shamir pet
-
మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో ఘోర ప్రమాదం
-
చెరువులో దూకి ఇద్దరు వైద్యులు ఆత్మహత్య
-
శామీర్‌పేట చెరువులో శవాలై తేలిన డాక్టర్లు, సెల్ఫీనే కారణమా?
మేడ్చల్: శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద చెరువులో దూకి ఇద్దరు యువ డాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఇద్దరు వైద్యులు ఆదివారం సాయంత్రం ఎఫ్‌జడ్ బైక్‌పై వచ్చి శామీర్‌పేట చెరువులో దూకినట్లు తెలిపారు. వీరిలో ఒకరు అల్వాల్ ఎక్సెల్ ఆస్పత్రిలో హోమియోపతి జూనియర్ డాక్టర్ నందన్ కాగా.. మరొకరు ఆయుర్వేదిక్ వైద్యుడు గౌతంగా వెల్లడించారు. అల్వాల్ సూర్య నగర్ ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివాసముండే ఈ ఇద్దరు వైద్యులు అన్నాదమ్ములని పోలీసులు తెలిపారు. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను బయటికి తీసినట్టు వెల్లడించారు. డాక్టర్లిద్దరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. వారిద్దరూ ఆత్మహత్య చేసకున్నారా? లేక ప్రమాదవశాత్తూ చెరువులో పడిపోయారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. నిన్న సాయంత్రం ఇంటి నుంచి బైక్ వెళ్లి చెరువులో శవాలుగా తేలారని మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. శామీర్‌పేట్ అన్నదమ్ముల మృతికి సేల్ఫీనే కారణమా? ఈ ఘటనపై శామీర్‌పేట సీఐ మాట్లాడుతూ.. యువ డాక్టర్లు ఫోటోలు తీసుకుంటుండగా చెరువులో జారీ పడిపోయినట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు. కాగా, వారం రోజుల క్రితం నందన్ దగ్గరకి సోదరుడు గౌతం వచ్చినట్లు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఇద్దరు కలిసి శామీర్‌పేట చెరువు వద్దకు వచ్చినట్లు తెలిపారు. నందన్ ఫోటోలు తీసుకునే క్రమంలో నీటిలో పడిపోయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. నందన్‌ను కాపాడేందుకు గౌతం నీటిలో దూకి ఉంటాడని అన్నారు. కాగా ఈతగాళ్లు ఇద్దరు యువ డాక్టర్ల మృత దేహాలను వెలికితీశారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు శామీర్‌పేట సీఐ తెలిపారు. చదవండి: భూతగాదాలు, పాత కక్షలు.. పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. -
కల్తీనూనె గుట్టు రట్టు
-
పైన పటారం లోన లొటారం
శామీర్‌పేట్ : సీఎం కేసీఆర్ దత్తత గ్రామాలు కలిగిన మండలం... నూతనంగా ఏర్పడిన మేడ్చల్ జిల్లాకు శామీర్‌పేట మండలంలో నూతన కలెక్టర్ కార్యాలయ నిర్మాణం... హైదరబాద్–కరీంనగర్ జాతీయ రహదారి... కనీసం వారంలో ఒక్క రోజైన తెలంగాణ ముఖ్య మంత్రి ప్రయాణించే మార్గం... ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ మండలానికి ప్రాథమి క ఆరోగ్య కేంద్రం ఓ మచ్చలా కనబడుతోందని స్థానికులే అంటున్నా రు. ఎందుకంటే ఆరోగ్య కేంద్రం ఎప్పుడూ అపరిశుభ్రత, వసతు లు లేమితో కనబడుతోంది. శామీర్‌పేట మండల ప్రథమిక ఆరోగ్య కేంద్రానికి ఏడాదిలో రెండుసార్లు రంగులు వేశారు. ఆసుపత్రి బయటి నుంచి చూస్తే మాత్రం రంగులతో కళకళలాడుతోంది. కానీ ఆసుపత్రిలోని సౌకర్యాలు మాత్రం లేవు. రోగుల సౌకర్యార్థ ఏర్పాటు చేసిన మూత్రశాలలు అధ్వానంగా తయారయ్యాయి. ఆసుపత్రి వెనక భాగంలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. పాడైన మాత్రలు, పత్తి, ఇతర చెత్తను ఆసుపత్రి ఆవరణలోనే పడేస్తున్నారు. ఆస్పత్రిలోని వాటర్ ప్లాంట్ పాడైపోయింది. ఇన్ని సమస్యలు ఉన్నా ఏ అధికారి పట్టించుకున్న పాపానపోలేదు. రోగులతో దురుసుగా ప్రవర్తిస్తారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు రోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. నగరానికి చేరువలో ఉండటంలో మండలంలో వివిధ గ్రామాల ప్రజలే కాకుండా పక్క మండలాల ప్రజలూ వస్తుంటారు. ఆసుపత్రి సిబ్బంది ప్రవర్తనతో ఇక్కడికి వచ్చే రోగులు మానసికంగా కూడా బాధ పడుతున్నారు. ఈ తీరును వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది మార్చుకోవాలి. – ఇర్రి రవీందర్‌రెడ్డి, జగన్‌గూడ గ్రామ ఎంపీటీసీ సీఎం హామీలు ప్రకటనలకే పరిమితం సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ పక్క మండలమైన శామీర్‌పేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధ్వానంగా ఉండటం బాధాకరం. ఇక్కడే ఇలా ఉందంటే రాష్ట్రం లో ఆరోగ్య కేంద్రాల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేక నిధులు కేటాయించి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యాయి. ఇప్పటికైన సంబంధిత అధికారులు మేల్కొని ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేయాలి. – వి.సుదర్శన్, కాంగ్రెస్ మండలం అధ్యక్షులు గాంధీ ఆసుపత్రి అందించే సేవలు ఇక్కడా ఉండేవి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్లే అభివృద్ధిలో వెనుకబడిపోయింది. రాజీ వ్రహదారి పక్కనే ఈ ఆసుపత్రి ఉం డటంతో రోగులు అధిక సంఖ్య లో వస్తుంటారు. ఇప్పటికైనా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి మెరుగైన సేవలు అందించడానికి చొరవ తీసుకోవాలి. – కృష్ణయాదవ్, తూంకుంట గ్రామస్తుడు -
పండుగనాడు దోపిడీ దొంగల బీభత్సం
సాక్షి, హైదరాబాద్ : నగరం పరిధిలో పండుగనాడు దొంగలు బీభత్సం సృష్టించారు. షామిర్పేట్ మండలంలోని తుర్కపల్లి రాజీవ్ రహదారి పక్కన ఉన్న ఏటీఎంలో చొరబడి డబ్బు దొంగిలించేందుకు విఫలయత్నం చేశారు. మనీస్పాట్ అనే ఓ ప్రైవేట్ ఏటీఎంను పగులగొట్టేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకపోవడంతో అక్కడి నుంచి పక్కనే ఉన్న ఓ మొబైల్ షాప్‌లోకి చొరబడ్డి దోచుకునే యత్నం చేశారు. చివరకు అక్కడ కూడా తమ ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో పరారయ్యారు. వారిని గుర్తించేందుకు ప్రస్తుతం పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. షామీర్పేట్ నేర విభాగానికి చెందిన పోలీసులు ఈ కేసును విచారణకు స్వీకరించారు. -
కృత్రిమ ఇసుక తయారీ స్థావరాలపై దాడులు
శామీర్‌పేట్ (రంగారెడ్డి) : శామీర్‌పేట్ మండలంలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా కృత్రిమ ఇసుక తయారుచేస్తున్నారన్న పక్కా సమాచారంతో సోమవారం కేంద్రాలపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో పలు వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. శామీర్‌పేట్ సీఐ సత్తయ్య మాట్లాడుతూ...మండలంలోని శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ లిమిట్స్‌లో కృత్రిమ ఇసుక స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు తెలిపారు. దాడుల్లో కృత్రిమ ఇసుక తయారుచేస్తున్న స్థావరాలను ధ్వంసం చేయడంతోపాటు వినియోగిస్తున్న పరికరాలను, నాలుగు ట్రాక్టర్లు, ఒక జేసీబీని సీజ్ చేసినట్లు తెలిపారు. కృత్రిమ ఇసుక తయారు చేస్తున్నవారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు వివరించారు. -
లారీ, కారు ఢీ: దంపతులు మృతి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండల తుర్కపల్లి వద్ద కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన సతీష్‌కుమార్(45), శ్రీలత(38) అనే దంపతులు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి సిరిసిల్ల వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.