తహసిల్దారు శంకరరావు ఇంటిపై అవినీతి నిరోధక శాఖాధికారులు దాడి చేశారు
విశాఖపట్నం: తహసిల్దారు శంకరరావు ఇంటిపై అవినీతి నిరోధక శాఖాధికారులు దాడి చేశారు. ఆయన నివాసం సహా నాలుగుచోట్ల సోదాలు నిర్వహించారు.
విజయనగరం, బొబ్బిలిలోని బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేసిన అధికారులు అక్రమంగా ఆస్తులు కలిగి ఉన్న శంకర్‌రావుపై కేసు నమోదు చేశారు. గతంలో ఆయన విశాఖపట్నం రూరల్ తహసిల్దారుగా పనిచేశారు. ఆయన అండతో టీడీపీ నాయకులు పలువురు ప్రభుత్వ భూములను పొంది బ్యాంకుల్లో తాకట్టుపెట్టి కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టారన్న విమర్శలు ఉన్నాయి. కాగా.. శంకర్‌రావు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. అరెస్టు విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రికార్డులు తారుమారు చేశారని కలెక్టర్ ఫిర్యాదు మేరకు ఏసీబీ దాడులు జరిగాయి.