severe damage to crops
-
నష్టం రూ.10,320 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, తద్వారా వెల్లువెత్తిన వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసిన దానికంటే రెట్టింపు నష్టం జరిగి నట్లు తేలింది. వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో రెండురోజుల పాటు పర్యటించి వచి్చన కేంద్ర ఉన్నతాధికారుల బృందం.. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి ఈ సమావేశంలో పాల్గొన్నారు.రూ.5,438 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేయగా.. శుక్రవారం కేంద్ర బృందానికి ఇచి్చన నివేదికలో రూ.10,320 కోట్ల నష్టం వాటిల్లినట్లు సీఎం తెలిపారు. ఈ మేరకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఎలాంటి షరతులు లేకుండా నిధులు విడుదల చేయాలని కోరారు. విపత్తు నిధుల వినియోగం విషయంలో అమలు చేస్తున్న కఠినమైన నిబంధనలు సడలించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్డీఆర్ఎఫ్ నిధులు వాడలేని పరిస్థితి.. తెలంగాణ రాష్ట్రం మొత్తం మునిగిపోయిన పరిస్థితుల్లో సైతం ప్రస్తుత నిబంధనల ప్రకారం ఎస్డీఆర్ఎఫ్ కింద అందుబాటులో ఉన్న రూ.1,350 కోట్లలో ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకునే పరిస్థితి లేదని సీఎం రేవంత్.. కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఒక కిలోమీటర్ రోడ్డు దెబ్బతింటే కేవలం లక్ష రూపాయలు ఖర్చు చేయాలనే నిబంధన పెట్టారని, దీనితో తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టే పరిస్థితి లేదని చెప్పారు. రాష్ట్రంలో జరిగిన నష్టంతో పాటు ఇక్కడ అమల్లో ఉన్న ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్ రేట్) వివరాలను కూడా కేంద్రానికి నివేదిస్తామని, వాటిని పరిశీలించి విపత్తు సాయం అందించాలని కోరారు.వివిధ శాఖల నుంచి అందిన సమగ్ర అంచనాల ప్రకారం రూ.10,320 కోట్ల నష్టం వాటిల్లిందని, ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉందని తెలిపారు. తనతో పాటు మంత్రులు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించటంతో ప్రాణనష్టం భారీగా తగ్గిందని చెప్పారు. వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయని, లక్షలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని వెల్లడించారు. పంట పొలాల్లో బండరాళ్లు, కంకర, మట్టి మేటలు వేయటంతో రైతులు కోలుకోలేనంతగా నష్టపోయారని చెప్పారు. చాలాచోట్ల రహదారులు, రోడ్లు, కల్వర్టులు, చెరువులు కొట్టుకు పోవటంతో నష్టం ప్రాథమిక అంచనాలను మించిపోయిందని వివరించారు. మున్నేరు సమస్యకు రిటైనింగ్ వాలే పరిష్కారం ⇒ ఖమ్మం నగరానికి మున్నేరు వాగుతో ఉన్న వరద ముప్పును నివారించాలంటే రిటైనింగ్ వాల్ నిర్మాణం ఒక్కటే శాశ్వత పరిష్కారమని సీఎం స్పష్టం చేశారు. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి కేంద్రం తగినన్ని నిధులు కేటాయించేలా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను భరించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. రాకాసి తండా, సత్యనారాయణ తండాతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న తండాల ప్రజలకు సమీపంలోని సురక్షిత ప్రాంతాల్లో ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు. ఈ మేరకు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సాయం అందించాలని కోరారు. నివారణపై ఎక్కువగా దృష్టి పెట్టాలి ⇒వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించిన తర్వాత ఆదుకోవటం కంటే, నివారించే చర్యలపై ఎక్కువగా దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందని ముఖ్యమంత్రి అన్నారు. వర్షపాతం, వడగాడ్పుల వంటి వాతావరణ, పర్యావరణానికి సంబంధించిన విపత్తులపై వీలైనంత ముందుగా హెచ్చరికలు జారీ చేసేలా ఏర్పాట్లు ఉండాలని పేర్కొన్నారు. విపత్తు పరిస్థితుల్లో తక్షణం స్పందించేలా వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసే పోలీసు బెటాలియన్లను ఉపయోగించుకుంటామంటూ ముఖ్యమంత్రి తన ఆలోచనలను కేంద్ర బృందంతో పంచుకున్నారు. ప్రతి బెటాలియన్‌లో ఎంపిక చేసిన వంద మందికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తామని చెప్పారు. వారికి అవసరమైన పరికరాలు, శిక్షణ, నైపుణ్యం విషయంలో ఎన్డీఆర్ఎఫ్ సాయం కోరుతున్నామని తెలిపారు. 50 వేల చెట్లు నేలమట్టం మేడారం అటవీ ప్రాంతంలో ఇటీవల దాదాపు 50 వేల ఎకరాల్లో చెట్లు నేలమట్టమైన ఉదంతం సమావేశంలో చర్చకు వచి్చంది. ఇది అటవీ ప్రాంతంలో సంభవించడంతో ఎలాంటి ముప్పు వాటిల్లలేదని, మైదాన ప్రాంతంలో జరిగితే భారీ నష్టం జరిగేదని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఇప్పటివరకు ఇలాంటి సంఘటన జరిగినట్లు తమ దృష్టికి రాలేదని కేంద్ర బృందం వ్యాఖ్యానించింది. అందుకే కేంద్రం నుంచి నిపుణుల బృందాన్ని పంపించి శాస్త్రీయంగా అధ్యయనం చేయించాలని సీఎం కోరారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా పరిశీలించాలని సూచించారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ) సలహాదారు కల్నల్ కేపీ సింగ్ సారథ్యంలోని కేంద్ర బృందంలో అధికారులు శాంతినాథ్‌శివప్ప, మహేష్ కుమార్, నాయల్‌కాన్సన్, రాకేష్ మీనా, శశివర్ధన్‌రెడ్డి ఉన్నారు. నష్టం అంచనాలు ఇలా.. విభాగం అంచనా నష్టం (రూ.కోట్లలో) రహదారులు (ఆర్అండ్బీ, పంచాయతీరాజ్) 7693.53 సాగునీటి పారుదల 483.00 పురపాలక శాఖ 1216.57 తాగునీటి సరఫరా 331.37 విద్యుత్ శాఖ 179.88 వ్యవసాయం 231.13 ఆసుపత్రులు, అంగన్వాడీలు (కమ్యూనిటీ అసెట్స్) 70.47 మత్స్య శాఖ 56.41 గృహ నిర్మాణం 25.30 పశుసంవర్ధక శాఖ 4.35 పాఠశాల భవనాలు 27.31 వరదల్లో మరణించిన వారికి నష్టపరిహారం 1.40 మొత్తం 10,320.72 -
టమాటాకు రక్షణ బంతి
తెల్లదోమ టమాటా పంటకు తీవ్రనష్టం కలిగిస్తుంటుంది. ఈ తెల్లదోమ ద్వారా వైరస్లు, మోల్డ్ వంటి తెగుళ్లు టమాటాకు సోకి తీవ్ర నష్టం కలిగిస్తూ ఉంటాయి. అయితే, టొమాటా మొక్కల పక్కన బంతి మొక్కలు పెంచితే చాలు తెల్లదోమ బెడద తీరిపోతుందని పెద్దలు చెబుతుంటారు. బంతి మొక్క ఆకులు, పూల ద్వారా వెలువరించే వాసనలు తెల్లదోమను పారదోలుతుంటాయని కూడా మనకు తెలుసు. ఇంతకీ బంతి చెట్లు వెలువరించే వాసనల్లో ఏ రసాయనం ఉంది? అన్నది ఆసక్తికరమైన ప్రశ్న. దీనిపై గతంలో పెద్దగా అధ్యయనాలు జరగలేదు. ఇటీవల ఇంగ్లండ్‌లోని న్యూక్యాజిల్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ నేచురల్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్‌లో అధ్యయనం జరిగింది. లిమొనెనె అనే రసాయనాన్ని బంతి మొక్కలు గాలిలోకి వదులుతూ ఉంటాయని, ఈ వాసన తెల్లదోమకు నచ్చక దూరంగా వెళ్లిపోతాయని తేలింది. ఈ వాసన పీల్చిన తెల్లదోమలు చనిపోవు. దీని వల్ల టమాటాల నాణ్యత కూడా ఏ మాత్రం తగ్గడం లేదని గుర్తించారు. రసాయనిక పురుగుమందులకు ప్రత్యామ్నాయంగా ఇదే తరహాలో తెల్లదోమను పారదోలే స్ప్రేను తయారు చేయడానికి అవకాశం ఉందా అన్న అంశంపై అధ్యయనానికి సారధ్యం వహించిన డా. కొలిన్ టోష్, నియల్ కాన్బాయ్ దృష్టి సారిస్తున్నారు. బత్తాయి, నారింజ, నిమ్మ పండ్ల తొక్కల్లో కూడా లిమొనెనె పుష్కలంగా ఉంటుందట. ఉద్యాన తోటల్లో బంతి మొక్కలు వేసుకుంటే తేనెటీగలు కూడా వస్తాయి. ఉద్యాన తోటల సాగులో ఒకే రకం పంటను సాగు చేయడానికి బదులు.. కలిసి పెరుగుతూ పరస్పరం చీడపీడల నుంచి రక్షించుకునే రకరకాల పంటలను పక్క పక్కన నాటుకోవడం మేలన్న విషయాన్ని ఈ అధ్యయనం తేల్చిచెప్పడం విశేషం. -
ఉండవల్లి నోట్లో ‘మట్టి’!
ఇసుక లారీల స్వైరవిహారంతో గ్రామంలో వాతావరణ కాలుష్యం రోడ్లపై నుంచి వస్తున్న దుమ్ము ధూళితో పంటలకు తీవ్ర నష్టం ఇళ్లల్లోకి వ్యాపించడంతో ప్రజలు అనారోగ్యంపాలు దెబ్బతింటున్న రోడ్లు..ఇబ్బందులు పడుతున్న వాహన చోదకులు ప్రభుత్వానికి కోట్లలో ఆదాయం..స్థానిక పంచాయతీకి పంగనామం తాడేపల్లి రూరల్ : పచ్చని పంట పొలాలు ప్రకృతి రమణీయతతో అలరారుతున్న ఉండవల్లి గ్రామం నోట పాలకులు ‘మట్టి’ కొడుతున్న వైనం నిత్యకృత్యంగా మారింది. కృష్ణానది ఇసుక రీచ్ నుంచి నిరంతరం గ్రామంలో తిరుగుతున్న లారీలే అందుకు కారణం. ప్రభుత్వం ఆదాయం కోసం ఉండవల్లిలో ఇసుక రీచ్‌కు అనుమతులు మంజూరు చేసింది తప్ప, ఇసుక లోడులతో తిరుగుతున్న లారీల వల్ల తలెత్తే పరిణామాలను మాత్రం ఆలోచించలేదు. రీచ్ నుంచి రోజూ వందల లారీలు అటు గుంటూరు, ఇటు కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాలకు ఎడాపెడా ఇసుక పంపిణీ చేస్తున్నాయి. ఈ వందలాది లారీలు గ్రామంలోని పంట పొలాల మధ్య నుంచి, నివాస గృహాల మధ్యగా, కొండవీటి వాగు వంతెన మీదుగా ప్రయాణిస్తూ వాతావరణ కాలుష్యాన్ని కలగజేస్తున్నాయి.లారీల నుంచి వచ్చే పొగతోపాటు దుమ్ము ధూళి అటు పొలాలు, ఇటు నివాస గృహాల్లోకి వ్యాపిస్తోంది. ఫలితంగా దిగుబడికి సిద్ధంగా ఉన్న పొలాలకు నష్టం వాటిల్లి అన్నదాతలకు కన్నీరు మిగులుతోంది. మరో పక్క చేతికి వచ్చిన పంటలు సైతం దుమ్ము ధూళి వల్ల నాణ్యత తగ్గి రైతులకు ఆశించిన ధర లేక, నష్టాన్ని అందిస్తోంది. దీంతోపాటు పొలాలకు వెళ్లే రైతులు, గ్రామస్తులు లారీల జోరుకు ప్రాణాలు అరచేత పెట్టుకుని, రోడ్లెక్కాల్సి వస్తోంది. కొందరు లారీ డ్రైవర్లు తక్కువ సమయంలో ఎక్కువ ట్రిప్పులు వేయాలనే లక్ష్యంతో ఇరుకుగా, ట్రాఫిక్‌తో ఉన్న రోడ్లపై కూడా అతి వేగంగా వెళ్లడంతో ద్విచక్ర వాహన చోదకులు, పాదచారులు నానా యాతనలు పడుతున్నారు. ఉండవల్లి సెంటర్ నుంచి ఇసుక రీచ్ వరకు కేవలం సింగిల్ రోడ్డు నిర్మించడంతో రహదారిపై గుంటలు ఏర్పడడం, కొండవీటి వాగు, గుంటూరు చానల్‌పై నిర్మిం చిన వంతెనలు కంపించి పోవడం ఇక్కడ నిత్యకృత్యం. ఇసుక క్వారీ నుంచి భారీ స్థాయిలో ప్రభుత్వం ఆదాయాన్ని ఆర్జిస్తూ కూడా స్థానిక పంచాయతీ కార్యాలయానికి చెందాల్సిన అధికారిక వాటాను మాత్రం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోంది. ఫలితంగా పంచాయతీకి ఆదాయం తగ్గి గ్రామంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఇది పంచాయతీ నోట్లో మట్టి కొట్టడమేనని సాక్షా త్తూ గ్రామస్తులు అంటున్నారు. అనారోగ్యంపాలు.. ఇదిలా ఉంటే నిరంతరం తిరుగుతున్న లారీల తాకిడితో కొందరు ద్విచక్ర వాహన చోదకులు, పాదచారులు విస్తారంగా ఆవహిస్తున్న దుమ్ము ధూళి వల్ల ఆరోగ్యాలు పాడై, ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అప్పుల పాలవుతున్నారు. మొత్తంగా ఉండవల్లిలో కొనసాగుతున్న ఇసుక రీచ్ అటు ప్రభుత్వానికి కోట్ల రూపాయల్లో ఆదాయం తెచ్చిపెడుతూ, ఇటు గ్రామస్తులకు, రైతులకు, రోడ్లపై సంచరించే ప్రయాణికుల నోట్లో మట్టి కొడుతుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాధికారులు తక్షణమే స్పందించి లారీల స్వైర విహారం వల్ల తలెత్తుతున్న ఇబ్బందికర పరిస్థితులను నివారించాలని, అవసరమైతే ప్రత్యామ్నాయ ప్రయాణ పద్ధతులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
జిల్లాలో జోరుగా వర్షం, పంటలకు తీవ్ర నష్టం
జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో వివాహం చేసుకునే వారు తీవ్ర ఇబ్బంది పడ్డారు. బోర్ల సాగు కింద ముందుగా వేసిన పత్తి, నువ్వు పంటలు దెబ్బతిన్నాయి. కాయ దశలో ఉన్న పత్తి పంట కుళ్లి పోతోంది. ఆకులు మొత్తం రాలి రెండో పంట రావడం కష్టంగా మారింది. మార్కాపురం, అద్దంకిలలో కూడా అధిక వర్షం కురిసింది. దాదాపు 10 వేల హెక్టార్లలో పత్తి పంట, 4వేల హెక్టార్లలో నువ్వు పంట దెబ్బతిందని రైతులు తెలిపారు. దాదాపు రూ.40 కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం. చీరాల డివిజన్లో కొద్దిపాటి వర్షం కురిసింది. గిద్దలూరు నియోజకవర్గంలోని రాచర్ల, గిద్దలూరు, కంభం మండలాల్లో అధిక వర్షం కురిసింది. గిద్దలూరు అటవీ ప్రాంతంలో కురిసిన వర్షాలకు సగిలేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మండలంలోని చోళ్లవీడు గ్రామం వద్ద ఆకవీడు వెళ్లే రోడ్డులో నిర్మించిన బ్రిడ్జి పైనుంచి వర్షపు నీరు వేగంగా పారుతోంది. ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. కంభం మండలం తురిమెళ్ల, యర్రబాలెం గ్రామాల మధ్య గుండ్లకమ్మ ఉధృతికి ప్రజలు ఇబ్బంది పడ్డారు. గిద్దలూరులో 77, రాచర్లలో 27.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. యర్రగొండపాలెంలో వర్షం జోరున కురిసింది. అధిక విస్తీర్ణంలో సాగయిన పత్తి పంట బాగా దెబ్బతింది. వాగులు, వంకలు వర్షపు నీటితో కళకళలాడాయి. మార్కాపురంలో వర్షం తీవ్రంగా ఉంది. జనజీవనం స్తంభించింది. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. పత్తి, సజ్జ, కంది పంటలకు వర్షం జీవం పోసినట్లయింది. చీరాలలో తేలికపాటి వర్షం కురిసింది. సాగులో ఉన్న పత్తి, కంది, నువ్వు పంటలకు వర్షం వరంగా మారింది. అద్దంకిలో వర్షం తీవ్ర రూపం దాల్చింది. మండలంలో 150.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పొలాల గట్లు కోసుకుపోయాయి. కొన్ని భూముల్లో మేటలు వేశాయి. పర్చూరులో భారీ వర్షాలకు పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. వాగులు ఉధృతంగా ప్రవహించడంతో చుట్టుపక్కల ఉన్న పొలాలు కోసుకుపోయాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఒకమాదిరి వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వర్షం పంటలకు జీవం పోయగా, మరి కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి.