ఈ ఫోటోలో భారత మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీతో పాటూ పక్కనే ఉన్న ఓ కుర్రాడిని గుర్తుపట్టారా ?. లేదా అయితే మీకో క్లూ. అతను ఓ దేశ యువరాజు. అంతే కాదు ఇటీవలే జరిగిన 68వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా కూడా హాజరయ్యారు. ఆయనే అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్. ఇందిరాగాంధీతో నహ్యాన్ కరచాలనం చేస్తూ అందులో కనిపించారు. గల్ఫ్ దేశాలకు భారత్‌తో ఎప్పటి నుంచో ఉన్న సత్సంబంధాలకు ప్రతిబింబంగా ఉన్న ఈ ఫోటోను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
నహ్యాన్ పర్యటనలో ముఖ్యాంశాలు..
ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా భారత్, యూఏఈ మధ్య 14 ఒప్పందాలు కుదిరాయి. రక్షణ, భద్రత, వాణిజ్య, ఇంధనం తదితర కీలకాంశాలతో పాటు వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. బుధవారం డెలిగేట్స్ సమావేశం హైదరాబాద్ హౌస్ లో జరగగా, అనంతరం ప్రధాని అధికార నివాసంలో మోదీ, నహ్యన్‌లు గంటపాటు సమావేశమయ్యారు. ప్రపంచంలో భారత్‌కు అత్యంత నమ్మకమైన మిత్రదేశాల్లో యూఏఈ ఒకటి అని మోదీ అభివర్ణించారు. భారత దేశ వృద్ధిలో ముఖ్యమైన భాగస్వామిగా యూఏఈని గౌరవిస్తామని చెప్పారు. మొత్తంగా రక్షణ ఉత్పత్తి, సాంకేతిక సహకారం, సముద్ర, రోడ్డు రవాణాలో ఉత్తమ విధానాల మార్పిడి.. మహిళలు, చిన్నారుల అక్రమ రవాణా నివారణకు కలసి పనిచేయడం, వాణిజ్య, చమురు నిల్వలు, నిర్వహణ తదితర 14 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.
ఇరు దేశాల మధ్య చర్చలు ఫలప్రదంగా జరిగాయని మోదీ చెప్పారు. ఈ చర్చల్లో ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబం ధించి ఉపయుక్తమైన రోడ్‌మ్యాప్ రూపొం దించినట్లు చెప్పారు. రక్షణ, భద్రతా సహకారానికి సంబంధించిన ఒప్పందాల ద్వారా కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్లు పేర్కొ న్నారు. దగ్గరి సంబంధాలు ముఖ్యమని, అది కేవలం ఇరు దేశాల మధ్యే కాదని, పొరుగు దేశాలన్నిం టితోనూ బలమైన సంబంధాలు ఉండాలని కోరుకుంటు న్నట్లు తెలిపారు.
భారత్, యూఏఈ కలయిక ప్రాంతీయ సుస్థిరతకు సహకరి స్తుందన్నారు. అలాగే ఆర్థిక భాగస్వామ్యం ప్రాంతీయ, ప్రపంచ శ్రేయస్సుకు తోడ్పాటునందిస్తుందన్నారు. అఫ్గాని స్తాన్‌తో పాటు మన ప్రాంత పరిణామాలపై కూడా చర్చించినట్లు తెలిపారు. మీ సందర్శన వల్ల మునుపటి సంబంధాలు మరింత బలపడతాయనే నమ్మకముందని అబుదాబి యువరాజును ఉద్దేశించి మోదీ అన్నారు.
ఈ ఏడాది భారత గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనడానికి తమ సైనికులను పంపిన రెండో దేశంగా యూఏఈ నిలిచింది. గతేడాది ఫ్రాన్స్ ఈ పని చేసింది.
ఈ యువరాజును గుర్తు పట్టారా..?
Published Sat, Jan 28 2017 3:23 PM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM
Advertisement