Sheikh Mohammed bin Zayed Al Nahyan
-
30న దుబాయ్‌కి మోదీ
న్యూఢిల్లీ: వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమిట్‌లో పాల్గొనేందుకు ఈ నెల 30న ప్రధాని మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)కు వెళ్లనున్నారు. యూఏఈ అధ్యక్షుడు, దుబాయ్ పాలకుడు అయిన షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ నవంబర్ 30, డిసెంబర్ ఒకటో తేదీల్లో ఆ దేశంలో పర్యటిస్తారని విదేశాంగ శాఖ తెలిపింది. -
సొంత కరెన్సీలోనే చెల్లింపులు
అబుధాబి: భారత్–యూఏఈ సంబంధాలు మరో కీలక మైలురాయికి చేరుకున్నాయి. వాణిజ్య చెల్లింపులను ఇకపై సొంత కరెన్సీలోనే చేపట్టాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. ఫ్రాన్సులో పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తిరుగు ప్రయాణంలో శనివారం యూఏఈ రాజధాని అబుదాబిలో ఆగారు. అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమయ్యారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సెపా) కుదిరిన ఏడాదిలోనే రెండు దేశాల మధ్య వాణిజ్యం 20 శాతం మేరకు పెరగడంపై నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం 85 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం ఈ ఏడాది సెపె్టంబర్లో ఢిల్లీలో జరిగే జీ20 భేటీ సమయానికి 100 బిలియన్ డాలర్లకు చేరుకోవాలని ఆకాక్షించారు. వాణిజ్య చెల్లింపులను సొంత కరెన్సీలోనే చేపట్టాలని, ఇండియన్ యూనిఫైడ్ పేమెంట్స్ వ్యవస్థ(యూపీఐ)ను యూఏఈకి చెందిన ఇన్స్టంట్ పేమెంట్ ప్లాట్‌ఫాం(ఐపీపీ)తో అనుసంధానం చేయాలని అంగీకారానికి వచ్చారు. రెండు దేశాల పేమెంట్స్ మెసేజింగ్ సిస్టమ్స్‌ను లింక్ చేసే విషయం పరిశీలించాలని కూడా నిర్ణయించారు. ఢిల్లీ ఐఐటీ క్యాంపస్‌ను యూఏఈలో ఏర్పాటు చేసే విషయమై రెండు దేశాల విద్యాశాఖాధికారులు ఎంవోయూపై సంతకాలు చేశారు. పరస్పర వాణిజ్య చెల్లింపులను భారత్ కరెన్సీ రూపాయి, యూఏఈ కరెన్సీ దిర్హంలో చేసేందుకు ఉద్దేశించిన ఎంవోయూపై రెండు దేశాల సెంట్రల్ బ్యాంకుల ప్రతినిధులు సంతకాలు చేశారని మోదీ తెలిపారు. ఇరు దేశాల మధ్య బలపడుతున్న ఆర్థిక సహకారం, పరస్పర విశ్వాసానికి ఇది నిదర్శనమన్నారు. ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు కాప్28 అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న యూఏఈకి భారత్ మద్దతుగా నిలుస్తుందని ప్రధాని తెలిపారు. మరింత సుస్థిర అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై కాప్28 అధ్యక్షుడిగా నియమితులైన సుల్తాన్ అల్ సబేర్తో చర్చించానన్నారు. కాప్28 వార్షిక సమావేశాలు దుబాయ్‌లో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12వరకు జరగనున్నాయి. ఈ సమావేశాలకు మోదీని సబేర్ ఆహా్వనించారు. పర్యావరణ మార్పులకు గురైన దేశాలకు వాగ్దానం ప్రకారం 100 బిలియన్ డాలర్ల సాయం అందించాలని సంపన్న మోదీ, అల్ నహ్యాన్ సంయుక్త ప్రకటనలో కోరారు. ‘‘యూఏఈ అధ్యక్షునితో భేటీ సంతోషం కలిగించింది. అభివృద్ధిపై ఆయన దార్శనికత ప్రశంసనీయం. భారత్–యూఏఈ సంబంధాలపై సమగ్రంగా చర్చించాం’’ అని మోదీ ట్వీట్ చేశారు. అంతకుముందు అబుధాబి అధ్యక్ష భవనం వద్ద నహ్యాన్ మోదీకి ఎదురేగి ఆత్మీయ ఆలింగనంతో స్వాగతం పలికారు. మోదీ సైనిక వందనం స్వీకరించారు. అనంతరం మోదీకి నహ్యాన్ విందు ఇచ్చారు. రాత్రికి ప్రధాని భారత్ చేరుకున్నారు. యూఏఈ సెంట్రల్ బ్యాంకుతో ఒప్పందం అన్ని లావాదేవీలకూ వర్తిస్తుందని ఆర్బీఐ తెలిపింది. ‘‘పెట్టుబడులు, రెమిటెన్స్‌లకు దీనితో ఊతం లభిస్తుంది. యూఏఈలోని భారతీయులకు లావాదేవీల చార్జీలు తగ్గడమే గాక సమయం కూడా కలిసొస్తుంది’’ అని తెలిపింది. -
రాజుగారు ఇంటికొచ్చారు
చిన్నారులు మనసు చిన్నబుచ్చుకుంటే పెద్దవాళ్ల ప్రాణం ఉసూరుమంటుంది. చిన్నబుచ్చింది తామే అని తెలిస్తే వెళ్లి ఊరడించేవరకు ఊరుకోరు. షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ పెద్ద మనిషి మనిషి మాత్రమే కాదు, అబుదాబికి యువరాజు కూడా! అంతటి మనిషి తనకు తెలియకుండానే ఓ బాలిక మనసు నొప్పించారు. ఓ విందు కార్యక్రమానికి ఆయన హాజరు అవుతున్నారని తెలిసి ఆయనకు స్వాగతం పలికేందుకు కొందరు చిన్నారులను ఎంపిక చేశారు నిర్వాహకులు.ఆ పిల్లలందర్నీ పలకరిస్తూ ముందుకు వెళుతున్న యువరాజు వారిలోని ఒక చిన్నారి చాచిన స్నేహ హస్తాన్ని గమనించకుండానే అక్కడి నుంచి నిష్క్రమించారు. తర్వాత ఆ వీడియో వైరల్ అయి యువరాజు వరకు వచ్చింది. వెంటనే ఆయన ఆ బాలిక ఇంటిని వెతుక్కుంటూ వెళ్లి ఆప్యాయంగా కరచాలనం చేశారు. అంతేకాదు. బాలిక నుదుటిపై ముద్దు కూడా పెట్టారు. ఇక చూడండి.. ఆ పాప ఆనందం, ఆ ఇంటి ఆనందం. -
మోదీకి యూఏఈ అవార్డు
అబుధాబి/మనామా: భారత ప్రధాని మోదీ తన సోదరుడంటూ రెండు దేశాల సంబంధాల్లో సౌహార్థతను చాటిచెప్పారు యూఏఈ రాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్. యూఏఈలో మోదీ పర్యటనను పురస్కరించుకుని విడుదల చేసిన సందేశంలో ఆయన.. ‘మరోసారి రెండో సొంతింటికి వస్తున్నందుకు నా సోదరుడికి కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత మోదీకి రాజప్రసాదంలో ఆయన స్వాగతం పలికారు. ఇరువురు నేతలు వాణిజ్య, సాంస్కృతిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. ఈ సందర్భంగా మోదీని యూఏఈ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’ పురస్కారంతో గౌరవించారు. 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఎన్నడూ లేనంత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేసిన మోదీ ని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు యూఏఈ రాజు అల్ నహ్యాన్ ఏప్రిల్‌లో ప్రకటించిన విష యం తెలిసిందే. అనంతరం జరిగిన కార్యక్రమం లో ప్రధాని మోదీ భారతీయ ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానం రూపే కార్డును ప్రారంభించారు. దీనివల్ల ఏటా యూఏ ఈ సందర్శించే 30 లక్షల మంది భారతీయులకు లాభం కలగనుంది. కశ్మీర్ దేశ చోదకశక్తి రాజకీయ స్థిరత్వం, సానుకూల విధానాల కారణంగానే భారత్ పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త చోదకశక్తిగా మారనున్న కశ్మీర్లో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని పేర్కొన్నా రు. అబుధాబిలో ప్రవాస భారతీయ పారిశ్రామిక వేత్తలతో జరిగిన సమావేశంలో మోదీ ప్రసంగించారు. ‘రాజకీయ స్థిరత్వం, అనుకూల విధానాల వల్లే పెట్టుబడిదారులు భారత్‌వైపు ఆకర్షితులవుతున్నారు. దేశంలో వృద్ధికి ప్రోత్సాహం, ఉద్యోగ కల్పన, ‘మేక్ ఇన్ ఇండియా’కు తోడ్పాటుకు అనుకూలంగా ప్రభుత్వం విధానాలను రూపొందిస్తోంది. వీటితోపాటు పెట్టుబడిదారులకు తగు ప్రతిç ఫలం కూడా దక్కేలా చూస్తోంది. అందుకే భారత్ లో ఉన్న విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోండి’ అని కోరారు. ‘ఎన్నో ఏళ్లుగా వెనుకబాటుకు గురైన జమ్మూకశ్మీర్‌లో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలున్నాయి. అక్కడి యువతకు ఉపాధి కల్పించేందుకు, అభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పించాం. భారత్ అభివృద్ధికి కశ్మీర్ ప్రాంతం చోదకశక్తిగా మారనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా మారేందుకు కూడా జమ్ము, కశ్మీ ర్, లదాఖ్‌లకు ఎన్నో అవకాశాలున్నాయి. అక్కడి కి రావాలని ఆహ్వానిస్తున్నా’ అని మోదీ పేర్కొన్నా రు. ఖలీజ్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ‘కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370తో కొందరు మాత్రమే లాభపడ్డారు. అక్కడి యువతపై తీవ్రవాద భావాలను నూరిపోశారు. ఉగ్రవాదం, హింసాత్మక చర్యలకు పాల్పడేలా తయారు చేశారు.’ అని తెలిపారు. ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు మేం తీసుకున్న చర్యలకు యూఏ ఈ ప్రభుత్వం మద్దతు ప్రకటించిందన్నారు . బహ్రెయిన్ చేరుకున్న మోదీ శుక్రవారం యూఏఈ చేరుకున్న ప్రధాని మోదీ అక్కడి పర్యటన ముగించుకుని శనివారం సాయం త్రం బహ్రెయిన్ చేరుకున్నారు. రాజప్రసాదంలో రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా మోదీకి ఘనస్వాగతం పలికారు. ప్రధానమంత్రి ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్‌తో భేటీ అయి ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై మోదీ చర్చలు జరిపారు. అంతరిక్ష విజ్ఞానం, సౌరశక్తి, సాంస్కృతిక సంబంధాలపై రెండు దేశాలు పలు ఎంవోయూలపై సంతకాలు చేశాయి. ఇస్రోతో బహ్రెయిన్ నేషనల్ స్పేస్ సైన్స్ ఏజెన్సీ పరస్పర సహకారం వీటిల్లో ఒకటి. కాగా, భారత ప్రధాని ఒకరు బహ్రెయిన్ దేశంలో పర్యటించడం ఇదే ప్రథమం. ఆదివారం ఆయన గల్ఫ్ ప్రాంతంలోనే అతిపురాతన శ్రీనాథ్జీ ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. అనంతరం మోదీ ఇక్కడి నుంచి తిరిగి ఫ్రాన్సు రాజధాని పారిస్‌లో జరిగే జీ–7 సమ్మిట్‌లో పాల్గొనేందుకు వెళ్లనున్నారు. -
ఈ యువరాజును గుర్తు పట్టారా..?
ఈ ఫోటోలో భారత మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీతో పాటూ పక్కనే ఉన్న ఓ కుర్రాడిని గుర్తుపట్టారా ?. లేదా అయితే మీకో క్లూ. అతను ఓ దేశ యువరాజు. అంతే కాదు ఇటీవలే జరిగిన 68వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా కూడా హాజరయ్యారు. ఆయనే అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్. ఇందిరాగాంధీతో నహ్యాన్ కరచాలనం చేస్తూ అందులో కనిపించారు. గల్ఫ్ దేశాలకు భారత్‌తో ఎప్పటి నుంచో ఉన్న సత్సంబంధాలకు ప్రతిబింబంగా ఉన్న ఈ ఫోటోను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. నహ్యాన్ పర్యటనలో ముఖ్యాంశాలు.. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా భారత్, యూఏఈ మధ్య 14 ఒప్పందాలు కుదిరాయి. రక్షణ, భద్రత, వాణిజ్య, ఇంధనం తదితర కీలకాంశాలతో పాటు వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. బుధవారం డెలిగేట్స్ సమావేశం హైదరాబాద్ హౌస్ లో జరగగా, అనంతరం ప్రధాని అధికార నివాసంలో మోదీ, నహ్యన్లు గంటపాటు సమావేశమయ్యారు. ప్రపంచంలో భారత్‌కు అత్యంత నమ్మకమైన మిత్రదేశాల్లో యూఏఈ ఒకటి అని మోదీ అభివర్ణించారు. భారత దేశ వృద్ధిలో ముఖ్యమైన భాగస్వామిగా యూఏఈని గౌరవిస్తామని చెప్పారు. మొత్తంగా రక్షణ ఉత్పత్తి, సాంకేతిక సహకారం, సముద్ర, రోడ్డు రవాణాలో ఉత్తమ విధానాల మార్పిడి.. మహిళలు, చిన్నారుల అక్రమ రవాణా నివారణకు కలసి పనిచేయడం, వాణిజ్య, చమురు నిల్వలు, నిర్వహణ తదితర 14 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఇరు దేశాల మధ్య చర్చలు ఫలప్రదంగా జరిగాయని మోదీ చెప్పారు. ఈ చర్చల్లో ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబం ధించి ఉపయుక్తమైన రోడ్‌మ్యాప్ రూపొం దించినట్లు చెప్పారు. రక్షణ, భద్రతా సహకారానికి సంబంధించిన ఒప్పందాల ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్లు పేర్కొ న్నారు. దగ్గరి సంబంధాలు ముఖ్యమని, అది కేవలం ఇరు దేశాల మధ్యే కాదని, పొరుగు దేశాలన్నిం టితోనూ బలమైన సంబంధాలు ఉండాలని కోరుకుంటు న్నట్లు తెలిపారు. భారత్, యూఏఈ కలయిక ప్రాంతీయ సుస్థిరతకు సహకరి స్తుందన్నారు. అలాగే ఆర్థిక భాగస్వామ్యం ప్రాంతీయ, ప్రపంచ శ్రేయస్సుకు తోడ్పాటునందిస్తుందన్నారు. అఫ్గాని స్తాన్‌తో పాటు మన ప్రాంత పరిణామాలపై కూడా చర్చించినట్లు తెలిపారు. మీ సందర్శన వల్ల మునుపటి సంబంధాలు మరింత బలపడతాయనే నమ్మకముందని అబుదాబి యువరాజును ఉద్దేశించి మోదీ అన్నారు. ఈ ఏడాది భారత గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనడానికి తమ సైనికులను పంపిన రెండో దేశంగా యూఏఈ నిలిచింది. గతేడాది ఫ్రాన్స్ ఈ పని చేసింది. -
‘ఘన’తంత్ర వేడుకలు
ముఖ్య అతిథిగా అబుదాబి యువరాజు ► వర్షంలోనూ ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు ► ఆకట్టుకున్న వివిధ రాష్ట్రాల శకటాలు ► విదేశాల్లోనూ వేడుకలు న్యూఢిల్లీ: భారత 68వ గణతంత్ర దినోత్సవాలు ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో గురువారం ఘనంగా జరిగాయి. వేడుకలకు అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ముఖ్య అతిథిగా విచ్చేయడం తెలిసిందే. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, వివిధ దేశాల రాయబారులు రిపబ్లిక్‌డే పరేడ్‌ను తిలకించారు. కవాతుకు 149 మంది సభ్యులు గల యూఏఈ సైనికుల బృందం సారథ్యం వహించింది. సైనిక బృందాల గౌరవ వందనాన్ని ప్రణబ్ స్వీకరించారు. మోదీ దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నహ్యన్ , మోదీ పక్క పక్కనే కూర్చుని కవాతును వీక్షించారు. ఢిల్లీలో ఉదయం నుంచి చినుకులు పడుతూ, ఆకాశం మేఘావృతమై ఉన్నా, పరేడ్‌ను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. మన దేశ మిలిటరీ శక్తి, వారసత్వ, సాంస్కృతిక, చారిత్రక, కళా సంపదను తెలిపేలా 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు పలు శకటాలతో ప్రదర్శనలు నిర్వహించాయి. క్షిపణులను ప్రయోగించే టీ–90 భీష్మ, పదాతి దళానికి చెందిన యుద్ధ వాహనం బీఎంపీ–2కే, బ్రహ్మోస్ లాంచర్, స్వాతి రాడార్, ఆకాష్ క్షిపణి, ధనుష్ తుపాకులు తదితరాలను సైనికులు ప్రదర్శించారు. కేంద్ర ఎౖక్సైజ్, కస్టమ్స్ మండలి ప్రదర్శించిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) శకటం చూపరులను ఆకట్టుకుంది. నేవీ కూడా వివిధ యుద్ధ నౌకలు, జలాంతర్గాములను ప్రదర్శించింది. అశ్విక దళం, పదాతి దళం, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఢిల్లీ పోలీస్, ఎన్ సీసీ, ఎన్ ఎస్ఎస్ తదితర సిబ్బంది కూడా పరేడ్‌లో పాల్గొన్నారు. కవాతు మొదలవ్వడానికి కొద్ది సేపటి ముందు మోదీ, రక్షణ మంత్రి మనోహర్ పరీకర్, త్రివిధ దళాల అధిపతులు కలిసి ఇండియా గేట్ దగ్గర్లోని అమర్ జవాన్ జ్యోతి వద్ద పూల మాలలు వేసి అమరులైన సైనికులకు నివాళులర్పించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ మొత్తం మీద దాదాపు 60 వేల మంది సిబ్బంది భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఉక్రెయిన్ తొలి ఉప ప్రధాని స్టెపాన్ కుబివ్ కూడా రిపబ్లిక్ డే పరేడ్‌కు హాజరయ్యారు. ఎట్ హోంకు అడ్డంకిగా వర్షం ప్రణబ్ ముఖర్జీ చివరి ‘ఎట్ హోం’కార్యక్రమానికి వర్షం ప్రతిబంధకంగా నిలిచింది. మొఘల్ గార్డెన్స్ లో జరగాల్సిన కార్యక్రమాన్ని భారీ వర్షం కారణంగా దర్బార్ హాల్, అశోక హాళ్లలోకి మార్చారు. ఈ కార్యక్రమానికి ప్రణబ్‌తోపాటు మోదీ, నహ్యన్, హమీద్ అన్సారీ, మన్మోహన్ సింగ్, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ , కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ తదితరులు హాజరయ్యారు. విదేశాల్లోనూ ఘనంగా... బీజింగ్/కైరో: భారత 68వ గణతంత్ర దినోత్సవాలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉత్సాహంగా జరిగాయి. చైనా రాజధాని బీజింగ్‌లో భారత రాయబార కార్యాలయం వద్ద రాయాబారి విజయ్ గోఖలే త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ‘ఎ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ ఇండియా’అనే లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. నేపాల్, ఈజిప్టు, సింగపూర్లలోనూ మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. సింగపూర్‌లోని సన్ టెక్ కన్వెన్షన్ సెంటర్లో ఉన్న ప్రపంచంలోనే అతి పెద్దదైన హెచ్డీ వీడీయో వాల్‌ను వెలిగించారు. అందులో ‘భారత్‌కు 68వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు’ అని రాసి మన జెండాను ప్రదర్శించారు. అస్సాం, మణిపూర్‌లో ఏడుచోట్ల పేలుళ్లు న్యూఢిల్లీ: ఓ పక్క దేశమంతా గణతంత్ర ఉత్సవాలు జరుపుకుంటుండగా.. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మణిపూర్‌లో గురు వారం ఏడుచోట్ల పేలుళ్లు చోటుచేసు కున్నాయి. అల్ఫా వేర్పాటు వాదులు అస్సాంలో ఐదు వరుస పేలుళ్లకు పాల్పడ్డారు.చరైడో, సిబ్సాగర్, దిబ్రూగఢ్, తిన్సూకియా జిల్లాలో ఈ పేలుళ్లు చోటుచేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. దిబ్రూగఢ్‌లో పరేడ్ గ్రౌండ్ నుంచి కేవలం 500 మీటర్ల దూరంలోనే పేలుడు జరిగింది. అలాగే మణిపూర్‌లోని ఇంఫాల్ తూర్పు, ఇంపాల్ పశ్చిమ జిల్లాల్లో రెండుచోట్ల పేలుళ్లు సంభవించాయి. అయితే ఇరు రాష్ట్రాల్లో ఎక్కడా గణతంత్ర వేడుకలకు ఆటంకం కలగలేదు. ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. కాగా, కశ్మీర్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొబైల్స్, ఇంటర్నెట్ను నిలుపుదల చేయకుండా ఉత్సవాలు జరపడం దశాబ్దకాలంలో ఇది రెండోసారి. పంజాబ్, హరియా ణా, ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఢిల్లీలో వేడుకల సమయంలో కొద్దిపాటి వర్షం కురిసింది. ఈ ఏడాది ప్రత్యేకతలు... ♦ బ్లాక్ క్యాట్ కమాండోలుగా పిలిచే జాతీయ భద్రతా దళం (ఎన్ ఎస్జీ) గణతంత్రదిన మార్చ్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి. ♦ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ తొలిసారిగా రిపబ్లిక్ డే ప్రదర్శనలో పాల్గొంది. ♦ భారత గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనడానికి తమ సైనికులను పంపిన రెండో దేశం యూఏఈ. గతేడాది ఫ్రాన్స్ ఈ పని చేసింది. ♦ జాతీయ సాహస పురస్కారాలు పొందిన బాలబాలికలు పరేడ్‌లో ఓపెన్ జీప్లలో ప్రయాణించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 21 మంది పరేడ్‌లో పాల్గొన్నారు. ♦ వర్షం పడుతున్నా వేడుకల్లో శతఘ్నిదళం మాత్రం కచ్చితమైన సమయానికి 21 సార్లు తుపాకులను పేల్చి వందనాన్ని సమర్పించింది.