మ్యాప్ మారుతోంది
పోలవరం ప్రాజెక్ట్ ముంపు మండలాల విలీనానికి కేంద్రం పచ్చజెండా
- ఖమ్మం జిల్లా నుంచి ‘పశ్చిమ’లో కలవనున్న
- కుకునూరు, వేలేరుపాడు మండలాలు
- బూర్గంపాడు మండల పరిధిలోని 9 గ్రామాలు మనవే
- 14న అధికారికంగా ఖరారు కానున్న అటవీ భూముల విస్తీర్ణం
ఏలూరు/జంగారెడ్డిగూడెం : పశ్చిమగోదావరి జిల్లా పటం మారబోతోంది. ఇప్పటివరకూ ఖమ్మం జిల్లా పరిధిలో గల పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావిత 82 గ్రామాలను మన జిల్లాలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పచ్చజెండా ఊపింది. పాల్వంచ రెవెన్యూ డివిజన్ పరిధిలోని కుకునూరు, వేలేరుపాడు మండ లాలు పూర్తిగాను (73 గ్రామాలు), బూర్గంపాడు మండలం పాక్షికంగాను (9 గ్రామాలు) జిల్లా పరం కానున్నాయి.
ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో గల 211 గ్రామాలు ఉభయగోదావరి జిల్లాల్లో విలీనం కానుండగా, ఆ గ్రామాల పరి ధిలో మొత్తం 3,267 హెక్టార్ల అటవీ భూమి, 182.79 హెక్టార్ల అభయారణ్యం సైతం విలీనం కానున్నాయి. ఇందులో మన జిల్లాకు ఎంత అటవీ విస్తీర్ణం అప్పగిస్తారనేది ఈ నెల 14న అధికారికంగా లెక్కలు తేలనున్నాయి. దీనికోసం రాజమండ్రి కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బీకే సింగ్, ఏలూరు టెరిటోరి యల్ డీఎఫ్‌వో రామ్మోహన్‌రావు హైదరాబాద్‌లో నిర్వహించే సమీక్షకు హాజ రుకానున్నారు. ఈనెల 14న సరిహద్దులు, ఇతర వివరాలను నిర్ధారించి అటవీ భూములను అధికారికంగా అప్పగిస్తారని సమాచారం.
పెరగనున్న జనాభా
జిల్లాలో ఇప్పటికే 39 లక్షలకు పైగా జనాభా ఉంది. కుకునూరు, వేలేరుపాడు మండలాలతోపాటు బూర్గంపా డు మండలంలోని 9 గ్రామాల విలీనం వల్ల ఆయూ ప్రాంతాల్లోని 70 వేలకు పైగా ప్రజలు మన జిల్లా పరిధిలోకి రానున్నారు. ఈ దృష్ట్యా జిల్లా జనా భా 40 లక్షలు దాటిపోనుంది. ఈ విషయూలన్నిటినీ జిల్లా గెజిట్‌లో ప్రచురించడం ద్వారా అధికారిక ప్రకటనను ప్రభుత్వం విడుదల చేయనుంది.
జిల్లాలో కలిసే గ్రామాలివే
కుకునూరు మండలం (34 గ్రామా లు) : తొండిపాక, మెట్టగుడెం, బంజరగూడెం, అమరవరం, కోమట్లగుడెం, ఉప్పేరు, కొయ్యగూడెం, రెడ్డిగూడెం, దామరచర్ల, ఎల్లప్పగుడెం, చీరవల్లి, కొత్తూరు, మర్రిపాడు, మాధవరం, కౌండిన్యముక్తి, వింజరం, ముత్యాలమ్మపాడు, కొండపల్లి, కోయగూడెం, మారేడుబాక, కివ్వాక, కమ్మరిగుడెం, కుకునూరు, రామసింగారం, కిష్టారం, కుర్లపాడు, లంకాలపల్లి,ఇసుకపాడు, దాచవరం, బెస్తగూడెం, ఉప్పరమద్దిగట్ల, సీతారామచంద్రపురం, కొత్తూ రు, గొమ్ముగుడెం.
వేలేరుపాడు మండలం (39 గ్రామా లు) : రుద్రమకోట, పాతపూచిరాల, పూచిరాలకాలనీ, లచ్చిగుడెం, రేపాకగొమ్ము, నడిమిగొమ్ము, మద్దిగట్ల, వేలేరుపాడు, నాగులగూడెం, తాట్కూరుగొమ్ము, భూదేవిపేట, శ్రీరాంపు రం, జగన్నాథపురం, చాగరపల్లి, కొర్రాజులగూడెం, తిర్లాపురం, కన్నాయిగుట్ట, పాతనార్లవరం, నార్లవరం కాలనీ, కొత్తూరు, చిగురుమామిడి, బోళ్లపల్లి, ఎడవల్లి, బుర్రెడ్డిగూడెం, కట్కూరు, టేకూరు, కాచారం, కొయిదా, తాళ్లగొంది, పూసుగొంది, టేకుపల్లి, పేరంటాలపల్లి, చిట్టంరెడ్డిపాలెం, పడమటిమెట్ట బుర్రతోగు, తూర్పుమెట్ట, కాకిస్‌నూరు.
బూర్గుంపాడు మండలం (9 గ్రామా లు) : సీతారామనగరం, శ్రీధర వేలేరు, గుంపెనపల్లి, గనపవరం, ఇబ్రహీంపేట, రావిగూడెం, అల్లిగూడెం, వెంకటాపురం, బోనగిరి
పాలనాపరంగా ఏం చేస్తారో...
జిల్లాలో కలుస్తున్న 82 గ్రామాల్లో ఎక్కువ శాతం గిరిజనులే ఉన్నారు. వీరంతా ఇప్పటివరకూ భద్రాచలం ఐటీడీఏ ద్వారా సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలాలను పొందుతూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో 82 గ్రామాలకు సంబంధించి ప్రత్యేకంగా ఐటీడీఏను ఏర్పాటు చేస్తారా లేక మన జిల్లాలోని కేఆర్ పురం ఐటీడీఏ పరిధిని పెంచుతారా అనే విషయం ప్రభుత్వం నిర్ణ యం తీసుకోవాల్సి ఉంది. రాష్ట్రంలో గల ఐటీడీఏలతో పోల్చుకుంటే కేఆర్ పురం ఐటీడీఏ కేవలం మూడు మండలాలతోనే నిర్వహించబడుతోంది. ప్రస్తుతం దీని పరిధిలో 53 వేల మంది గిరిజనులు ఉన్నారు.
జిల్లాలో కలుస్తున్న మూడు మండలాలతో కలుపుకుంటే జంగారెడ్డిగూడెం డివిజన్ పరి ధిలోని మండలాల సంఖ్య 9కి చేరుతోంది. విస్తీర్ణపరంగా పెద్ద రెవెన్యూ డివిజన్‌గా ఉన్న జంగారెడ్డిగూడెం డివి జన్ మూడు మండలాల విలీనంతో మరింత పెరగనుంది. దీనివల్ల పరిపాలన క్లిష్టతరమయ్యే పరిస్థితి నెల కొంది. పైగా ఈ మూడు మండలాలు జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయానికి సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇప్పటికే ఒక ఎక్సైజ్ రేంజ్, అటవీ శాఖ రేంజ్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా రెవెన్యూ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. పరిపాలనా సౌలభ్యం కోసం అక్కడ ఉప కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారా? లేక జంగారెడ్డిగూడెం నుంచే పర్యవేక్షిస్తారా అనేది తేలాల్సి ఉంది.