Shipyard
-
దేశ భద్రతకు‘పంచ’ కవచాలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇప్పటి వరకు షిప్ రిపేర్ హబ్‌గా మాత్రమే కొనసాగుతున్న విశాఖపట్నం హిందూస్థాన్ షిప్‌యార్డ్.. త్వరలోనే షిప్ బిల్డింగ్ హబ్‌గా అత్యుత్తమ సేవలందించేందుకు అడుగులు ముందుకు వేస్తున్నది. దేశీయ నౌకల తయారీపై దృష్టి సారించిన షిప్‌యార్డ్ అందుకోసం భారత నౌకాదళంతో కీలక ఒప్పందాలపై సంతకం చేసింది. ఈ క్రమంలో రూ.19,048 కోట్లతో 5 భారీ యుద్ధ నౌకల నిర్మాణ పనుల్ని దక్కించుకుంది. దేశ చరిత్రలో ఏ షిప్‌యార్డ్ నిర్మించని విధంగా ఏకంగా 44 వేల టన్నుల షిప్స్‌ని నిర్మించనున్న హెచ్ఎస్ఎల్... 2027 ఆగస్ట్‌లో తొలి యుద్ధనౌకని ఇండియన్ నేవీకి అప్పగించనుంది. యుద్ధ విన్యాసాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించేలా షిప్ డిజైన్లతో పాటు.. రక్షణ వ్యవస్థలోనే కాకుండా.. విపత్తు నిర్వహణకు వినియోగించేలా షిప్‌లను తయారు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. సింధుకీర్తి సబ్‌మెరైన్ మరమ్మతుల విషయంలో హిందుస్థాన్ షిప్‌యార్డ్ అపవాదు మూటకట్టుకుని.. తొమ్మిదేళ్లకు పూర్తి చేయడంతో షిప్యార్డ్డ్ పనైపోయిందని అంతా అనుకున్నారు. అయితే, ఐఎన్ఎస్ సింధువీర్ మరమ్మతుల్ని అతి తక్కువ సమయంలోనే పూర్తి చేసి ఆ మరకని తుడిచేసుకున్న షిప్‌యార్డ్.. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. ఎలాంటి నౌకలు, సబ్మెరైన్ల మరమ్మతులైనా రికార్డు సమయంలో పూర్తి చేస్తూ.. ఆయా సంస్థలకు అప్పగిస్తున్న హెచ్ఎస్ఎల్.. ఇప్పుడు ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా దూసుకుపోతోంది. ఐదేళ్ల కాలంలో ఏకంగా 14 ప్రాజెక్టుల్ని పూర్తి చేసి ఆర్డర్ల పెండెన్సీ గణనీయంగా తగ్గించుకుంది. 40 నౌకల రీఫిట్ పనుల్ని ఐదేళ్ల కాలంలో పూర్తి చేసి ఔరా అనిపించుకుంది. మొత్తంగా హిందుస్థాన్ షిప్‌యార్డ్ పనితీరుతో విశాఖ.. షిప్ బిల్డింగ్ కేంద్రంగా మారుతోంది. రూ.19 వేల కోట్లు.. 5 ఫ్లీట్ సపోర్ట్ షిప్స్.. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.1,038 కోట్ల టర్నోవర్ సాధించిన షిప్‌యార్డ్ .. ఈ ఏడాది ఏకంగా రూ.19,048 కోట్ల పనులకు సంబంధించిన కాంట్రాక్టుపై సంతకం చేసింది. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో నౌకల తయారీకి సన్నద్ధమవుతోంది. ఐదు ఫ్లీట్ సపోర్ట్ షిప్స్ (ఎఫ్ఎస్ఎస్)ను భారత నౌకాదళం, కోస్ట్‌గార్డు కోసం తయారు చేసేందుకు శుక్రవారం భారత రక్షణ మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది.హైవాల్యూస్‌తో ఈ నౌకల నిర్మాణాలు చేపట్టనుంది. దేశంలోని ఏ షిప్‌యార్డ్‌లోనూ లేనివిధంగా ఏకంగా 44 మిలియన్ టన్నుల డిస్ప్లేస్మెంట్ సామర్థ్యమున్న నౌకల్ని తయారు చేయనుంది. ఈ నౌకల నిర్మాణాలతో 2023–24 నుంచి హెచ్ఎస్ఎల్ వార్షిక టర్నోవర్ గణనీయంగా పెరగనుంది. ప్రస్తుతం రూ.1,038 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్న íషిప్‌యార్డ్ .. వచ్చే ఐదేళ్లలో రూ.1,500 నుంచి 2 వేల కోట్ల రూపాయలకు చేరుకోనుంది. 8 సంవత్సరాల కాల పరిమితితో ఈ షిప్స్‌ని తయారు చేయనుంది. తొలి షిప్‌ని 2027 ఆగస్ట్ 24న భారత నౌకాదళానికి అప్పగించేలా ఒప్పందం కుదుర్చుకుంది. మూడేళ్లలో మరింత అభివృద్ధి.. పెరుగుతున్న ఒప్పందాలకు అనుగుణంగా.. షిప్‌యార్డ్‌ను ఆధునికీకరించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. రూ.1,000 కోట్లతో యార్డుని రానున్న మూడేళ్లలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం స్లిప్‌వేలు 190 మీటర్లుండగా వీటిని 230 మీటర్లకు పెంచనున్నారు. ఆర్డర్లు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్య కూడా పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా మరమ్మతులు, నౌకా నిర్మాణాలకు అనుగుణంగా రూ.5 వేల కోట్లతో మెటీరియల్ కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన 364 వెండార్ బేస్డ్ ఎంఎస్ఎంఈల సహకారం తీసుకుంటున్నారు. లక్షల మందికి ఉపాధి టెండర్లు దక్కించుకోవడంలో దూకుడు పెంచాం. తాజాగా 50 టన్స్ బొలార్డ్ పుల్ టగ్ బాల్‌రాజ్ మరమ్మతులు పూర్తి చేసి నేవల్ డాక్‌యార్డు (విశాఖపట్నం)కు అందించాం. అందుకే.. ఆర్డర్లు కూడా పెద్ద ఎత్తున సొంతం చేసుకుంటున్నాం. రక్షణ మంత్రిత్వ శాఖతో కుదుర్చుకున్న ఒప్పందం.. షిప్‌యార్డ్ భవిష్యత్తుని మార్చబోతోంది. ఈ ఎంవోయూ ద్వారా లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. విశాఖ భవిష్యత్తు కూడా మారబోతుంది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా.. మేక్ ఇన్ ఇండియాని చాటిచెప్పేలా షిప్స్ తయారు చేస్తాం. దేశీయ నౌకల నిర్మాణంతో పాటు అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాలపైనా దృష్టి సారించాం. సబ్మెరైన్ల నిర్మాణం, రీఫిట్‌కు సంబంధించిన సామర్థ్యం, మౌలిక సదుపాయాల కల్పనతో మరింత ఆధునికీకరించుకునేందుకు రష్యాతోనూ సమగ్ర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. – కమోడోర్ హేమంత్ ఖత్రి, హిందుస్థాన్ షిప్‌యార్డు సీఎండీ -
రక్షణ రంగానికి బ్రాండ్‌గా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగానికి ఒక బ్రాండ్‌గా మారేందుకు, నేవల్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి విశాఖపట్నంలో పుష్కల అవకాశాలున్నాయని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) నేవల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్ డైరెక్టర్ జనరల్ డా.వై శ్రీనివాసరావు అన్నారు. నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ(ఎన్ఎస్టీఎల్)లో శనివారం జరిగిన 54వ ల్యాబ్ రైజింగ్ డే ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘విశాఖపట్నంలో నేవల్ ఎకో సిస్టమ్ మరింత అభివృద్ధి చెందితే అత్యవసర పరిస్థితుల్లో సహకారం అందించేందుకు అవసరమైన మానవ వనరులు, మెషినరీ అందుబాటులోకి వస్తాయి. నేవల్ డిఫెన్స్ అంటే విశాఖ గుర్తుకురావాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నాయి. హిందూస్తాన్ షిప్‌యార్డు, పోర్టులకు సంబంధించిన పరికరాలు, కమర్షియల్ నేవీ, ఇండియన్ నేవీకి ఏ పారిశ్రామిక సహకారం కావాలన్నా.. విశాఖ అత్యంత ముఖ్యమైన వనరు. రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందిస్తే.. విశాఖలో నేవల్ ఎకో సిస్టమ్ మరింత అభివృద్ధి చెందుతుంది. డాక్‌యార్డు, ఎన్ఎస్టీఎల్, నేవీ, షిప్‌యార్డుకు సహకారం అందించేలా బీఈఎల్ మాదిరిగా ఎల్అండ్టీ వంటి సంస్థలు వస్తే.. ఆ వెంటే ఎంఎస్ఎంఈలు కూడా ఏర్పాటవుతాయి. తద్వారా విశాఖ రక్షణ రంగానికి ఒక బ్రాండ్‌గా మారే అవకాశముంది. విశాఖ సమీప ప్రాంతాల్లో పోర్టులు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, రాజమండ్రి ఎయిర్‌పోర్టు, రైల్వే వ్యవస్థ కూడా ఉన్నందున.. అభివృద్ధి చెందేందుకు ఎక్కువ సమయం పట్టదు. సొంతంగా సబ్మెరైన్లు, టార్పెడోలు.. సముద్ర గర్భంలోనూ సత్తా చాటే దిశగా అడుగులు పడుతున్నాయి. వరుణాస్త్ర విజయవంతమైంది. హెవీ వెయిట్, లైట్ వెయిట్ టార్పెడో ప్రయోగాలు విజయవంతమయ్యాయి. బ్యాటరీ ప్రొపల్షన్ టార్పెడోలు ప్రస్తుతం కీలకంగా మారాయి. క్షణాల్లో టార్పెడోలు దూసుకుపోయేలా బ్యాటరీల రూపకల్పన జరుగుతోంది. త్వరలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. టార్పెడోలను సమర్థంగా కంట్రోల్ చేసే వ్యవస్థ కూడా సిద్ధమవుతోంది. నౌకలు, సబ్మెరైన్ల మోడల్ టెస్టింగ్స్ కోసం ఒకప్పుడు ఇతర దేశాలపై ఆధారపడే వాళ్లం. ఇప్పుడు అన్ని షిప్‌యార్డులూ ఎన్ఎస్టీఎల్ వైపే చూస్తున్నాయి. ఇప్పుడు సబ్మెరైన్లను సొంతంగా తయారు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. అలాగే యుద్ధ విమానాలు, సబ్మెరైన్లు, యుద్ధ నౌకల ఉనికిని శత్రుదేశాలు పసిగట్టకుండా అడ్డుకునే స్టెల్త్ టెక్నాలజీ అందుబాటులోకి తెస్తున్నాం. శత్రుదేశాలు ఏ ఆయుధాన్ని ప్రయోగించినా.. దాని నుంచి తప్పించుకునేందుకు అవసరమైన టెక్నాలజీ రూపకల్పనకూ ప్రయోగాలు జరుగుతున్నాయి’ అని చెప్పారు -
పెరుగుతున్న గోల్డ్, వెండి అక్రమ రవాణా.. 11,735 కిలోల బంగారం..
సాక్షి, అమరావతి: దేశంలో బంగారం, వెండి అక్రమ రవాణా ఏటికేడాది పెరుగుతున్నాయి. కోవిడ్ సమయంలో విమానాల రాకపోకలపై ఆంక్షలతో 2020–21లో కొంతమేర వీటి అక్రమ రవాణా తగ్గినప్పటికీ తరువాత 2021–22, 2022–23 సంవత్సరాల్లో బాగా పెరిగింది. స్వాధీనం చేసుకున్న వాటిని చూస్తేనే అక్రమ రవాణా పెరిగిందంటే.. ఇక స్వాధీనం చేసుకోకుండా ఎంత అక్రమ రవాణా అయిందో ఎవరికీ తెలియదు. దేశంలో 2019–20 నుంచి 2022–23 ఫిబ్రవరి వరకు అక్రమ రవాణా చేస్తున్న 11,735.04 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి 13,205 కేసులు నమోదు చేశారు. ఇదే సమయంలో 7,632.52 కిలోల వెండి స్వాధీనం చేసుకుని 49 కేసులు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఇటీవల పార్లమెంట్లో ఆర్థికశాఖ వెల్లడించింది. అత్యధికంగా విమానాల ద్వారానే బంగారం, వెండి అక్రమ రవాణా అవుతున్నాయని, తరువాత ఇతర మార్గాలు, ఓడరేవుల ద్వారా కూడా అక్రమ రవాణా సాగుతోందని తెలిపింది. శరీరంలో దాచి మరీ బంగారం అక్రమ రవాణా చేస్తున్నారని పేర్కొంది. బంగారం, వెండి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడానికి కస్టమ్స్ క్షేత్రస్థాయి బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నాయని, ప్రయాణికుల ప్రొఫైలింగ్ ఆధారంగా విమానాలు, కార్గో సరుకుల లక్ష్యంగా తనిఖీలు చేస్తున్నాయని తెలిపింది. స్మగ్లర్లు ఉపయోగించే కొత్తకొత్త విధానాలు, పద్ధతులను ఎప్పటికప్పుడు కనిపెడుతూ అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. విమాన క్యాబిన్ సిబ్బందితోపాటు విమానాశ్రయ సిబ్బంది బంగారం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు వెల్లడించింది. బంగారం, వెండి అక్రమ రవాణాకు పాల్పడిన క్యాబిన్ సిబ్బంది, విమానాశ్రయ సిబ్బందిని అరెస్టు చేయడంతోపాటు కేసులు నమోదు చేసినట్లు తెలిపింది. 2019–20 నుంచి 2022–23 ఫిబ్రవరి వరకు బంగారం, వెండి అక్రమ రవాణాకు పాల్పడిన క్యాబిన్, విమానాశ్రయ సిబ్బంది 84 మందిని అరెస్టు చేసి 181.61 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. బంగారం, వెండి అక్రమ రవాణాను అరికట్టడానికి నిరంతరం నిఘా ఉంచడంతో పాటు అడ్వాన్స్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా రిస్క్‌బేస్డ్ ఇంటర్‌డిక్షన్ సహాయంతో ప్రయాణికుల ప్రొఫైలింగ్ వంటి కార్యాచరణకు చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. -
సింధుకీర్తినందుకుందాం
సాక్షి, విశాఖపట్నం: హిందుస్థాన్ షిప్‌యార్డు చరిత్రలో మాయని మచ్చగా నిలిచిన రోజుని చెరిపేసే అవకాశం వచ్చింది. ఎన్నో సబ్మెరైన్లకు మరమ్మతులు పూర్తి చేసినా సింధుకీర్తి విషయంలో మూటకట్టుకున్న అపప్రద ఇంకా షిప్‌యార్డుని వెంటాడుతూనే ఉంది. హెచ్‌ఎస్‌ఎల్‌కు సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన సింధుకీర్తి మరమ్మతుల్ని నిర్ణీత సమయంలో పూర్తి చేసి.. గతంలో పోయిన ప్రతిష్టని తిరిగి సంపాదించుకునేందుకు షిప్‌యార్డు నడుంబిగించింది. 1990 జనవరి 4న భారత నౌకాదళంలోకి ప్రవేశించిన ఐఎన్ఎస్ సింధుకీర్తి సబ్‌మెరైన్.. జూన్ 2006లో మరమ్మతులకు గురైంది. రీఫిట్ పనుల బాధ్యతను హిందూస్థాన్ షిప్‌యార్డు (హెచ్ఎస్ఎల్)కు ఇండియన్ నేవీ అప్పగించింది. అయితే కారణాలేవైనా సింధుకీర్తి మరమ్మతుల విషయంలో హెచ్ఎస్ఎల్ చాలా ఆలస్యం చేసింది. మూడేళ్ల సమయం కోరిన షిప్‌యార్డు ఏకంగా తొమ్మిదేళ్ల పాటు సుదీర్ఘంగా మరమ్మతులు చేసింది. షిప్‌యార్డు చేసిన ఆలస్యానికి సింధుకీర్తి సబ్‌మెరైన్‌కు డాక్‌యార్డు క్వీన్ అనే పేరుని కూడా మూటకట్టుకుంది. చివరికి 2015లో రూ.912 కోట్ల ఖర్చుతో సింధుకీర్తి మరమ్మతులు పూర్తి చేసి నౌకాదళానికి అప్పగించారు. దీంతో షిప్‌యార్డుకు మరమ్మతులకు పంపించాలంటేనే అనేక సంస్థలు ఆలోచించడం మొదలుపెట్టాయి. ఫలితంగా హెచ్‌ఎస్‌ఎల్‌కు ఆర్డర్లు రావడం తగ్గుముఖం పట్టడంతో ప్రతిష్టకు భంగం కలిగింది. రికార్డు స్థాయిలో మరమ్మతులు పూర్తి చేసినా... సింధుకీర్తి కారణంగా ఎదురైన అవమానాలను భరించి.. మరమ్మతుల విషయంలో ఎన్నో సంస్కరణలు చేపట్టారు. ఆధునిక సాంకేతికతని అందిపుచ్చుకుంటూ.. నిర్దేశించిన కాలపరిమితిలోపే రీఫిట్ పనులను పూర్తి చేసేందుకు సిద్ధమని ప్రకటించింది. అయినా ఆర్డర్ల విషయంలో నిరాశే ఎదురైంది. మరోసారి భారత నౌకాదళం చొరవ తీసుకొని సింధువీర్ సబ్‌మెరైన్ మరమ్మతుల బాధ్యతను షిప్‌యార్డుకు అప్పగించింది. రికార్డు స్థాయిలో కేవలం 27 రోజుల్లోనే రీఫిట్ పనుల్ని పూర్తి చేసి సబ్‌మెరైన్‌ను నేవీకి అప్పగించడంతో హెచ్‌ఎస్‌ఎల్‌పై విశ్వాసం పెరిగింది. ఆ తర్వాత నుంచి వెనుదిరిగి చూసుకోలేదు 22 నెలల్లో పూర్తి చేసుందుకు కసరత్తు ఎలాంటి నౌకలు, సబ్మెరైన్ల మరమ్మతులైనా రికార్డు సమయంలో పూర్తి చేస్తూ ఆయా సంస్థలకు అప్పగిస్తున్న హెచ్ఎస్ఎల్.. ఇప్పుడు ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా దూసుకుపోతోంది. ఐదేళ్ల కాలంలో ఏకంగా 14 ప్రాజెక్టుల్ని పూర్తి చేసి ఆర్డర్ల పెండెన్సీ గణనీయంగా తగ్గించుకుంది. 40 నౌకల రీఫిట్ పనులను ఐదేళ్ల కాలంలో పూర్తి చేసి ఔరా అనిపించుకుంది. ఇప్పటి వరకూ 200 నౌకలు తయారు చేసిన షిప్‌యార్డు.. తాజాగా 2000 షిప్స్ మరమ్మతులను కూడా పూర్తి చేసింది. అయినప్పటికీ సింధుకీర్తి మరమ్మతుల అపవాదు వెంటాడుతూనే ఉంది. దాన్ని పూర్తిగా చెరిపేసే అవకాశం షిప్‌యార్డుకు వచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత సింధుకీర్తి సబ్‌మెరైన్ మరమ్మతుల కోసం షిప్‌యార్డుకు చేరుకుంది. 2015 తర్వాత వచ్చిన సింధుకీర్తి రీఫిట్ పనుల్ని 22 నెలల్లో పూర్తి చేస్తామంటూ రక్షణ మంత్రిత్వ శాఖతో హెచ్ఎస్ఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఏ సబ్‌మెరైన్ విషయంలో అపవాదు మూటకట్టుకుందో.. అదే సబ్‌మెరైన్ రీఫిట్ పనుల్ని నిర్ణీత సమయం కంటే ముందుగానే పూర్తి చేసేందుకు షిప్‌యార్డు సన్నద్ధమవుతోంది. పోయిన ప్రతిష్టని, కీర్తిని, సింధుకీర్తి మరమ్మతులతోనే దక్కించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని సీఎండీ హేమంత్ ఖత్రీ అన్నారు. 22 నెలల కంటే ముందుగానే అప్పగించేందుకు శాయశక్తులా కృషి చేస్తామని స్పష్టం చేశారు. -
తొలి బాహుబలి నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ (ఫొటోలు)
-
ఇక ఫ్లయిట్‌లోనూ మొబైల్ సర్వీసులు
న్యూఢిల్లీ: ఇకపై విమాన ప్రయాణాలు, నౌకా ప్రయాణాల్లో కూడా మొబైల్ కాల్స్‌కు, ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో దేశీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న దేశ విదేశ ఎయిర్‌లైన్స్, షిప్పింగ్ కంపెనీలు ఇక నుంచి ఇన్–ఫ్లయిట్, మారిటైమ్ వాయిస్.. డేటా సర్వీసులు అందించేందుకు మార్గం సుగమమైంది. ఇందుకోసం అవి దేశీ టెలికం సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఇన్–ఫ్లయిట్ అండ్ మారిటైమ్ కనెక్టివిటీ (ఐఎఫ్‌ఎంసీ) రూల్స్ 2018గా ఈ మార్గదర్శకాలను వ్యవహరించనున్నట్లు, అధికారిక గెజిట్‌లో ప్రచురించిన తేదీ నుంచి ఇవి అమల్లోకి రానున్నట్లు డిసెంబర్ 14న విడుదల చేసిన నోటిఫికేషన్లో కేంద్రం పేర్కొంది. మార్గదర్శకాల ప్రకారం భారత గగనతలంలో ఎగిరే విమానం కనీసం 3,000 మీటర్ల ఎత్తుకు చేరిన తర్వాత ఐఎఫ్‌ఎంసీ సర్వీసులు యాక్టివేట్ అవుతాయి. వార్షికంగా రూ. 1 ఫీజుతో పదేళ్ల పాటు ఐఎఫ్‌ఎంసీ లైసెన్సులు జారీ అవుతాయి. అందించే సర్వీసుల ద్వారా వచ్చే ఆదాయాన్ని బట్టి పర్మిట్ హోల్డరు.. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. -
తేలియాడే అణువిద్యుత్ కేంద్రం
రష్యా: అకడమిక్ లోమనోసోవ్ అనే ఈ నావలో ప్రపంచంలోనే తొలిసారిగా అణువిద్యుత్ కేంద్రాన్ని రూపొందించారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని షిప్‌యార్డులో రష్యా ప్రభుత్వ అణుశక్తి కార్పొరేషన్ దీన్ని నిర్మించింది. చుక్టోకాలోని పోర్ట్ ఆఫ్ పెవెక్కు దీన్ని తరలిస్తున్నారు. చుక్టోకాకు వెళ్లాక ఇంధనాన్ని నింపి ఉత్పత్తి ప్రారంభిస్తారు. 2019లో ప్రారంభమయ్యే ఈ కేంద్రం ద్వారా ఏటా 50వేల టన్నుల కార్బన్డయాక్సైడ్ ఉద్గారాన్ని తగ్గించవచ్చు. -
బడ్జెట్ 2015: రాష్ట్రంలో మరో పెద్ద నౌకాశ్రయం!
-
పొట్టేళ్ల మార్కెట్ రూ.2 కోట్లు
తగరపువలస: విజయ దశమి, బక్రీద్‌లను పురస్కరించుకుని ఆదివారం స్థానిక ప్రైవేట్ మార్కెట్లో జరిగిన సంతలో మేకలు, గొర్రెల వ్యాపారం రూ.2 కోట్ల వరకు జరిగింది. నగరం నుంచి మేక లు, గొర్రెలు కొనుగోలు చేయడానికి వచ్చిన ఉద్యోగులు, మారు బేరగాళ్లతో సంత కిటకిటలాడింది. పారిశ్రామికవాడకు చెందిన జీవీఎంసీ, స్టీల్‌ప్లాంట్, షిప్‌యార్డు, ఇంధన కంపెనీల ఉద్యోగు లు ఈ సంతకు ప్రభుత్వ వాహనాలతోనే రావడం ఆనవాయితీ. దీనికి ముందు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని కందివలసగెడ్డ, మానాపురం, అచ్యుతాపురం సంతలో ఎక్కువగా విక్రయాలు జరుగుతాయి. ఆదివారం ఉద్యోగులకు సెలవు కావడంతోపాటు నగరానికి దగ్గరగా ఉండటంతో తగరపువలస సంతకే ప్రాధాన్యత ఇచ్చారు. కొమ్ములతోపాటు ధరలూ అధికమే.. ప్రతిష్టకు చిహ్నంగా భావించిన కొనుగోలుదారు లు దసరా ఉత్సవాలకు ప్రత్యేకంగా భారీగా కొ మ్ములు తిరిగిన మేకలు, గొర్రెలకే ప్రాధాన్యత ఇస్తారు. కొమ్ములు ఎంతగా తిరిగితే, వీటి ధర కూడా అంతగా ఉంటుం ది. విజయనగరం జిల్లా డెంకాడ మండలానికి చెందిన బంగార్రాజుపే ట, కొండ్రాజుపేటకు చెందిన రైతులు ఏడాది పొడుగునా పొట్టేళ్ల పెంపకంపై దృష్టిపెడతారు. వివిధ సంతల్లో మేలుజాతి గొర్రెలను ఎంపిక చేసుకొని కొనుగోలు చేసి పెంచుతారు. మామూ లు రోజుల్లో ఇరవై కిలోల గొర్రె రూ.10వేల లోపే ఉండగా ఈ సంతలో రూ.12వేలు దాటడం విశేషం. ఆదివారం సంతతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో 1500 వరకు మేకలు, గొర్రెల విక్రయాలు జరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. కొండెక్కిన నాటు కోడి ధరలు కోళ్ల ధరలు ఆకాశాన్ని తాకాయి. వేములవలస మార్కెట్లో ఆదివారం నాటు కోళ్లకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాదే ఇక్కడ కోళ్ల మార్కెట్ ప్రారంభమయింది. విశాఖపట్నం, పెందుర్తి పరిసర ప్రాంతాల నుంచి వ్యాపారులు ఎగబడడంతో ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. కిలో బరువు ఉండే నాటు కోడి పుంజు రూ. 400లు వరకూ పలికింది. పందెం కోళ్ల ధర రూ. 3,000 నుంచి రూ. 4.000 వరకు పలికింది.