Shankarabharanam
-
విశ్వనాథ వనితలు
పాశ్చాత్య సంగీతపు పెనుతుఫానుకు అరచేతులు అడ్డుపెడుతుంది ఒక స్త్రీ. ఒక గొప్ప నాట్యకారుడి అంతిమ రోజులను అర్థమంతం చేస్తుంది మరో స్త్రీ. తనలోని కళను తాను కనుగొనడానికి గొప్ప సంఘర్షణ చేస్తుంది ఒక స్త్రీ. వ్యసనపరుడైన భర్తను సంస్కరించడానికి ఎడబాటు నిరసనను ఆశ్రయిస్తుంది మరో స్త్రీ. ప్రేమకు కులం లేదు అనే స్త్రీ... వరకట్నం వద్దు అనే స్త్రీ.. మందమతితో జీవితాన్ని పునర్నిర్మించుకునే స్త్రీ. అతడు చూపిన స్త్రీలు ఆత్మాభిమానం కలిగిన స్త్రీలు. ఆత్మవిశ్వాసాన్ని కలిగిన స్త్రీలు. భారతీయ సంస్కృతిని గౌరవించాలనుకునే స్త్రీలు. కె.విశ్వనాథ్ 92వ జన్మదినం సందర్భంగా.... ఆమెకు సంగీతం, నృత్యం అంటే ప్రాణం. కాని తల్లి ఆమెను ఒక వేశ్యను చేయాలనుకుంటుంది. బలవంతంగా ఆమెపై అత్యాచారం జరిగేలా చూస్తుంది. ఆమె కడుపున నలుసు పడుతుంది. కాని అది ఇష్టం లేని సంతానం. ఒక పాము కాటేస్తే వచ్చిన గర్భం. పుట్టబోయేది కూడా పామే. ఆమె అబార్షన్ చేయించుకోదు. ఆత్మహత్య చేసుకోదు. ఆ బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డకు సంగీతం నేర్పిస్తుంది. తరువాత తను దేవుడిగా భావించే శంకరశాస్త్రి దగ్గరకు పంపి ఆయన శిష్యుడిగా మారుస్తుంది. బయట దారిలో కనిపిస్తే ‘పాము’ పామే అవుతుంది. కాని శివుని మెడలో ఉండి కనిపిస్తే ‘శంకరాభరణం’ అవుతుంది. అథోముఖమైన తన జీవితాన్ని ఊర్థ్వంలోకి మార్చుకుని సంతృప్తి పొందిన ఆ స్త్రీ ‘శంకరాభరణం’లో మంజుభార్గవి. ఆ పాత్రను అంత తీక్షణంగా, ఔన్నత్యంగా తీర్చిదిద్దినవారు దర్శకడు కె.విశ్వనాథ్. ఒక కళాకారుణ్ణి తెలుసుకోవాలంటే అతడు పుట్టించిన పాత్రలను చూడాలి. మహిళల పట్ల అతడి దృక్పథం తెలియాలంటే అతడు సృష్టించిన మహిళా పాత్రలను చూడాలి. కె.విశ్వనాథ్ సృష్టించిన మహిళా పాత్రలు ప్రేక్షకులకు నచ్చిన పాత్రలు. ప్రేక్షకులు మెచ్చిన పాత్రలు. అంతేకాదు పరోక్షంగా తమ ప్రభావాన్ని వేసే పాత్రలు. ‘శుభలేఖ’ సినిమాలో సుమలత లెక్చరర్. ఎంతో చక్కని అమ్మాయి. ఆమెతో జీవితం ఏ పురుషుడికైనా అపురూపంగా ఉండగలదు. కాని ఆమెను కోడలిగా తెచ్చుకోవడానికి బోలెడంత కట్నం అడుగుతాడు ఆ సినిమాలో పెద్దమనిషి సత్యనారాయణ. డబ్బు, కానుకలు, కార్లు... ఒకటేమిటి అడగనిది లేదు. ఆత్మాభిమానం ఉన్న ఏ అమ్మాయి అయినా ఊరుకుంటుందా? సుమలత తిరగబడుతుంది. సంతలో పశువును కొన్నట్టు వరుణ్ణి కొననని చెప్పి సంస్కారం ఉన్న వ్యక్తి హోటల్లో వెయిటర్ అయినా సరే అతణ్ణే చేసుకుంటానని చిరంజీవిని చేసుకుంటుంది. మనిషికి ఉండాల్సిన సంస్కార సంపదను గుర్తు చేస్తుంది ఈ సినిమాలో సుమలత. ‘సాగర సంగమం’లో జయప్రద ఫీచర్ జర్నలిస్ట్. చదువుకున్న అమ్మాయి. భారతీయ కళలు ఎంత గొప్పవో తెలుసు. అందుకే కమల హాసన్‌లోని ఆర్టిస్ట్‌ను గుర్తించింది. అతణ్ణి ఇష్టపడటం, కోరుకోవడం జరక్కపోవచ్చు. అతడి కళను ఇష్టపడటం ఆపాల్సిన అవసరం లేదని గ్రహిస్తుంది. విఫల కళాకారుడిగా ఉన్న కమల హాసన్ చివరి రోజులను అర్థవంతం చేయడానికి అతడిలోని కళాకారుణ్ణి లోకం గుర్తించేలా చేయడానికి ఆమె ప్రయత్నిస్తుంది. తన కుమార్తెనే అతని శిష్యురాలిగా చేస్తుంది. ఆమె రాకముందు అతడు తాగుబోతు. కాని మరణించే సమయానికి గొప్ప కళాకారుడు. స్త్రీ కాదు లత. ఒక్కోసారి పురుషుడే లత. ఆ లతకు ఒక దన్ను కావాలి. ఆ దన్ను జయప్రదలాంటి స్త్రీ అని ఆ సినిమాలో విశ్వనాథ్ చూపిస్తారు. ‘సప్తపది’లో ఆ అమ్మాయి అతడి కులాన్ని చూడదు. అతడి చేతిలోని వేణువునే చూస్తుంది. ఆ వేణునాదాన్నే వింటుంది. ఏడడుగుల బంధంలోకి నడవాలంటే కావాలసింది స్త్రీ, పురుషుల మధ్య ఏర్పడే పరస్పర ప్రేమ, గౌరవం. అంతే తప్ప కులం, అంతస్తు కాదు. సంప్రదాయాల కట్టుబాట్లు ఉన్న ఇంట పుట్టినా హృదయం చెప్పిందే చేసిందా అమ్మాయి. ఆమె ప్రేమను లోకం హర్షించింది. యువతకు లక్ష్యం ఉందా? కళ పట్ల అనురక్తి ఉందా? తమలోని కళను కాకుండా కాసులను వెతికే వేటను కొనసాగిస్తే అందులో ఏదైనా సంతృప్తి ఉందా? ‘స్వర్ణకమలం’లో గొప్ప నాట్యగత్తె భానుప్రియ. కాని ఆ నాట్యాన్ని ఆమె గుర్తించదు. ఆ కళను గుర్తించదు. ఒక కూచిపూడి నృత్యకళాకారిణిగా ఉండటం కన్నా హోటల్లో హౌస్‌కీపింగ్‌లో పని చేయడమే గొప్ప అని భావిస్తుంది. ఆ అమ్మాయికి ధైర్యం ఉంది. తెగువ ఉంది. చురుకుదనం ఉంది. టాలెంట్ ఉంది. స్వీయజ్ఞానమే కావాల్సింది. కాని చివరలో ఆత్మసాక్షాత్కారం అవుతుంది. తను గొప్ప డ్యాన్సర్ అవుతుంది. మూసలో పడేవాళ్లు మూసలో పడుతూనే ఉంటారు. కొత్తదారి వెతికినవారు భానుప్రియ అవుతారు. మీరు మాత్రమే నడిచే దారిలో నడవండి అని చెప్పిందా పాత్ర. లైఫ్‌లో ఒక్కోసారి ఆప్షన్ ఉండదు. మనం టిక్ పెట్టేలోపలే విధి టిక్ పెట్టేస్తుంది. ‘స్వాతిముత్యం’లో రాధికకు భర్త చనిపోతాడు. ఒక కొడుకు. ఆ కష్టం అలా ఉండగానే మందమతి అయిన కమల హాసన్ తాళి కట్టేస్తాడు. అంతవరకూ ఆమె జీవితం ఏమిటో ఆమెకు తెలియదు. ఇప్పుడు ఒక మీసాలు లేని, ఒక మీసాలు ఉన్న పిల్లాడితో కొత్త జీవితం నిర్మించుకోవాలి. ఆమె నిర్మించుకుంటుంది. అతణ్ణి కర్తవ్యోన్ముఖుణ్ణి చేస్తుంది. అడ్డంకులను జయించుకుంటూ అతడి ద్వారా తన జీవితాన్ని జయిస్తుంది. స్థిర సంకల్పం ఉంటే కష్టాలను దాటొచ్చని చెబుతుంది. కె.విశ్వనాథ్ మహిళా పాత్రలలో స్వాతిముత్యంలో రాధిక పాత్ర మర్చిపోలేము. ‘శృతిలయలు’లో సుమలత భర్త రాజశేఖర్. కళకారుడు. కాని స్త్రీలోలుడు అవుతాడు. వ్యసనపరుడవుతాడు. లక్ష్యరహితుడవుతాడు. అతణ్ణి సరిచేయాలి. దానికి ఇంట్లో ఉండి రాద్ధాంతం పెట్టుకోదు ఆమె. కొడుకును తీసుకుని దూరం జరుగుతుంది. హుందాగా ఉండిపోతుంది. ఎదురు చూస్తుంది. ఏ మనిషైనా బురదలో ఎక్కువసేపు ఉండలేరు. రాజశేఖర్ కూడా ఉండలేకపోతాడు. మగాడికి గౌరవం కుటుంబంతోనే అని గ్రహిస్తాడు. మగాడికి గౌరవం భార్య సమక్షంలోనే అని గ్రహిస్తాడు. మగాడికి గౌరవం ఒక లక్ష్యంతో పని చేయడమే అని గ్రహిస్తాడు. ఆమె పాదాల దగ్గరకు తిరిగి వస్తాడు. విశ్వనాథ్ సృష్టించిన స్త్రీలు లౌడ్‌గా ఉండరు. కాని వారు స్పష్టంగా ఉంటారు. సౌమ్యంగా ఉంటారు. స్థిరంగా సాధించుకునే వ్యక్తులుగా ఉంటారు. సమాజంలో స్త్రీలకు ఉండే పరిమితులు వారికి తెలుసు. కాని వాటిని సవాలు చేయడం పనిగా పెట్టుకోకుండా ఆ ఇచ్చిన బరిలోనే ఎలా విజయం సాధించాలో తెలుసుకుంటారు. విశ్వనాథ్ స్త్రీలు తెలుగుదనం చూపిన స్త్రీలు. మేలిమిదనం చూపిన స్త్రీలు. అందమైన స్త్రీలు... రూపానికి కాని... వ్యక్తిత్వానికి కాని! సీతాలు సింగారం మాలచ్చి బంగారం సీతామాలచ్చిమంటే శ్రీలచ్చి అవతారం – సాక్షి ఫ్యామిలీ -
'శంకరాభరణం' మూవీ రివ్యూ
టైటిల్ : శంకరాభరణం జానర్ : క్రైమ్ కామెడీ థ్రిల్లర్ తారాగణం : నిఖిల్, నందిత, రావు రమేష్, సుమన్, అంజలి దర్శకత్వం : ఉదయ్ నందనవనం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ: కోన వెంకట్ నిర్మాత : ఎమ్ వి వి సత్యనారాయణ సంగీతం : ప్రవీణ్ లక్కరాజు ఈ మధ్య వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బంది పడుతున్న కథా రచయిత కోన వెంకట్ తనని తాను ప్రూవ్ చేసుకోవటానికి, అన్నీ తానే అయి తెరకెక్కించిన సినిమా శంకరాభరణం. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన 'ఫస్ గయా రే ఒబామా' సినిమా లైన్‌ను తీసుకొని, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథా కథనాలు అందించారు కోన. వరుసగా ప్రయోగాత్మక చిత్రాలే చేస్తూ సక్సెస్ఫుల్ హీరో అనిపించుకున్న నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఆ అంచనాలను శంకరాభరణం అందుకుందా..? కోన వెంకట్ ఫ్లాప్ ట్రాక్ నుంచి బయటపడ్డాడా..? కథ : గౌతమ్ (నిఖిల్ సిద్దార్ధ్) న్యూయార్క్‌లో ఆనందంగా జీవితం గడుపుతున్న కుర్రాడు. తన తండ్రికి వచ్చిన ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు 25 ఏళ్ల క్రితమే వదిలేసి వచ్చిన తల్లి ఆస్తిని అమ్మడానికి ఇండియాకు వస్తాడు. బిహార్‌లోని పాట్నా సమీపంలో తన తల్లి పేరున ఉన్న శంకరాభరణం ప్యాలెస్‌ను అమ్మి ఆ డబ్బుతో తండ్రి సమస్యలను తీర్చేయాలనుకుంటాడు. అదే ప్యాలెస్‌లో నివాసం ఉంటున్న గౌతమ్ తల్లి కుటుంబసభ్యులు, ఆమె తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకొని వెళ్లిపోయిందని ద్వేషిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాకు వచ్చిన గౌతమ్‌కు తన తండ్రి చిన్ననాటి స్నేహితుడి కొడుకు (సప్తగిరి) సాయంగా వస్తాడు. ఇద్దరు కలిసి ప్యాలెస్‌లో ఉంటున్నవారిని ఎలాగైనా మోసం చేసి ప్యాలెస్ అమ్మేయాలని ప్లాన్ చేసుకుంటారు. అదే సమయంలో ఆ ఇంట్లో జరుగుతున్న శుభకార్యంలో పాల్గొన్న గౌతమ్, అనుబంధాల విలువ తెలుసుకొని ఆ పని చేయలేకపోతాడు. అప్పటికే బిహార్‌లో భారీగా ఆస్తులున్న ఎన్నారై అడుగుపెట్టడాన్న వార్త అక్కడున్న కిడ్నాపర్ గ్యాంగ్‌లకు తెలిసిపోతుంది. చేతిలొ చిల్లిగవ్వ కూడా లేని గౌతమ్‌ను కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లు ఏమయ్యారు, గౌతమ్ వారి నుంచి ఎలా తప్పించుకున్నాడు. చివరకు తనకు కావాల్సిన డబ్బును ఎలా సంపాదించాడు అన్నదే మిగతా కథ. నటీనటులు : వరుసగా ప్రయోగాత్మక చిత్రాలనే ఎంచుకుంటున్న నిఖిల్ మరో బరువైన పాత్రతో ఆకట్టుకున్నాడు. జాలీ లైఫ్ నుంచి కష్టాల్లోకి అడుగుపెట్టిన కుర్రాడి పరిస్థితి ఎలా ఉంటుందో అద్భుతంగా చూపించాడు. ముఖ్యంగా లుక్, డైలాగ్ డెలివరీ లాంటి విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న నిఖిల్ ఎన్నారైగా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. హ్యాపీ ఠాకూర్ పాత్రలో నందిత ఆకట్టుకుంది. కిడ్నాపర్‌గా సంజయ్ మిశ్రా కామెడీ పండిచాడు, చిన్న పాత్రలో కనిపించిన అంజలి కూడా గ్లామర్‌తో పాటు విలనీని కూడా బాగా పండించింది. క్లైమాక్స్‌లో వచ్చిన సంపత్ కూడా తన మార్క్ యాక్టింగ్‌తో మెప్పించాడు. రావు రమేష్, సుమన్, రఘుబాబు లాంటి నటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : శంకరాభరణం సినిమాకు అన్నీ తానే అయి పని చేసిన కోన వెంకట్ రచయితగా తన మార్క్ చూపించాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే డైలాగ్‌లతో థియేటర్లో నవ్వులు పూయించాడు. తొలి ప్రయత్నంగా దర్శకత్వం వహించిన ఉదయ్ నందనవనం, కథ మీద మరింత పట్టు చూపించి ఉండాల్సింది. కథనంలో థ్రిల్లర్ సినిమాకు ఉండాల్సిన వేగం కనిపించలేదు. ప్రవీణ్ సంగీతం బాగుంది. రొటీన్ కమర్షియల్ మ్యూజిక్ కు భిన్నంగా డిఫరెంట్ సాంగ్స్ తో అలరించాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అప్ టు ద మార్క్ లేదు. ఎడిటింగ్ పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. తొలి భాగంలో చాలా సీన్లు సాగదీసినట్టుగా అనిపిస్తాయి. విశ్లేషణ : సినిమా అంతా బిహార్ బ్యాక్ డ్రాప్ లోనే జరిగినా అన్ని క్యారెక్టర్లు తెలుగులోనే మాట్లాడతాయి. తెలుగు ప్రేక్షకుల కోసం అలా ప్లాన్ చేసినా, కనిపించే నేపథ్యానికి, వినిపించే భాషకి సంబంధం లేనట్టు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో డబ్బింగ్ సినిమా చూస్తున్నామా అన్ని ఫీల్ కలుగుతుంది. స్క్రీన్ ప్లే రచయితగా మంచి పేరున్న కోన వెంకట్, ఈ సినిమాలో మాత్రం స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకోలేకపోయాడు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ఫస్టాఫ్‌లో ఆ స్థాయి వేగం కనిపించదు. సెకండాఫ్ కాస్త ట్రాక్ ఎక్కినట్టు కనిపించినా, ఒక సన్నివేశానికి మరో సన్నివేశానికి సంబంధం లేకుండా మారిపోతుంటుంది. దీంతో ప్రేక్షకుడు ఏ సమయంలోనూ కథతో కనెక్ట్ అవ్వడు. సినిమా అంతా సో సోగా నడిపించిన కోన.. క్లైమాక్స్ విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకున్నాడు. హీరో ఆడే మైండ్ గేమ్ తో ఆఖరి 30 నిమిషాలు థ్రిల్లింగ్‌గా కథ నడిపించాడు. ప్లస్ పాయింట్స్ : కోన డైలాగ్స్ క్లైమాక్స్ నిర్మాణ విలువలు మైనస్ పాయింట్స్ : ఫస్టాఫ్ స్లో నేరేషన్ ఎడిటింగ్ ఓవరాల్ గా శంకరాభరణం ఏ మాత్రం థ్రిల్లింగ్‌గా అనిపించని క్రైమ్ కామెడీ -
థ్యాంక్యూ భల్లాలదేవ : నిఖిల్
స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య వంటి వైవిధ్యభరితమైన చిత్రాలతో దూసుకెళుతున్న టాలీవుడ్ యువ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం 'శంకరాభరణం'. నిఖిల్ సరసన నందిత కథానాయికగా నటించింది. ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఉదయ్ నందనవనమ్ దర్శకుడు. ఇటీవలే 'సర్ధార్ గబ్బర్‌సింగ్' సెట్స్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విడుదలైన 'శంకరాభరణం' టీజర్ ఆకట్టుకుంటోంది. కాగా మంగళవారం 'శంకరాభరణం' సినిమా ప్రమోషనల్ సాంగ్‌ను టాలీవుడ్ కండల వీరుడు హీరో రానా లాంచ్ చేశారు. కాసేపట్లో ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ అవుతుందని, అయితే ఎవరు రిలీజ్ చేస్తారో మాత్రం సస్పెన్స్ అంటూ ముందుగానే ట్వీట్ చేసిన నిఖిల్.. రానా సాంగ్ లాంచ్ చేయగానే భల్లాలదేవకి థ్యాంక్యూ చెప్తూ ట్వీట్ చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే కోన వెంకట్ కూడా రానాకు థ్యాంక్స్ అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. రానా కూడా సినిమాని ఉద్దేశిస్తూ గుడ్ లక్ చెప్పారు. దీపావళి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. The Promotional song of SHANKARABHARANAM... Thanking the Awesome Bhallala Deva @RanaDaggubati for launching it :-) https://t.co/4s1IcHdtAH — Nikhil Siddhartha (@actor_Nikhil) October 27, 2015 -
దొంగల ముఠా రాణిగా అంజలి ?