చంద్రబాబుపై కేసీఆర్ ఫైర్ | telanganga chief minister kcr slams chandra babu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై కేసీఆర్ ఫైర్

Published Wed, Sep 2 2015 8:18 PM | Last Updated on Sat, Aug 11 2018 7:06 PM

చంద్రబాబుపై కేసీఆర్ ఫైర్ - Sakshi

చంద్రబాబుపై కేసీఆర్ ఫైర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరు మొగుణ్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్లు ఉందని తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు ఎద్దేవా చేశారు. బుధవారం సాయంత్రం జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు వచ్చిన ఏడు మండలాలు లాక్కున్నది చంద్రబాబు అని, న్యాయబద్ధంగా తెలంగాణకు రావల్సిన కరెంటు రాకుండా అడ్డుకున్నదీ ఆయనేనని కేసీఆర్ గుర్తు చేశారు.

పెట్టే ఇబ్బందులు వాళ్లు పెట్టి, తెలంగాణ మీద ఆరోపణలు చేస్తే వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నామని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్న రైతులు మంచిగా బతకాలని కోరుకుంటున్నామని, అదే సమయంలో మేం కూడా మంచిగా బతకాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఇక.. సెబాస్టియన్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ ఇచ్చారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన ఆరోపణల మీద మాత్రం కేసీఆర్ స్పందించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement