shedule changed
-
నాన్‌స్టాప్‌గా నలభై రోజులు!
‘గుంటూరు కారం’ సెట్స్‌లోకి మహేశ్‌బాబు మరోసారి అడుగుపెట్టడానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ ఈ నెల రెండో వారంలో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ జూలై మొదటి వారంలో ప్రారంభించాలని యూనిట్ భావిస్తోందని ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అలాగే జూలైలో ప్రారంభమయ్యే కొత్త షెడ్యూల్ చిత్రీకరణ నాన్‌స్టాప్‌గా దాదాపు 40రోజులకుపైగా జరుగుతుందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అప్పుడైనా జరుగుతాయా?
తీవ్ర తర్జనభర్జనల అనంతరం ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడలను కూడా ఏడాదిపాటు వాయిదా వేస్తూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిర్ణయం కూడా తీసుకుంది. ఈ మెగా ఈవెంట్‌కు మరో 15 నెలల సమయం ఉంది. అయితే అప్పుడు కూడా ఈ క్రీడల నిర్వహణ సాధ్యమేనా అంటూ వైద్య నిపుణులు కొత్త సందేహాలు తెరపైకి తీసుకొచ్చారు. కరోనాకు తగిన చికిత్స సిద్ధమయ్యే వరకు ఒలింపిక్ వంటి మెగా ఈవెంట్ల నిర్వహణ సరైంది కాదని వారు చెబుతున్నారు. టోక్యో: కొత్త షెడ్యూల్ ప్రకారం టోక్యో ఒలింపిక్స్ క్రీడలు 2021 జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరగాల్సి ఉన్నాయి. అవసరమైతే ఐఓసీ మళ్లీ ఒలింపిక్ తేదీలను మార్చేందుకు సిద్ధంగా ఉండాలని అమెరికాకు చెందిన ఇమోరీ యూనివర్సిటీ వైద్య నిపుణుడు జాక్ బిన్నీ అభిప్రాయపడ్డారు. ‘స్టేడియాల్లో భారీ సంఖ్యలో ప్రేక్షకులు రావాలని కోరుకుంటూ క్రీడల నిర్వహణ గురించి మనం ఆలోచిస్తున్నాం. అయితే కనీసం కరోనాకు తగిన వ్యాక్సిన్ వచ్చే వరకైనా ఇలాంటివి జరగకుండా ఉంటే బాగుంటుంది. మైదానంలో వచ్చే ఒక్కో వ్యక్తితో కరోనా వ్యాపించే ప్రమాదం పెరుగుతూనే ఉంటుంది. ఇప్పటికే ప్రకటించిన తేదీలు చూస్తే నిర్వాహకులు అతిగా ఆశిస్తున్నట్లే అనిపిస్తోంది. ఎందుకంటే వైరస్‌కు వ్యాక్సిన్ రావడానికి కనీసం ఏడాదిన్నర పట్టవచ్చు. అంటే 2021 చివరి వరకు ఇది సాధ్యం కాదు. ఒక స్టేడియంలో 50 వేల నుంచి లక్ష మంది వరకు ప్రేక్షకులను కూర్చోబెట్టడం అంటే అంతకంతకూ ప్రమాదం పెరిగిపోతున్నట్లే లెక్క’ అని ఆయన అన్నారు. ఒలింపిక్ వేదిక చుట్టుపక్కల తిరిగే అభిమానులకు ఇన్ఫెక్షన్ సోకితే అక్కడ మాత్రమే కాకుండా తిరుగు ప్రయాణంలో తమ తమ దేశాలకు కూడా వైరస్‌ను మోసుకెళ్లే ప్రమాదం ఉందని బిన్నీ చెబుతున్నారు. కెనడాలోని మనిటోబా యూనివర్సిటీలో అంటువ్యాధుల నిరోధక విభాగానికి చెందిన ప్రొఫెసర్ జాసన్ కిండ్రాచుక్ కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో సార్స్, ఎబోలా వంటి వ్యాధులు ప్రబలిన సమయంలో ఆయన తన సేవలందించారు. ‘సంవత్సరంలోపు కోవిడ్–19కు వైరస్ వస్తుందని ఆశిస్తున్నాం. అయితే ఆ సమయానికి ఒలింపిక్స్ దగ్గరకు వచ్చేస్తాయి. సరిగ్గా ప్రారంభానికి ముందు మీరు అందరికీ వ్యాక్సిన్ ఇచ్చి కూడా లాభం ఉండదు. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడానికి కాస్త ముందుగా ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది’ అని ఆయన సూచించారు. జపాన్‌లో సాధారణ స్థితి వచ్చేందుకు కనీసం సంవత్సరం పడుతుందని, తన అంచనా ప్రకారం వచ్చే ఏడాది ఒలింపిక్స్ ఏ రకంగానూ సాధ్యం కాదని అదే దేశానికి చెందిన మరో ప్రొఫెసర్ డాక్టర్ కెంటారో వ్యాఖ్యానించడం గమనార్హం. ఎడిన్బర్గ్ యూనివర్సిటీ గ్లోబల్ హెల్త్ విభాగ అధిపతి దేవీ శ్రీధర్ కూడా దీనితో ఏకీభవించారు. ‘ఒకసారి వ్యాక్సిన్ వస్తేనే ఒలింపిక్స్ నిర్వహణపై మనం నమ్మకం పెట్టుకోవచ్చు. చౌకగా, అందరికీ అందుబాటులో వ్యాక్సిన్ వస్తే తిరుగుండదు. వైజ్ఞానికపరంగా దీని నిరోధం గురించి స్పష్టత రాకపోతే ఆటల గురించి మరచిపోవచ్చు’ అని శ్రీధర్ విశ్లేషించారు. మా ప్రణాళికలు మాకున్నాయి... తాజా విమర్శలపై టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు స్పందించారు. ‘ప్రస్తుత స్థితిలో కొందరు చేస్తున్న ఊహాగానాలపై మేమేమీ చెప్పలేం. అయితే కోవిడ్–19 వ్యాప్తి నిరోధం గురించి మా వద్ద తగిన ప్రణాళికలు ఉన్నాయి. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ కలిసి పనిచేస్తున్నాం. ఈవెంట్‌తో సంబంధం ఉన్న అందరితో చర్చిస్తూ తాజా స్థితిని సమీక్షించి తగిన నిర్ణయాలు తీసుకుంటాం. అయితే క్రీడలను మళ్లీ వాయిదా వేసే ఆలోచనే లేదు. షెడ్యూల్ ప్రకారం ఒలింపిక్స్ సమర్థ నిర్వహణకు ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఒలింపిక్స్ జరగడానికి కనీసం నాలుగు నుంచి ఆరు వారాల ముందుగా టోక్యోకు వచ్చి రెండు వారాల క్వారంటైన్ తర్వాత అథ్లెట్లు ఒలింపిక్ గ్రామంలోకి అడుగుపెడితే సరిపోతుందని కూడా ఒక ప్రతిపాదన వచ్చింది’ అని నిర్వహణ కమిటీ అధికార ప్రతినిధి మాసా టకాయా స్పష్టం చేశారు. -
టెన్త్ సోషల్ పరీక్షలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల రెండో విడత ఎన్నికల నేపథ్యంలో ఈనెల 10, 11వతేదీల్లో నిర్వహించాల్సిన పదో తరగతి సోషల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఏప్రిల్ 10వ తేదీన జరగాల్సిన సోషల్ పేపర్ 1ను, 11వతేదీన జరగాల్సిన సోషల్ పేపర్ 2 పరీక్షలను వాయిదా వేసినట్లు ప్రభుత్వ పరీక్షల డెరైక్టర్ మన్మథరెడ్డి తెలిపారు. తాజా షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 12న సోషల్ పేపర్ 1 పరీక్షను, 15వ తేదీన సోషల్ పేపర్ 2 పరీక్షను నిర్వహించనున్నారు. 12వతేదీన జరగాల్సిన ఓరియెంటల్ ఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్(సంస్కృతం, అరబిక్, పర్షియన్) పేపర్-2 పరీక్షను 16 తేదీకి వాయిదా వేశారు. 15న జరగాల్సిన ఒకేషనల్ థియరీ పరీక్ష 17కు వాయిదా పడింది. రెండు పరీక్షల టైమింగ్స్ మార్పు: ఏప్రిల్ 7వతేదీన జరగనున్న సైన్స్ పేపర్ 1తోపాటు 12వ తేదీ జరగనున్న సోషల్ పేపర్ 1 పరీక్షల సమయంలో మార్పు చేశారు. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటలకు కాకుండా 11 గంటల నుంచి 1.30 గంటల వరకు నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే నెల 6వతేదీన, 11వతేదీన రెండు విడతల్లో జరగనున్న విషయం తెలిసిందే. పోలింగ్ తర్వాత రోజుల్లో జరగనున్న ఈ రెండు పరీక్షలకు సెంటర్లలో తగిన ఏర్పాట్లు చేయడానికి వీలుగా పరీక్షల నిర్వహణ సమయంలో మార్పు చేసినట్లు అధికారులు తెలిపారు. షెడ్యూల్లో మార్పులు ఇవీ... పరీక్ష పాత తేదీ కొత్త తేదీ సోషల్ పేపర్-1 ఏప్రిల్ 10 ఏప్రిల్ 12 సోషల్ పేపర్-2 ఏప్రిల్ 11 ఏప్రిల్ 15 ఓరియంటల్ మెయిన్ లాంగ్వేజ్ ఏప్రిల్ 12 ఏప్రిల్ 16 వొకేషనల్ థియరీ ఏప్రిల్ 15 ఏప్రిల్ 17