2 వేల లీటర్ల కిరోసిన్ పట్టివేత
విజయవాడ : బ్లాక్ మార్కెట్‌కు తరలించడానికి సిద్ధంగా ఉంచిన 2 వేల లీటర్ల కిరోసిన్‌ను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మొహమ్మద్ పేటలోని ఆటోనగర్‌లో గురువారం చోటు చేసుకుంది. భారీ ఎత్తున కిరోసిన్ అక్రమంగా గ్రామంలో నిల్వ ఉంచారని జగ్గయ్యపేట ఎమ్మార్వో అనిల్‌కి ఆగంతకులు ఫోన్లో సమాచారం ఇచ్చారు.
దాంతో రెవెన్యూ సిబ్బందితో అనిల్ ఆటోనగర్‌లో పలు ప్రాంతాలలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు వేల లీటర్ల కిరోసిన్ స్వాధీనం చేసుకున్నారు.