మహేశ్-త్రివిక్రమ్ సినిమా టైటిల్‌ డేట్‌ ఫిక్స్‌ | Mahesh and Trivikram next movie date fix | Sakshi
Sakshi News home page

మహేశ్-త్రివిక్రమ్ సినిమా టైటిల్‌ డేట్‌ ఫిక్స్‌

Published Sat, May 27 2023 4:54 AM | Last Updated on Sat, May 27 2023 8:25 AM

Mahesh and Trivikram next movie date fix - Sakshi

హీరో మహేశ్‌బాబు ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌. మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా సినిమా టైటిల్‌ను సూపర్‌స్టార్‌ కృష్ణ జయంతి సందర్భంగా ఈ నెల 31న అధికారికంగా ప్రకటించనున్నట్లు  చిత్ర యూనిట్‌ వెల్లడించింది. ఎంపిక చేసిన కొన్ని థియేటర్స్‌లో మహేశ్‌బాబు ఫ్యాన్స్‌ చేతుల మీదగా ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ వీడియోను విడుదల చేసేలా చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్‌ ఫిల్మ్‌ ఇది.

ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. జూన్‌ మొదటివారంలో ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ ఆరంభం కానున్నట్లు తెలిసింది. కాగా ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి విభిన్న రకాల టైటిల్స్‌ తెరపైకి వచ్చినప్పటికీ ‘గుంటూరు కారం’, ‘ఊరికి మొనగాడు’ టైటిల్స్‌లో ఏదొకటి ఖరారు అయ్యే చాన్స్‌ ఉందని సమాచారం. మరి.. వేరే ఏదైనా టైటిల్‌ తెర పైకి వస్తుందా? అనేది చూడాలి. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కానుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement