ఏలూరు క్రైం, న్యూస్‌లైన్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. వీరిలో ఒక మహిళ, బాలుడు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు శాంతినగర్ ఏడో వీధిలో రెండు మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా ఢీ కొన్న ప్రమాదంలో ఒక బాలుడు, మరో యువకుడు గాయపడ్డారు. పవర్‌పేటకు చెందిన సింహాద్రి వెంకట అప్పాజీ (14) అతడి స్నేహితుడు బి.రోనాల్డ్ రాజేష్‌పుత్ర కలిసి ఆదివారం స్కూటీపై వెళుతుండగా శాంతినగర్‌లో కందుమూడి దిలీప్‌కుమార్ బైక్ ఎదురుగా వచ్చి ఢీకొన్నాడు. ఈ ఘటనలో అప్పాజీ, దిలీప్‌కుమార్ గాయపడ్డారు. అప్పాజీ స్థానిక సీఆర్‌ఆర్ పబ్లిక్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు.
మోటార్ సైకిల్ ఢీ కొని..
సైకిల్‌పై వెళుతున్న ఓ వుహిళను ఎదురుగా వచ్చిన మోటారు సైకిల్ ఢీకొట్టడంతో ఆమెకు గాయాలయిన ఘటన శనివారం రాత్రి జరిగింది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా రుు. స్థానిక ఇందిరాకాలనీకి చెందిన గాడేపల్లి అంజలికి భర్త, ఒక కువూర్తె ఉంది. అంజలి వన్‌టౌన్ ప్రాంతంలోని నగల దుకాణంలో పనిచేస్తోంది. శనివారం రాత్రి పని వుుగించుకుని సైకిల్‌పై ఇంటికి వస్తుండగా ఏడుగోరీల సెంటర్ వద్దకు వచ్చే సరికి ఎదురుగా వచ్చిన మోటారు సైకిల్ ఆమెను ఢీకొంది. ఈ ప్రవూదంలో గాయుపడిన అంజలిని చికిత్స నిమిత్తం స్థానికులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.