Shahdara area
-
బీడీ అడిగాడని.. బండరాయితో బాది చంపేశాడు!
ఒక్క బీడీ కోసం ఇద్దరి మధ్య జరిగిన గొడవ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. దేశరాజధాని ఢిల్లీలోని షాహ్దరా ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. కస్తూర్బా నగర్‌కు చెందిన సన్నీ(20) గురువారం జ్వాలానగర్‌కు చెందిన రాజేశ్ శ్మశానవాటిక సమీపంలో కలుసుకున్నారు. ఆ సమయంలో సన్నీ బీడీ ఇవ్వాలని రాజేశ్‌ను కోరాడు. ఈ విషయం ఇద్దరి మధ్యా వాగ్వాదానికి దారి తీసింది. తీవ్ర కోపోద్రిక్తుడైన రాజేశ్ పెద్ద బండరాయితో సన్నీ తలపై మోదాడు. దీంతో, సన్నీ అక్కడికక్కడే నేలకూలడంతో రాజేశ్ పరారయ్యాడు.సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి చూడగా సన్నీ రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించాడు. సన్నీ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించిన పోలీసులు, పరారీలో ఉన్న రాజేశ్‌ను శుక్రవారం పట్టుకున్నారు. విచారణలో అతడు నేరం అంగీకరించా డని పోలీసులు తెలిపారు. కాగా, సన్నీ మైనర్‌గా ఉన్నప్పుడే హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడని, అతడిపై ఆయుధాల చట్టం కేసు కూడా ఉందని వివరించారు.కశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లాలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సోపొర్ ప్రాంతంలోని పానీపొరాలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందుకున్న బలగాలు గురువారం రాత్రి నుంచి కార్డన్‌సెర్చ్ కొనసాగిస్తున్నాయి. అధికారులు ముందుగా ఆ ప్రాంతం నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. శుక్రవారం ఉదయం భద్రతాబలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు మృతి చెందారు. మృతుల వివరాలు, వారు ఏ ఉగ్ర సంస్థకు చెందిన వారో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.ముగ్గురు మావోయిస్టులు మృతి ఛత్తీస్‌గఢ్‌లో శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. బిజాపూర్ జిల్లా పామేడు పోలీస్‌స్టేషన్ పరిధి రేఖపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా, సీఆర్పీఎఫ్ బలగాలు గాలింపు చేపట్టాయి. శుక్రవారం ఉదయం రేఖపల్లి–కోమటపల్లి అటవీ ప్రాంతంలో తారసపడిన మావోయిస్టులు కాల్పులకు దిగడంతో పోలీసులు సైతం కాల్పులు జరిపారు. గంట పాటు హోరాహోరీగా సాగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలి నుంచి ఒక ఎస్ఎల్ఆర్, ఒక స్నైపర్ తుపాకీ, ఒక 12 బోర్ రైఫిల్, ఒక మజిల్ లోడింగ్ రైఫిల్, గ్రెనేడ్ లాంచర్ తూటాలు, మందుగుండు సామగ్రి స్వాదీనం చేసుకున్నారు. చదవండి: కోట్లలో కట్నం.. ఆరంకెల జీతం.. అత్తింటి వేధింపులతో కోడలి ఆత్మహత్య? -
డబ్బుల కోసం బామ్మను చంపేశాడు
న్యూఢిల్లీ: జల్సాగా తిరగాలనే కోరికతో ఓ 15 ఏళ్ల బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్నేహితుడి సాయంతో ఎవరికీ అనుమానం రాకుండా బామ్మను చంపేసి, ఆమె దగ్గరున్న డబ్బులు ఎత్తుకుపోయాడు. ఈ ఘటన ఢిల్లీలోని షహదారా ఏరియాలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. జీటీబీ ఎన్‌క్లేవ్‌లోని ఓ ఇంట్లో వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. పక్క వీధిలోనే వారి కుమారుడి కుటుంబం ఉంటోంది. గురువారం మధ్యాహ్నం వృద్ధురాలు(77) ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తొమ్మిదో తరగతి చదివే ఆమె మనవడు స్నేహితుడితో వారింటికి కలిసి వచ్చాడు. ఆ సమయంలో బామ్మ నిద్రిస్తుండటం గమనించి, దుప్పటితో ఆమెను ఊపిరాడకుండా గట్టిగా అదిమారు. ఆపైన పదునైన వస్తువుతో నుదుటిపై గట్టిగా కొట్టడంతో ఆమె చనిపోయింది. అనంతరం బాలులిద్దరూ బీరువాలో ఉన్న రూ.14 వేలను తస్కరించి వెళ్లిపోయారు. కొద్దిసేపయ్యాక ఇంటికి చేరుకున్న వృద్ధుడు.. భార్య నిద్రలోనే చనిపోయిందని భావించి, కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి వృద్ధురాలి నుదుడి గాయం ఉన్న విషయాన్ని గుర్తించారు. బీరువా లాకర్లో డబ్బు మాయమైన విషయాన్ని తెలుసుకున్న వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శుక్రవారం మనవడిని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. -
ఏడేళ్ల బాలుడిపై యాసిడ్ దాడి
న్యూఢిల్లీ : క్షణికావేశంలో ఇతరులపై దాడులు చేసేవారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతుంది. తాజాగా ఓ షాపు యాజమాని తన షాపు ముందు ఆడుకుంటున్న ఏడేళ్ల బాలుడిపై యాసిడ్ దాడి చేశాడు. మంగళవారం షహదర ప్రాంతంలోని గాంధీనగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలవరం రేపింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాలున్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. బాలుడు అల్లరి చేస్తున్నాడనే కారణంతోనే నిందితుడు ఈ దాడికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. గత ఏడాది వాయువ్య ఢిల్లీలోని భరత్‌నగర్‌లో 70 ఏళ్ల వృద్దుడు ఇదే తరహాలో ఇద్దరు మహిళలు, ఆరుగురు పిల్లలపై యాసిడ్ దాడి చేశాడు. పిల్లలు తన ఇంటి ముందు అల్లరి చేస్తుడటంతో వారిని పక్కకి వెళ్లి ఆడుకోవాల్సిందిగా కోరానని, వారు వినకపోవడంతో దాడి చేశానని అతడు పోలీసులకు తెలిపాడు. చిన్నపిల్లలపై ఈ తరహ దాడులు జరుగుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. -
దేశ రాజధానిలో అగ్నిప్రమాదం
-
దేశ రాజధానిలో అగ్నిప్రమాదం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షహదర ప్రాంతంలో మోహన్ పార్క్ వద్ద బుధవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కనీసం ముగ్గురు మరణించగా, మరో పదిమంది గాయపడ్డారు. వాహనాలు, ఇతర వస్తువులు కాలిపోయాయి. ఓ భవంతిలో మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసింది. ఆ ప్రాంతంలో పరిస్థితి అదుపులో ఉన్నట్టు అధికారులు చెప్పారు. ప్రమాదం జరిగిన భవంతిలో నివసిస్తున్నవారిని కాపాడినట్టు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సివుంది.