Shankarrao
-
శివసేనలో చేరిన స్వతంత్ర ఎమ్మెల్యే
ముంబై : మహారాష్ట్ర మంత్రి, స్వతంత్ర ఎమ్మెల్యే శంకర్ రావు గదఖ్ అధికార శివసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శంకర్ రావు అహ్మద్ నగర్ జిల్లా నేవాసా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో స్వతంత్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వా శివసేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో చేరి భూమి, జలశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం శివసేనాధిపతి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసమైన మాతోశ్రీకి వచ్చిన శంకర్ రావు శివసేన పార్టీలో చేరారు. తమ పార్టీలో చేరిన శంకర్ రావుకు సీఎం ఠాక్రే శివ బంధన్‌ను కట్టి పార్టీలోకి ఆహ్వానించారు. (సుశాంత్ కేసు: ‘మహా’ప్రభుత్వంపై కేంద్రం కుట్ర) ఈ కార్యక్రమానికి పార్టీ కార్యదర్శి మిలింద్ నార్వేకర్ కూడా హాజరయ్యారు. కాగా ఇప్పటి వరకు మహా వికాస్ అఘాడి(శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ) ప్రభుత్వంలో ఉన్న ఏకైక స్వతంత్ర ఎమ్మెల్యే కూడా ఆయనే కావడం విశేషం. ప్రస్తుతం శంకర్ రావు పార్టీలో చేరడంతో శాసనసభలో శివసేన బలం 57కు పెరిగింది. యూత్ కాంగ్రెస్ ప్రచారకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన గదఖ్ 2017లో క్రాంతికారి శెట్కారి పక్ష పార్టీని స్థాపించి స్థానిక ఎన్నికల్లో పోటీ చేశారు. (సుశాంత్ కేసు: మహారాష్ట్ర వర్సెస్ బిహార్) महाराष्ट्र राज्याचे मृद व जलसंधारण मंत्री @GadakhShankarao जी यांनी आज मातोश्री निवासस्थानी शिवसेना पक्षप्रमुख, मुख्यमंत्री उद्धव बाळासाहेब ठाकरे यांच्या हस्ते शिवबंधन बांधून शिवसेनेत जाहीर प्रवेश केला. यावेळी शिवसेनेचे सचिव @NarvekarMilind_ जी उपस्थित होते. pic.twitter.com/0obIZOPVhF — ShivSena - शिवसेना (@ShivSena) August 11, 2020 -
తహసిల్దార్ శంకర్రావు ఇంటిపై ఏసీబీ దాడి
విశాఖపట్నం: తహసిల్దారు శంకరరావు ఇంటిపై అవినీతి నిరోధక శాఖాధికారులు దాడి చేశారు. ఆయన నివాసం సహా నాలుగుచోట్ల సోదాలు నిర్వహించారు. విజయనగరం, బొబ్బిలిలోని బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేసిన అధికారులు అక్రమంగా ఆస్తులు కలిగి ఉన్న శంకర్రావుపై కేసు నమోదు చేశారు. గతంలో ఆయన విశాఖపట్నం రూరల్ తహసిల్దారుగా పనిచేశారు. ఆయన అండతో టీడీపీ నాయకులు పలువురు ప్రభుత్వ భూములను పొంది బ్యాంకుల్లో తాకట్టుపెట్టి కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టారన్న విమర్శలు ఉన్నాయి. కాగా.. శంకర్రావు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. అరెస్టు విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రికార్డులు తారుమారు చేశారని కలెక్టర్ ఫిర్యాదు మేరకు ఏసీబీ దాడులు జరిగాయి. -
మహిళల పట్ల కమిషనర్ అసభ్య ప్రవర్తన
బద్వేలు అర్బన్: వైఎస్ఆర్ జిల్లా బద్వేలు మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నాడంటూ మున్సిపల్ కమిషనర్ శంకరరావుపై శుక్రవారం యూనియన్ నేతలు దాడికి యత్నించారు. చాంబర్లో ఉన్న ఆయన్ను బలవంతంగా బయటకు లాక్కొచ్చి వెళ్లిపోవాల్సిందిగా ఆందోళన నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. బద్వేలు మున్సిపల్ కమిషనర్‌గా ఎ.శంకరరావు జూన్30న బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో ముగ్గురు కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగులు అటెండర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. తమను కమిషనర్ వేధిస్తున్నారని వారు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ), సీపీఐ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వారు యూనియన్, సీపీఐ నేతలతో కలిసి వచ్చి కమిషనర్‌తో గొడవకు దిగారు. ఉద్యోగుల పట్ల ప్రవర్తించే తీరు సరిగా లేదని నేతలు కమిషనర్‌ను చాంబర్ నుంచి బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. ఆయనతో తీవ్ర స్థాయిలో వాగ్వాదం చేస్తూ దాడికి యత్నించారు. ఇంతలో అక్కడికి చేరుకున్న చైర్మన్ సోమేసుల పార్థసారథి, పలువురు కౌన్సిలర్లు యూనియన్ నేతలను మందలించి కమిషనర్‌ను లోపలికి తీసుకెళ్లారు. కొద్ది రోజులు సెలవుపై వెళ్లాల్సిందిగా మున్సిపల్ చైర్మన్.. కమిషనర్‌కు సూచించారు. కాగా, సక్రమంగా విధులు నిర్వర్తించమన్నందుకే తనపై నిందలు వేస్తున్నారని కమిషనర్ శంకరరావు పేర్కొన్నారు. కార్యాలయంలో ఒకరు ఉండి.. మిగతా ఇద్దరు పారిశుద్ధ్య పనులకు వెళ్లాలని చెప్పడం వల్లే ఇలా గొడవ చేస్తున్నారన్నారు. ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయక పోవడంతో కేసు నమోదు కాలేదు. -
ఆ విగ్రహాలను తొలగిస్తే హైదరాబాద్‌కు విఘాతం
హైదరాబాద్ : ట్యాంక్‌బండ్‌పై సీమాంధ్ర ప్రముఖుల విగ్రహాలు అవసరం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనటం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి శంకర్రావు అభిప్రాయపడ్డారు. ఉన్న విగ్రహాలను తొలగించకుండా తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఆయన సోమవారమిక్కడ అన్నారు. సీమాంద్ర విగ్రహాలను తొలగిస్తే హైదరాబాద్‌కు విఘాతం జరుగుతుందని శంకర్రావు వ్యాఖ్యానించారు. తెలుగువారి మధ్య ఐక్యత లేకపోతే అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు మాట్లాడేవారు మధ్య విద్వేషాలు మంచిది కాదని శంక్రరావు అన్నారు. -
'ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక సీఎం కిరణ్'
చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హస్తం ఉందని మాజీ మంత్రి పి.శంకర్రావు ఆరోపించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం వృక్షాలు యథేచ్ఛగా సాగుతుందంటే కిరణ్ కుమార్ రెడ్డి కారణమని పేర్కొన్నారు. తిరుపతి, నెల్లూరు, కడప జిల్లాల అటవీ ప్రాంతాలలో మాత్రమే పెరిగే అరుదైన వృక్ష జాతి అంతరించిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా తిరుపతి శేషాచలం కొండలో స్మగ్లర్లు అటవీశాఖ సిబ్బందిపై దాడి హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఆ ఘటనను ఆయన ఖండించారు.