
థ్యాంక్యూ భల్లాలదేవ : నిఖిల్
స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య వంటి వైవిధ్యభరితమైన చిత్రాలతో దూసుకెళుతున్న టాలీవుడ్ యువ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం 'శంకరాభరణం'. నిఖిల్ సరసన నందిత కథానాయికగా నటించింది. ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఉదయ్ నందనవనమ్ దర్శకుడు. ఇటీవలే 'సర్ధార్ గబ్బర్సింగ్' సెట్స్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విడుదలైన 'శంకరాభరణం' టీజర్ ఆకట్టుకుంటోంది.
కాగా మంగళవారం 'శంకరాభరణం' సినిమా ప్రమోషనల్ సాంగ్ను టాలీవుడ్ కండల వీరుడు హీరో రానా లాంచ్ చేశారు. కాసేపట్లో ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ అవుతుందని, అయితే ఎవరు రిలీజ్ చేస్తారో మాత్రం సస్పెన్స్ అంటూ ముందుగానే ట్వీట్ చేసిన నిఖిల్.. రానా సాంగ్ లాంచ్ చేయగానే భల్లాలదేవకి థ్యాంక్యూ చెప్తూ ట్వీట్ చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే కోన వెంకట్ కూడా రానాకు థ్యాంక్స్ అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. రానా కూడా సినిమాని ఉద్దేశిస్తూ గుడ్ లక్ చెప్పారు. దీపావళి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
The Promotional song of SHANKARABHARANAM... Thanking the Awesome Bhallala Deva @RanaDaggubati for launching it :-) https://t.co/4s1IcHdtAH
— Nikhil Siddhartha (@actor_Nikhil) October 27, 2015