Shankar Goud
-
సోషల్ మీడియా దన్నుగా...
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో జరిగిన ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అని ప్రపంచం మొత్తం ఎదురు చూసింది. 18వ లోక్ సభకు జరిగిన ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 64.2 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని చరిత్ర సృష్టించారు. సుదీర్ఘంగా 81 రోజులు సాగిన ఈ ఎన్నికల ప్రక్రియ, కేంద్రంలో మళ్లీ కమల వికాసమా లేక హస్త ప్రభంజనమా అనే ఉత్కంఠకు తెర లేపింది. భారత ప్రజల చైతన్యస్ఫూర్తి ఈ ఎన్నికల్లో మరోసారి రుజువయ్యింది.‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ అనే నినాదంతో మూడోసారి అత్యధిక మెజార్టీతో అధికారంలోకి రావాలనుకున్న ఎన్డీఏ కూటమికి ఈ ఎన్నికల్లో వారు ఊహించిన ఫలితాలు రాలేదు. గత పదేండ్ల కాలంలో మోదీ నేతృత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరుగుదల వంటి అంశాలు ప్రజల్లో ఆ పార్టీపై నమ్మకం తగ్గేలా చేశాయి. కుల మతాలనూ, అయోధ్య రాముణ్ణీ ఎన్నికల్లో వాడుకొని లబ్ధి పొందాలని భావించినా ఆశించిన స్థాయిలో లబ్ధి చేకూరలేదు.ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి మోదీ ప్రభుత్వ వ్యతిరేక ప్రజా ఉద్యమం నడపడంలో కొంత వరకు సఫలం అయిందని చెప్పవచ్చు. ‘మోదీ 3.0 మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తారు’ అనే అంశం ప్రజల్లోకి బాగా వెళ్ళి, బీజేపీ ఓటు బ్యాంక్‌కు గండి కొట్టింది. ఓటర్లు ప్రతిపక్షానికి కావలసినంత బలాన్ని ఇచ్చారు. విధానపరమైన నిర్ణయాలలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.ఈ సారి ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం... ముఖ్యంగా యూట్యూబర్లు ధ్రువ్ రాఠీ, రవీష్ కుమార్ వంటి వారు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరచడంలో కీలకమైన పాత్ర పోషించారు. కేవలం ధ్రువ్ వీడియోలను 69 కోట్ల మంది ప్రజలు వీక్షించారంటే వారి ప్రభావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.ఉత్తర భారత దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రొజెక్టర్లు పెట్టి మరీ ఈ వీడియోలను ప్రజలు వీక్షించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే విధంగా పాలకులు నిర్ణయాలు తీసుకుని, ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందిస్తూ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ, కార్మిక– కర్షక సంక్షేమానికి పాటుపడుతూ, మహిళా సాధికారత సాధిస్తూ, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి కృషి చేస్తారని ఆశిద్దాం. – పాకాల శంకర్ గౌడ్, ఉపాధ్యాయుడు -
పార్టీ బలోపేతంపై దృష్టి: పవన్ కల్యాణ్
జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టిసారించామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. 'ఇందులో భాగంగా బొంగునూరి మహేందర్ రెడ్డి, నేమూరి శంకర్ గౌడ్, పి.హరిప్రసాద్‌లకు కీలక బాధ్యతలు అప్పగించాము. పార్టీ ఆవిర్భావ సమయంలో ఉపాధ్యక్షునిగా నియమితులైన మహేందర్ రెడ్డి తెలంగాణలో జనసేన పార్టీ రాజకీయ కార్యక్రమాలను సమన్వయం చేస్తారు. నేమూరి శంకర్ గౌడ్ పార్టీ తెలంగాణ ఇంచార్జిగా బాధ్యతలు నిర్వహిస్తారు. సీనియర్ పాత్రికేయుడు పి.హరిప్రసాద్‌ను పార్టీ మీడియా విభాగానికి హెడ్‌గా నియమించాము' అని ఓ ప్రకటనలో ఆయన వెల్లడించారు. 'రంగారెడ్డి జిల్లా డి.పోచంపల్లిలో జన్మించిన మహేందర్ రెడ్డి, బోరబండ నివాసి అయిన నేమూరి శంకర్ గౌడ్ వ్యాపారవేత్తలుగా స్థిరపడ్డారు. నేను స్థాపించిన కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్(సీఎంపీఎఫ్)లో చురుకైన కార్యకర్తలుగా పనిచేసిన వీరిద్దరూ రాజకీయ, సేవ కార్యక్రమాల్లో పయనిస్తున్నారు. గత పద్నాలుగేళ్లుగా వీరి అకుంఠిత దీక్ష, సేవా కార్యక్రమాల పట్ల అపేక్ష, రాజకీయాలపై గౌరవాన్ని చూసిన తర్వాత, జనసేన పార్టీకి బాధ్యతాయుతమైన క్రీయాశీలక నేతలుగా ఎంపిక చేశాము. పాత్రికేయుడిగా గత మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్న పి.హరిప్రసాద్ అనుభవం పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతుందని భావించి జనసేన పార్టీ మీడియా విభాగానికి హెడ్ గా నియమించాము' అని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. -
నీ అంతు చూస్తా...
ఎమ్మెల్యేను బెదిరించిన టీఆర్ఎస్ నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే చందానగర్: అధికారిక కార్యక్రమానికి పార్టీ నేతలను ఎలా పిలిచారని అధికారులను ప్రశ్నించిన ఎమ్మెల్యే అంతుచూస్తానని బెదిరించాడో టీఆర్ఎస్ నాయకుడు. రాష్ట్ర మంత్రి సమక్షంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. దీంతో సదరు ఎమ్మెల్యే తనకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించాడు. చందానగర్ సీఐ వాసు కథనం ప్రకారం... చందానగర్‌లో ఆదివారం నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగానికి ముందు నాయకులందరి పేర్లూ సంభోదించారు. అయితే, వేదిక ముందు ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు శేరిలింగంపల్లి టీఆర్ఎస్ ఇన్చార్జి కొమరగౌని శంకర్ గౌడ్ పేరు ప్రస్థావించలేదంటూ ఎంపీ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ జోక్యం చేసుకొని... ఇది అధికార కార్యక్రమం, ఆయన ను ఎలా పిలిచారని అధికారులను ప్రశ్నించారు. దీంతో కొంత గందరగోళం నెలకొంది. శంకర్ గౌడ్ నీకెందుకూ... కూర్చో అంటూ... ఎమ్మెల్యేను వేదికపైనే అన్నాడు. మంత్రి జోక్యం చేసుకొని ఇద్దరినీ సముదాయించారు. అనంతరం పింఛన్లు పంపిణీ చేసేందుకు వేదిక దిగి కిందకు వ చ్చారు. మంత్రి, ఎమ్మెల్యే పింఛన్లను పంపిణీ చేస్తుండగా ‘నీ సంగతి చూస్తా...అని దుర్భాషలాడుతూ బెదిరించినట్లు ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోటాపోటీ నినాదాలు... కార్యక్రమం ముగించుకొని బయటకి వచ్చిన ఎమ్మెల్యే గాంధీని చూస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు జై తెలంగాణ.. ఆంధ్ర గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు దీనికి ప్రతిగా నినాదాలు చేయడంతో కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకొని ఎమ్మెల్యేను అక్కడ నుంచి పంపివేయడంతో ఉద్రిక్తత సడలింది.