Shantinagar
-
అయినవాళ్లు సహకరిస్తలేరని.. తల్లీకూతుళ్ల విషాదం!
మహబూబ్‌నగర్: వారసత్వ భూమి విక్రయించగా వచ్చిన డబ్బుల్లో వాటా ఇచ్చి.. తమ బిడ్డ పెళ్లి, కుమారుడి చదువుకు సహకరించాలని అయిన వాళ్లను ప్రాధేయపడినా పట్టించుకోకపోవడంతో ఓ కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైంది. కూతురితో సహా భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడ్డారు. మొదట తల్లీకూతురు పురుగు మందు తాగగా.. తండ్రి భయపడి మిన్నంకుండిపోయాడు.విషయం తెలుసుకున్న స్థానికులు తల్లీకూతురిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే కన్నుమూసిన విషాదకర ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఏ బూడిదపాడు గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. ఏ బూడిదపాడుకు చెందిన మాల హరన్నకు నలుగురు కుమారులు ఉండగా.. ఎకరా పట్టా పొలం, 30 గుంటల అసైన్డ్ (సీలింగ్) పొలాన్ని అన్నదమ్ముళ్లకు పంచారు.పట్టా పొలం రెండవ, మూడవ కుమారుడికి పంపకాల్లో రాగా.. పెద్ద కుమారుడైన నర్సింహులు, చిన్న కుమారుడికి 30 గుంటల సీలింగ్ భూమి వచ్చింది. కొన్నేళ్ల కిందట ఇద్దరు అన్నదమ్ములు పట్టా పొలాన్ని అమ్ముకున్నారు. సీలింగ్ పొలాన్ని ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో నర్సింహులు కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కూతురి పెళ్లి, కుమారుడి చదువు వారికి భారంగా మారింది. ఈక్రమంలో ఆర్థిక ఇబ్బందులు తోడయ్యాయి. దీంతో అమ్మిన పట్టా పొలం డబ్బులను అందరికీ సమానంగా పంచాలని అన్నదమ్ముళ్లతో గొడవ పెట్టుకోవడంతోపాటు పెద్దలను ఆశ్రయించారు.తన బిడ్డ పెళ్లి, కుమారుడి చదువు కోసం డబ్బులు అవసరమని.. పట్టా పొలంలో తనకూ వాటా ఇవ్వాలని ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. దీంతో నర్సింహులు, అతడి భార్య వరలక్ష్మి (39), కూతురు అనురాధ(18) పురుగు మందు తాగి, చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో మొదట వరలక్ష్మి, ఆమె కూతురు పురుగు మందు తాగారు. నరసింహులు పురుగుల మందు తాగడానికి భయపడి విరమించుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు.. తల్లీకూతురిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.కళ్ల ముందే భార్య, కూతురు చనిపోవడంతో నర్సింహులు కుప్పకూలిపోయాడు. తల్లీ కూతురి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు శాంతినగర్ ఏఎస్ఐ అయ్యన్న తెలిపారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. -
ఘనంగా నిమజ్జనం
శాంతినగర్: వినాయక చవితి సందర్బంగా ప్రతిష్టించిన గణేషుని నిమజ్జన వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా కొనసాగాయి. శాంతినగర్, రాజోలి గ్రామాల్లో పదకొండు రోజులపాటు పూజలందుకున్న గణనాథుల మండపాల వద్ద రాజోలి అడేవేశ్వరస్వామి, కప్పలబావి గణేషుని వద్ద గురువారం మధ్యాహ్నం లడ్డూల వేలంపాటలు నిర్వహించారు. అనంతరం వాహనాల్లో విగ్రహాలను ఉంచి ఊరూవాడా ఊరేగించారు. ఈసందర్బంగా భక్తులు, నిర్వాహకులు టపాసులు కాల్చుతు, రంగులు చల్లుకుంటూ డప్పుల మోతల మధ్య చిందులువేశారు. అనంతరం సమీపంలోని తుంగభద్రనదిలో నిమజ్జనంగావించారు. దీంతో గణేషుని ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. రూ.21 వేలు పలికిన లడ్డూ వినాయక చవితి సందర్బంగా గణపతి చేతిలోని లడ్డూలు వేలంపాటలు నిర్వహించారు. రాజోలి అడివేశ్వరస్వామి ఆలయం ముందు ప్రతిష్టించిన వినాయకుని చేతిలోని లడ్డూను గ్రామానికి చెందిన బోయ మహేంద్రబాబు రూ.21 వేలకు వేలంపాటల్లో కైవసం చేసుకున్నాడు. -
వరాహాల నగర్..!
శాంతినగర్‌లో పందుల సైర్వవిహారం పొంచి ఉన్న వ్యాధులు చోద్యం చూస్తున్న మున్సిపల్ యంత్రాంగం నల్లగొండ టౌన్ పట్టణంలోని శాంతినగర్‌లో పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. చెత్తకుప్పలు, డ్రెయినేజీల వద్ద గుంపులుగుంపులుగా తిరుగుతూ పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నాయి. ఈ కా రణంగా దోమల వ్యాప్తి చెంది ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది కేవ లం లిటిల్ ఫ్లవర్ కాలేజీ ప్రధాన రోడ్డు వెంట మాత్రమే శుభ్రం చేస్తూ చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మురుగు కాల్వల నిర్వహణ ను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.వెరసి ఆయా ప్రాంతా లు అపరిశుభ్రంగా మారి పందులకు ఆవాసాలుగా మారుతున్నా యని ఆవేదన చెందుతున్నారు. ఒక్క శాంతినగర్‌లోనే సుమారు 500 పందులు ఉన్నాయంటే ఆశ్చర్యం వేయకమానదు. జానావాసాల్లో పందుల పెంపకం చేపట్టరాదనే నిబంధనలు ఉన్నాయి. ఒక వేళ ఎవరైనా పెంచినా మున్సిపల్ అధికారులు వారికి నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ పె ద్ద సంఖ్యలో పందులు స్వైర విహారం చేస్తున్నా అధికారులు నిమ్మ కు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలూ లేకపోలేదు. పెంపకందారుల నుంచి మున్సిపల్ సిబ్బంది మామూళ్లు తీసుకుంటూ పందులను అరికట్టడానికి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా స్పందించాలని శాంతినగర్‌వాసులు కోరుతున్నారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురికి గాయాలు
ఏలూరు క్రైం, న్యూస్‌లైన్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. వీరిలో ఒక మహిళ, బాలుడు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు శాంతినగర్ ఏడో వీధిలో రెండు మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా ఢీ కొన్న ప్రమాదంలో ఒక బాలుడు, మరో యువకుడు గాయపడ్డారు. పవర్‌పేటకు చెందిన సింహాద్రి వెంకట అప్పాజీ (14) అతడి స్నేహితుడు బి.రోనాల్డ్ రాజేష్‌పుత్ర కలిసి ఆదివారం స్కూటీపై వెళుతుండగా శాంతినగర్‌లో కందుమూడి దిలీప్‌కుమార్ బైక్ ఎదురుగా వచ్చి ఢీకొన్నాడు. ఈ ఘటనలో అప్పాజీ, దిలీప్‌కుమార్ గాయపడ్డారు. అప్పాజీ స్థానిక సీఆర్ఆర్ పబ్లిక్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. మోటార్ సైకిల్ ఢీ కొని.. సైకిల్‌పై వెళుతున్న ఓ వుహిళను ఎదురుగా వచ్చిన మోటారు సైకిల్ ఢీకొట్టడంతో ఆమెకు గాయాలయిన ఘటన శనివారం రాత్రి జరిగింది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా రుు. స్థానిక ఇందిరాకాలనీకి చెందిన గాడేపల్లి అంజలికి భర్త, ఒక కువూర్తె ఉంది. అంజలి వన్‌టౌన్ ప్రాంతంలోని నగల దుకాణంలో పనిచేస్తోంది. శనివారం రాత్రి పని వుుగించుకుని సైకిల్‌పై ఇంటికి వస్తుండగా ఏడుగోరీల సెంటర్ వద్దకు వచ్చే సరికి ఎదురుగా వచ్చిన మోటారు సైకిల్ ఆమెను ఢీకొంది. ఈ ప్రవూదంలో గాయుపడిన అంజలిని చికిత్స నిమిత్తం స్థానికులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.