో ఇంతకాలం తెలంగాణలోని ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్న ఏడు మండలాలు చట్టబద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోకి వెళ్లిపోయాయి. పోలవరం ప్రాజెక్టు కట్టడం పూర్తయిన తర్వాత ఖమ్మం జిల్లా పరిధిలోని ఏడు మండలాలు ముంపు బారిన పడతాయని, వారికి పునరావాసం కల్పించాలంటే ఆ మండలాలను ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే ఉంచడం సబబని గతంలో భావించారు. ఆ మేరకు కుకునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, భద్రాచలం, 15 గ్రామాలు మినహా బూర్గంపాడు, భద్రాచలం పట్టణం మినహా భద్రాచలం మండలం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం అయ్యాయి. పోలవరం నిర్వాసితులకు సొంత మండలంలోనే భూమికి బదులు భూమి లభించేలా పునరావాస ప్యాకేజీని అమలు చేసేందుకు ఈ బిల్లు దోహదపడుతుంది. ఇందుకోసం మండలాలను యూనిట్‌గా తీసుకుని నిర్వాసిత ప్రాంతాలను యూపీఏ-2 సర్కారు సీమాంధ్రలో కలిపింది. అయితే భద్రాచలానికి దారినిచ్చే బూర్గంపాడు మండలంలోని 12 రెవెన్యూ గ్రామాలను, భద్రాచలం పట్టణాన్ని మాత్రం తెలంగాణలోనే ఉంచింది. ఈ విషయమై మార్చి 2న జరిగిన కేబినెట్ భేటీలో రాష్ట్రానికి చెందిన అప్పటి మంత్రులు ఎస్.జైపాల్‌రెడ్డి, కావూరి సాంబశివరావు, పల్లంరాజు, కిశోర్ చంద్రదేవ్ పాల్గొన్నారు. ఏడు పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలపాలన్న అంశాన్ని జైపాల్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. నిజానికి భద్రాచలం పట్టణం, రామాలయం మినహా ఏడు మండలాల్లోని రెవెన్యూ గ్రామాలను మాత్రమే విభజన బిల్లులో చేర్చారు. ముంపు గ్రామాల జీవోను ఇందుకు ప్రాతిపదికగా తీసుకున్నారు. కానీ కేవలం ముంపు గ్రామాలను మాత్రమే కలిపితే నిర్వాసితులకు భూమికి బదులు భూమి ఇవ్వాలంటే సీమాంధ్ర రాష్ట్రానికి కష్టమవుతుందన్న అక్కడి ప్రజాప్రతినిధుల డిమాండ్ మేరకు అప్పటి కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే అప్పట్లో రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు. నిర్వాసితుల పునరావాసం విషయంలో అవసరమైన అన్ని చర్యలూ కేంద్రం తీసుకుంటుందని అందులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లిన మండలాలివీ... పాల్వంచ రెవెన్యూ డివిజన్: కుకునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు (పినపాక, మోరంపల్లి బంజర, బూర్గంపాడు, నాగినిప్రోలు, కృష్ణసాగర్, టేకుల, సారపాక, ఇరవెండి, మోతెపట్టినగర్, ఉప్పుసాక, నకిరిపేట, సోంపల్లి రెవెన్యూ గ్రామాలు మినహా. ఈ 12 గ్రామాలూ తెలంగాణకు వెళ్తాయి) భద్రాచలం రెవెన్యూ డివిజన్: చింతూరు, కూనవరం, వీఆర్ పురం, భద్రాచలం (భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా) మండలాలు. భద్రాచలం టౌన్, రామాలయం మాత్రం తెలంగాణలో ఉంటాయి. -
ఆ ఏడు మండలాలు ఆంధ్రలోనివే: రాజనాథ్
పోలవరం నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ స్పష్టం చేశారు. రాజనాథ్ మాట్లాడుతూ... ప్రాజెక్ట్ నిర్మాణం నేపథ్యంలో గిరిజనులకు పునరావాసం కల్పిస్తామని, అదివాసుల హక్కులు కాపాడతామని వెల్లడించారు. ముంపు మండలాల విలీనం గత ప్రభుత్వ హయాంలోనే జరగిందన్నారు. ఏపీలో ప్రస్తుతం కలిపిన మండలాలు గతంతో ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండేవన్న విషయాన్ని రాజనాథ్ సింగ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన సవరణ బిల్లుపై శుక్రవారం లోక్‌సభలో చర్చ జరిగింది. ఈ సందర్బంగా బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీలు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల గిరిజనులకు, అదివాసులకు ఎటువంటి నష్టం జరగదంటూ పై విధంగా ప్రకటించారు. అయితే తెలంగాణ ఎంపీల నిరసనకు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఎంపీలు సంఘీభావం తెలిపారు.