పండుగనాడు దోపిడీ దొంగల బీభత్సం | robers tries to theft in atm shameerpet | Sakshi
Sakshi News home page

పండుగనాడు దోపిడీ దొంగల బీభత్సం

Published Thu, Oct 19 2017 12:02 PM | Last Updated on Thu, Aug 30 2018 5:24 PM

robers tries to theft in atm shameerpet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరం పరిధిలో పండుగనాడు దొంగలు బీభత్సం సృష్టించారు. షామిర్‌పేట్‌ మండలంలోని తుర్కపల్లి రాజీవ్‌ రహదారి పక్కన ఉన్న ఏటీఎంలో చొరబడి డబ్బు దొంగిలించేందుకు విఫలయత్నం చేశారు. మనీస్పాట్‌ అనే ఓ ప్రైవేట్‌ ఏటీఎంను పగులగొట్టేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకపోవడంతో అక్కడి నుంచి పక్కనే ఉన్న ఓ మొబైల్‌ షాప్‌లోకి చొరబడ్డి దోచుకునే యత్నం చేశారు. చివరకు అక్కడ కూడా తమ ప్లాన్‌ వర్కవుట్‌ కాకపోవడంతో పరారయ్యారు. వారిని గుర్తించేందుకు ప్రస్తుతం పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. షామీర్‌పేట్‌ నేర విభాగానికి చెందిన పోలీసులు ఈ కేసును విచారణకు స్వీకరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement