‘రాష్ట్రంలో మహిళ అంటే కవిత ఒక్కరేనా’
‘రాష్ట్రంలో మహిళ అంటే కవిత ఒక్కరేనా’
Published Wed, Mar 8 2017 1:21 PM | Last Updated on Tue, Sep 4 2018 4:54 PM
హైదరాబాద్: బడ్జెట్ పేరిట అంకెల గారడీ చేసి అల్లావుద్దీన్ అద్భుత దీపంలాంటి బడ్జెట్ ప్రవేశ పెట్టకుండా, వాస్తవ బడ్జెట్‌ను తీసుకురావాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, జనాభాలో సగం ఉన్న మహిళలను కేసీఆర్ అవమాన పరిచారన్నారు. క్యాబినెట్‌లో ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు.
రాష్ట్రంలో మహిళ అంటే మీ కూతురు మాత్రమేనా అని ప్రశ్నించారు. మహిళలకు మంత్రి పదవులు ఇస్తే తన కూతరుకు ప్రాధాన్యత తగ్గుతుందని కేసీఆర్ భయపడుతున్నారు. ఆడవాళ్లకు ఒక్క పదవి ఇవ్వకుండా సిగ్గులేకుండా సంబురాలు జరుపుకుంటున్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఒక్క ఎమ్మెల్సీ పదవైనా మహిళకు కేటాయించలన్నారు. దేశంలో మహిళలకు అన్యాయం జరుగుతున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని షబ్బీర్‌అలీ అన్నారు.
Advertisement
Advertisement