ఏడుగురు పేకాటరాయుళ్లకు రిమాండ్
పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులపై మేడిపల్లి పోలీసు లు కేసు నమోదు చేసి మంగళవారం రిమాండ్కు తరలించారు. ఎస్ఐ వెంకట్రెడ్డి తెలిపిన వివరాలు.. పీర్జాదిగూడలో టి. సంతోష్ (29), షేక్ మనుసూర్(35), షేక్ నసీర్ హుస్సేన్(35), షేక్ హమాన్ బాషా(30), షేక్ అబ్దుల్ రహమాన్(38), బానోతు రమేష్(35), పానుగంటి మశ్చేందర్గౌడ్(38)లు పేకాట ఆడుతుండగా అరెస్టు చేసి మంగళవారం రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి రూ 1,00,720 నగదు, ఏడు సెల్ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.