shaberali
-
Kamareddy : కామారెడ్డి చరిత్ర ఘనం.. ఘాటు రాజకీయం
కామారెడ్డి నియోజకవర్గం కామారెడ్డి నియోజకవర్గం.. ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షిస్తోంది. ఎందుకంటే బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కామారెడ్డిని రెండో నియోజకవర్గంగా ఎంచుకుని పోటీ చేయబోతున్నారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ రేసులో ఉంటానని ప్రకటించారు. ఇక్కడి నుంచి 2018లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) పక్షాన గంపా గోవర్దన్, కాంగ్రెస్ తరపున సీనియర్ నేత, మాజీ మంత్రి, శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన షబ్బీర్ అలీ పోటీ పడగా, గోవర్దన్ నే విజయం వరించింది. గోవర్దన్ 4557 ఓట్ల తేడాతో విజయం సాదించగలిగారు. గోవర్దన్ కు 68162 ఓట్లు రాగా, షబ్బీర్ అలీకి 63610 ఓట్లు వచ్చాయి. గోవర్దన్ బిసిలలోని పెరిక సామాజికవర్గానికి చెందినవారు.గతంలో ఈయన టిడిపిలో ఉండేవారు.తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి టిఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి వరసగా గెలుస్తున్నారు. అయితే ఈసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా ఇక్కడి నుంచి బరిలోకి దిగనున్నారు. దీంతో జిల్లా రాజకీయం ఒక్కసారిగా ఆసక్తికరంగా మారింది. గతంలో.. టీడీపీ పక్షాన రెండుసార్లు, టిఆర్ఎస్ తరపున మూడుసార్లు గెలిచారు. కాగా కామారెడ్డిలో బీజేపీ పక్షాన పోటీచేసిన కె.వెంకటరమణారెడ్డికి పదిహేనువేలకు పైగా ఓట్లు వచ్చాయి. గంపా గోవర్దన్ రెండువేల తొమ్మిదిలో టిడిపి పక్షాన గెలిచినా, ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసి ,టిఆర్ఎస్ లో చేరి తిరిగి ఉప ఎన్నికలో విజయం సాధించారు. కామారెడ్డిలో నాలుగుసార్లు రెడ్డి నేతలు,తొమ్మిదిసార్లు బిసిలు, రెండుసార్లు ఎస్.సిలు గెలవగా, మూడుసార్లు ముస్లింలు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. కామారెడ్డి కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి ఏడుసార్లు, టిడిపి ఐదుసార్లు టిఆర్ఎస్ మూడుసార్లు గెలుపొందగా, ఒకసారి ఇండిపెండెంటు నెగ్గారు. టి.ఎన్. సదాలక్ష్మి ఇక్కడ ఒకసారి,ఎల్లారెడ్డిలో మరోసారి గెలిచారు. సదాలక్ష్మి గతంలో నీలం, కాసు మంత్రివర్గాలలో పనిచేస్తే, షబ్బీర్ అలీ 1990లో చెన్నారెడ్డి, 1993లో కోట్ల విజయభాస్కరరెడ్డి, 2004 నుంచి ఐదేళ్లపాటు వ్కె.ఎస్.రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు.తదుపరి ఒకసారి ఎమ్మెల్సీ అయి శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా కూడా షబ్బీర్ ఉన్నారు. 1952లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ అభ్యర్ధి రామారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1999లో టిడిపి తరుఫున గెలిచిన యూసఫ్ అలీ విప్‌గా కొంతకాలం బాధ్యతలు నిర్వహించారు. గంపా గోవర్దన్ కూడా విప్ అయ్యారు. కామారెడ్డిలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
మేము వచ్చాక కేసీఆర్ జైలుకే?
ఆదిలాబాద్‌టౌన్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినీతి, ఆక్రమాలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు టీఆర్ఎస్ నాయకులు జైలుకు వెళ్ల డం ఖాయమని శాసన మండలి కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్‌అలీ జోస్యం చెప్పారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని భార్గవ్‌దేశ్ పాండే నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం టీఎన్జీవోస్ సంఘ భవనంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హమీల్లో ఏ ఒక్కటీ ఇంతవరకు నెరవేర్చలేదని అన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు. ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఒక్కో వ్యక్తిపై రూ.53 వేల భారం పడుతుందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ స్తుందని ధీమా వ్యక్తం చేశారు. మజ్లిస్ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ అక్రమంగా వేలాది కోట్లు సంపాదించుకున్నాడని, కేసీఆర్ ప్రభుత్వాన్ని తానే నడుపుతున్నట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తమ మద్దతు ఉంటుందన్నారు. ప్రభుత్వం వారి సమ్మెను నిర్వీర్యం చేయడం సరి కాదన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇన్చార్జీ భార్గవ్‌దేశ్‌పాండే, నాయకులు హరినాయక్, అనిల్‌జాదవ్, సాజిద్‌ఖాన్, జ్యోతి, మునిగెలనర్సింగ్, మంగేష్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. -
‘రాష్ట్రంలో మహిళ అంటే కవిత ఒక్కరేనా’
హైదరాబాద్: బడ్జెట్ పేరిట అంకెల గారడీ చేసి అల్లావుద్దీన్ అద్భుత దీపంలాంటి బడ్జెట్ ప్రవేశ పెట్టకుండా, వాస్తవ బడ్జెట్‌ను తీసుకురావాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, జనాభాలో సగం ఉన్న మహిళలను కేసీఆర్ అవమాన పరిచారన్నారు. క్యాబినెట్లో ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో మహిళ అంటే మీ కూతురు మాత్రమేనా అని ప్రశ్నించారు. మహిళలకు మంత్రి పదవులు ఇస్తే తన కూతరుకు ప్రాధాన్యత తగ్గుతుందని కేసీఆర్ భయపడుతున్నారు. ఆడవాళ్లకు ఒక్క పదవి ఇవ్వకుండా సిగ్గులేకుండా సంబురాలు జరుపుకుంటున్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఒక్క ఎమ్మెల్సీ పదవైనా మహిళకు కేటాయించలన్నారు. దేశంలో మహిళలకు అన్యాయం జరుగుతున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని షబ్బీర్‌అలీ అన్నారు.