ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
తనకల్లు (కదిరి) : మండల కేంద్రమైన తనకల్లులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న షాజిదా ఈ నెల 17వ తేదీ నుంచి కనిపించడం లేదు. ఎన్ని చోట్ల వెతికినా ఆచూకీ కానరాకపోవడంతో తండ్రి బాషా బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు.