Mahesh Babu Guntur Karam Movie Next Shooting Schedule Details Out, Deets Inside - Sakshi
Sakshi News home page

Guntur Karam Shooting Update: నాన్‌స్టాప్‌గా నలభై రోజులు!

Published Mon, Jun 19 2023 1:23 AM | Last Updated on Mon, Jun 19 2023 9:04 AM

Mahesh Babu Guntur Karam next schedule details out - Sakshi

‘గుంటూరు కారం’ సెట్స్‌లోకి మహేశ్‌బాబు మరోసారి అడుగుపెట్టడానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. హారిక అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.

కాగా ఈ సినిమా తాజా షెడ్యూల్‌ చిత్రీకరణ ఈ నెల రెండో వారంలో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ జూలై మొదటి వారంలో ప్రారంభించాలని యూనిట్‌ భావిస్తోందని ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అలాగే జూలైలో ప్రారంభమయ్యే కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణ నాన్‌స్టాప్‌గా దాదాపు 40రోజులకుపైగా జరుగుతుందనే టాక్‌ కూడా వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement