Shivaratri celebrations
-
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..పులకించిన భక్తజనం (ఫొటోలు)
-
విశాఖపట్నం : సాగరతీరంలో కోటి ఎనిమిది లక్షల శివలింగాలు (ఫొటోలు)
-
YS Jagan: రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.
-
Mahashivaratri: తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు
-
శ్రీమన్నారాయణ అవతారంలో శ్రీనివాసుడు..!
-
శివరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం
-
పాండవుల వనవాసంలో కొన్నాళ్ళు ఇక్కడే నివాసం..
-
మహా శివరాత్రికి ముస్తాబవుతున్న అలంపూర్ క్షేత్రం
-
ప్రకృతి సోయగాలకు నెలవైన కపిలతీర్థం
-
శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
-
ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా శివరాత్రి వేడుకలు
-
శివుడికి నేడు విశేషమైన అభిషేకాలు
-
శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ చెయ్యడం వలన ఉపయోగం ఏంటంటే..
-
పిఠాపురంలో మహా శివరాత్రి వేడుకలు
-
ఈ శివరాత్రి మహా విశేషమైనది..
-
వేయిస్తంభాల గుడికి తండోప తండాలుగా భక్తులు
-
శ్రీశైలంలో మహా శివరాత్రి వేడుకలు
-
శివోహం.. గోదావరి తీరానికి పోటెత్తిన భక్తులు
-
వేములవాడ మహా శివరాత్రి వేడుకలు
-
భీమవరం పంచారామ క్షేత్రానికి భారీగా వచ్చిన భక్తులు
-
హర హర మహాదేవ శంభో
-
కీసరగుట్టలో మహా శివరాత్రి వేడుకలు
-
రెండు పర్వదినాలు ఇవాళే వచ్చాయి..
-
పరమ శివుడిని దర్శించుకుంటే' కోరిన కోర్కెలు తీరతాయి..!
-
ఇక్కడ శివలింగాన్ని ఏర్పాటు- చేసిన శ్రీరామచంద్రమూర్తి
-
భక్తులతో కిటకిటలాడుతున్న బంజారా హిల్స్ శివాలయం
-
కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సంబరాలు
-
ఖమ్మంలో శివరాత్రి సందడి
-
నెల్లూరు శివాలయంలో శివరాత్రి సంబరాలు
-
2000 వేల ఏళ్ల నాటి శివాలయంలో ఘనంగా శివరాత్రి సంబరాలు
-
భక్తులతో నిండిపోయిన కోటప్ప కొండ మహాశివరాత్రి సంబరాలు
-
తిరుపతిలో శివరాత్రి ప్రత్యేక ఏర్పాట్లు
-
Maha Shivratri 2023 : శివ నామస్మరణతో మార్మోగుతున్న తెలుగు రాష్ట్రాలు (ఫొటోలు)
-
Maha Shivaratri 2023: శివ నామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
తెలుగు రాష్ట్రాలు శివ నామస్మరణతో మార్మోగుతున్నాయి. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్దఎత్తున శివాలయాలకు పోటెత్తారు. జగాలను ఏలే జంగమ దేవుడు, తినేత్రుడు, లింగాకార రూపుడైన శివునికి ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఓం నమఃశివాయ, హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైల మల్లన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి రావడంతో క్యూ లైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. భక్తులంతా పాతాళ గంగలో పుణ్య స్థానాలు ఆచరించి స్వామివారి దర్శించుకుంటున్నారు. అధికారులు తెల్లవారుజాము నుంచే దర్శనానికి అనుమతించారు. రాజన్న సిరిసిల్లా జిల్లా: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడ రాజన్న క్షేత్రం భక్తుల శివనామస్మరణతో మారుమోగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు రాజన్నను దర్శించుకుంచేకునేందుకు క్యూ లైన్లో బారులు తీరారు. దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. టీటీడీ, రాష్ట్రప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సాయంత్రం 6 గంటల నుండి స్వామివారి కల్యాణ మండపంలో అనువంశిక అర్చకులచే మహాలింగార్చన జరుగుతుంది. రాత్రి 11:30 గంటలకు లింగోద్భవ సమయంలో స్వామివారికి 11 మంది రుత్వికులచే ఆలయ అర్చకులు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ జిల్లాలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో మహాశివుడ్ని దర్శించుకుంటున్నారు. మహాశివరాత్రి నేపథ్యంలో శివాలయాలను ప్రత్యేకంగా అలంకరించారు. విశాఖ తీరంలో శివరాత్రి శోభ అలముకుంది. అఫీషియల్ కాలనీలోని వైశాకేశ్వర ఆలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఆర్కే బీచ్‌లో టీఎస్ఆర్ సేవా పీఠం ఆధ్వర్యంలో కోటి శివలింగార్చన నిర్వహించారు. అప్పికొండలోని సోమేశ్వర ఆలయంలో శివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు జాతర జరుగుతోంది. భక్తులు పెద్ద సంఖ్యలో పూజల్లో పాల్గొంటున్నారు. తిరుపతి: జిల్లా వ్యాప్తంగా మహా శివరాత్రి సందర్బంగా భక్తులతో శివాలయాలు కిటకిట లాడుతున్నాయి. శ్రీకాళహాస్తీశ్వర స్వామి సన్నిధిలో భక్త జనం పోటెత్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఉదయం ఇంద్ర విమానం వాహనం, రాత్రి కి నంది - సింహ వాహనంపై స్వామి, అమ్మవార్లు దర్శనం ఇవ్వనున్నారు. కపిల తీర్థం ఆలయం జలపాతం వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, దీపారాధన చేస్తున్నారు. కపిలేశ్వర స్వామి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఈరోజు ఉదయం రధోత్సవం, రాత్రి నంది వాహన సేవ ఉంది. ఏర్పేడు మండలం గుడిమల్లంలో కొలువైన పరశురామేశ్వర స్వామి ఆలయానికి మహా శివరాత్రి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. అనకాపల్లి జిల్లా: సబ్బవరం మండలం లింగాల తిరుగుడులో సోమలింగేశ్వర ఆలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. చోడవరంలోని గంగా సమేత పార్వతి పరమేశ్వర స్వయంభు ఆలయంలో శివరాత్రి సందర్బంగా పూజలు నిర్వహించారు. ఎస్ రాయవరం మండలం పంచదార్లలలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు చేశారు. అల్లూరి జిల్లా: హుకుంపేట మండలం మఠం పంచాయతీలో మత్స్య లింగేశ్వర స్వామి శివరాత్రి జాతర ప్రారంభమైంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. అనంతగిరి మండలం బొర్రా గుహల్లో శివరాత్రి జాతర జరుగుతోంది. గుహల్లో వెలిసిన మహాశివుడికి గిరిజనులు అభిషేకాలు చేస్తున్నారు. కాశీపట్టణంలో ఉమా రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. శివలింగపురంలో స్వయంభు శివలింగాన్ని దర్శించుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా: మేళ్లచెరువు లోని స్వయంభు శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శివరాత్రి వేడకుల్లో ఎమ్మెల్యే సైదిరెడ్డి పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా: మహా శివరాత్రి సందర్భంగా భీమవరంలోని పంచారామ క్షేత్రం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగుతోంది. పాలకొల్లులోని పంచారామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వీరికి ఏటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కృష్ణాజిల్లా: కృత్తివెన్ను శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి జోగి రమేష్ మంత్రి జోగి రమేష్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన దేవదాయ ధర్మదాయ శాఖ ఏసీ గోపీనాథ్ బాబు. శ్రీ నాగేశ్వర స్వామి వారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి జోగి రమేష్. కృష్ణాజిల్లా: మహాశివరాత్రి సందర్భంగా మోపిదేవి మండలం పెద్దకళ్లపల్లిలో దుర్గా నాగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు దంపతులు. ఏలూరు జిల్లా: ముసునూరు మండలం బలివే రామలింగేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. బలివే రామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మేకాప్రతాప్ అప్పారావు. కీసరగుట్టకు పోటెత్తిన భక్తులు మేడ్చల్ మల్కాజగిరి జిల్లా కీసరగుట్టకు భక్తులు పోటెత్తారు. శివరాత్రి పర్వదినాన్ని పురుస్కరించుకుని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన కీసరగుట్ట భక్త జనసంద్రంతో నిండిపోయింది. శ్రీ భవాని శివదుర్గ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని తరించేందుకు భక్తులు రాష్ట్రంలోని నలుమూలల నుండి వచ్చారు. -
Srisailam : శివ నామస్మరణతో మార్మోగిన శ్రీశైల క్షేత్రం (ఫొటోలు)
-
శ్రీశైలానికి పోటెత్తుతున్న భక్తులు (ఫొటోలు)
-
శివయ్యా.. నా వల్ల కాదయ్యా!
సాక్షి, ఖమ్మం: ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగేళ్ల నుంచి ఆలయ నిర్వహణ నిధులు రాకపోవడంతో శివరాత్రి వేడుకలు నిర్వహించలేనంటూ నేలకొండపల్లిలోని శ్రీ ఉత్తరేశ్వరస్వామి దేవాలయం అర్చకుడు కొడవటిగంటి నరసింహారావు అధికారులకు మొర పెట్టుకుంటున్నాడు. ఆలయం పేరిట 1996వ సంవత్సరం వరకు 23 ఎకరాల భూమి ఉండగా, స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం నిధులు సమకూర్చలేదు. ఆతర్వాత ఆదాయం పడిపోయి అర్చకుల వేతనాలు నిలిపేయడంతో 2018లో నరసింహారావు హైకోర్టును ఆశ్రయించగా, భూమి విలువతో పాటు వడ్డీ కలిపి రూ.51 లక్షలను బ్యాంక్‌లో ఫిక్స్డ్ చేశారు. అయినప్పటికీ నాలుగేళ్ల నుంచి అర్చకుడికి వేతనం రాకపోగా, దీప, ధూప నైవైద్యం నిధులు కూడా ఇవ్వడంలేదు. దీంతో కుటంబ పోషణే కష్టంగా మారిన నేపథ్యాన శివరాత్రి వేడుకలు చేయడం సాధ్యం కాదంటూ నరసింహారావు బుధవారం తన గోడు వెళ్లబోసుకున్నాడు. -
Maha Shivratri 2022: హరహర మహాదేవ
-
శివ శివ శంకర.. భక్తజన జాతర
సాక్షి, నెట్వర్క్: మహా శివరాత్రి ఉత్సవాలకు శివాలయాలు ముస్తాబయ్యాయి. రాష్ట్రంలోని ప్రధాన శివాలయాలన్నీ విద్యుద్దీప కాంతుల్లో వెలుగులీనుతున్నాయి. పెద్దసంఖ్యలో తరలివచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్నిచోట్లా ఏర్పాట్లు చేశారు. ఆలయ ఆవరణల్లో భక్తుల జాగరణకు వీలుగా సౌకర్యాలు కల్పించారు. వేములవాడలోని రాజన్న సన్నిధిలో జరిగే మహాశివరాత్రి వేడుకలకు భక్తులు ఇప్పటికే తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇక్కడ సోమవారం ఆరంభమైన మహాజాతర మంగళ, బుధవారాల్లోనూ కొనసాగనుంది. మరోపక్క మంగళవారం నాటి ఉత్సవాలకు జోగుళాంబ గద్వాల జిల్లా ఆలంపూర్లోని బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అచ్చంపేటలోని ఉమామహేశ్వరాలయం శివపూజలకు సిద్ధమైంది. నల్లమల అటవీ ప్రాంతంలో ‘చెంచుల పండుగ’ పేరుతో నిర్వహించే శివరాత్రి వేడుకల్లో శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. మెదక్ జిల్లాలోని ఏడుపాయల ఆలయంలో శివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయంలో మంగళవారం పెద్దపట్నం పండుగ నిర్వహించనున్నారు. జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ప్రధానాలయంలో ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. వరంగల్ నగరంలోని చారిత్రక వేయిస్తంభాల గుడి (రుద్రేశ్వరస్వామి ఆలయం)లో మహాశివరాత్రి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆలయ ఆవరణలో క్యూలైన్లు ఏర్పాటుచేసి చలువ పందిళ్లు వేశారు. గవర్నర్, సీఎం శివరాత్రి శుభాకాంక్షలు సాక్షి, హైదరాబాద్: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ వేర్వేరుగా శుభాకాంక్షలు తెలిపారు. ఆ మహాశివుడు తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు ఆయురారోగ్యాలను సుఖ సంతోషాలను ప్రసాదించాలని ప్రార్థించారు. కాళేశ్వరం ప్రధాన ఆలయం ఎములాడలో జాతర షురూ వేములవాడ రాజన్న ఆలయంలో సోమవారం మహాశివరాత్రి జాతర.. ఉదయం 3 గంటలకు స్వామికి సుప్రభాత సేవతో ప్రారంభమైంది. 5 గంటలకు ప్రాతఃకాల పూజ, మధ్యాహ్నం 2.30కి రాజన్నకు మహానివేదన సమర్పించారు. రాజన్న జాతరకు ఈసారి 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. ఇక మంగళవారం మహాశివరాత్రి వేడుకలు జరగనున్నాయి. ఉదయం టీటీడీ తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, కేటీఆర్, గంగుల కమలాకర్ తదితరులు పాల్గొననున్నారు. కాగా, రాజన్న దర్శనానికి పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు గుడి ఆవరణతోపాటు చెరువులోని ఖాళీ స్థలంలో గుడారాలు వేసుకున్నారు. ధర్మగుండంలో స్నానాలు నిలిపివేయడంతో షవర్ల వద్ద రద్దీ పెరిగింది. కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకొని, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్జిత సేవలను రద్దుచేసి లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించారు. రాజన్న గుడి చెరువు ఖాళీస్థలంలో శివార్చన పేరుతో 1,500 మంది కళాకారులతో ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. -
పులకించిన శైవ క్షేత్రాలు
వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో శుక్రవారం మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. రాజన్న నామస్మరణంతో వేములవాడ క్షేత్రం పులకించిపోయింది. తొలుత స్వామికి మహాలింగార్చన నిర్వహిం చారు. స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు, తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన డిప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, గురవరాజులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రులు హరీశ్, ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే రమేశ్‌బాబు, కలెక్టర్ కృష్ణభాస్కర్, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు మూడు లక్షల మంది భక్తులు తరలివచ్చారని ఆలయ అధికారులు అంచనా వేశారు. ప్రముఖుల దర్శనాలు, ప్రత్యేక పూజల సందర్భంగా ఐదుసార్లు భక్తుల దర్శనానికి బ్రేక్‌లు పడ్డాయి. మరోవైపు.. రాజన్న గుడిచెరువు ఖాళీ స్థలంలో భక్తులు జాగరణ ప్రారంభించారు. ఉపవాస దీక్షతో తెల్లవార్లూ జాగరణ చేశారు. భక్తులకు ఉత్సాహం ఇచ్చేలా భక్తితో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. అలాగే, హన్మకొండలోని ప్రసిద్ధ వేయిస్తంభాల ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. మహాశివుడిని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి సైతం శుక్రవారం ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. ములుగు జిల్లా పాలంపేట రామప్ప రామలింగేశ్వరస్వామి దేవాలయం శివ నామస్మరణతో మారుమోగింది. రామప్ప దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివపార్వతుల కల్యాణం కనుల పండువగా జరిగింది. అలాగే, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరాలయంలో మహా శివరాత్రి వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. -
బ్రహ్మ మురారి సురార్చిత లింగం..
-
రామాలయంలో శివారాధన
వైష్ణవ దేవాలయంలో శివారాధన అత్యంత అరుదు. అలాంటి అద్భుతం ఏటా ‘రామతీర్ధం’ ఆలయంలో ఆవిష్కృతమవుతుంది! ఉత్తరాంధ్రలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం గ్రామంలో కొలువైన రామాలయంలో ఏటా శివరాత్రి జాతర అంగరంగ వైభవంగా జరగడం విశేషం. శివరాత్రికి రెండు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచే కాకుండా ఒడిశా రాష్ట్రం నుంచి వేలాదిగా భక్తులు ఈ క్షేత్రానికి తరలివస్తుంటారు. రామతీర్థం ఉత్తర రాజగోపురానికి ఎదురుగా నిలువుటద్దంలా కనిపించే బోడికొండ దశాబ్దాల అద్భుతంగా అలరారుతోంది. మరో వైపు బౌద్ధులు నడయాడిన గురుభక్తుల కొండ.. ఎదురుగా పచ్చని నీటితో కనిపించే రామకోనేరు.. ఇలా ఆ ప్రాంతమంతా అత్యంత సుందర నిలయమై భక్తులకు, పర్యాటకులకు కనువిందు చేస్తుంటాయి. రామతీర్థ మహత్మ్యం ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసానికి వెళుతూ శ్రీకృష్ణపరమాత్మను కూడా తోడు రమ్మని అడిగారు. అందుకు కృష్ణ పరమాత్మ వారితో.. తాను రామావతార సమయంలో దండకారణ్య ప్రాంతంలో సీతాలక్ష్మణ సమేతుడనై సంచరించానని, కనుక ఆనాటి రామావతారాన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తే వనవాస కాలంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని పాండవులకు చెప్పారు. చెప్పడమేగాక సీతారామలక్ష్మణ స్వామి విగ్రహాలను సృష్టించి పాండవులకు అందించారు. శ్రీకృష్ణుడు ఉపదేశించిన విధంగా పాండవులు రామతీర్ధం ప్రాంతంలో రాముడి దేవాలయాన్ని నిర్మించి స్వామివారిని సేవించి వనవాసాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశారు. తర్వాత పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్తూ వెళ్తూ నిర్మించిన దేవాలయాన్ని పరమ నిష్టాగరిష్టుడైన వేదగర్భుడు అనే వైష్ణవుడికి అప్పగించి వెళ్లిపోయారు. ఆ వేదగర్భుడు, వారి పుత్ర పౌత్రాదులు స్వామివారిని సేవిస్తూ ఉండేవారు. కొంతకాలం తరువాత క్రీ.పూ 6వ శతాబ్ధంలో బౌద్ధ భిక్షువులు ఆ ప్రాంతాన్నే కేంద్రంగా చేసుకొని వారి మత ప్రచారాన్ని చేసుకుంటూ కాల క్రమేపి రామతీర్థం ప్రాంతాన్ని ఆక్రమించారు. వాళ్ల మత సిద్ధాంతాలకు భయపడిన వేదగర్భుని వంశీయులు సీతారామలక్ష్మణ విగ్రహాలను భూగర్భంలో దాచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్లి పోయారు. నీటి మడుగులో విగ్రహాలు విజయనగరం పూసపాటి వంశీయులు 1650వ సంవత్సరంలో కుంభిళాపురం (నేడు కుమిలి గ్రామం)ను రాజధానిగా చేసుకొని పాలిస్తుండేవారు. ఆ గ్రామానికి చెందిన ఏకుల వంశానికి చెందిన ఓ ముసలావిడ కట్టెల కోసం వెళ్లి అరణ్యంలో చిక్కుకుంది. ఆమె నిస్సహాయ స్థితిని చూసి స్వామివారు ప్రకాశవంతమైన తేజస్సుతో దర్శనమిచ్చి కాపాడారు. మేము ఇక్కడ కొలువై ఉన్నామని మాకు దేవాలయం నిర్మించమని రాజుతో చెప్పమని సాక్షాత్తూ స్వామివారే ఆమెకు చెప్పారట. మరుసటి రోజు తెల్లవారు జామున రాజు కలలో కూడా సాక్షాత్కరించి ముదుసలి చెప్పినట్లు చేయమని ఆజ్ఞాపించారు. ఉదయం ముదుసలి చెప్పినట్లుగా పుణ్యస్థలానికి చేరుకొని వెతికితే నీటిమడుగులో సీతారామ లక్ష్మణుల ప్రతిమలు కనిపించాయి. దేవాలయ నిర్మాణానికి ఆ రాజు 1200 ఎకరాల పంట భూమిని రాసిచ్చి భీష్మ ఏకాదశి రోజున స్వామివారి విగ్రహాలను ప్రతిష్టించారు. అప్పటి నుంచి నేటికీ శ్రీరామ చంద్రమూర్తి భక్తుల నుంచి విశేష పూజలందుకుంటున్నారు. విశిష్టతల సమాహారం రామతీర్థ క్షేత్రానికి ఉత్తర దిక్కున నీలాచలం పేరుతో రెండు కిలోమీటర్ల పొడవు గల ఏకశిలా పర్వతం బోడికొండగా వ్యవహారంలో ఉంది. ఈ పర్వతంపై సీతారాములు, పాండవులు సంచరించినట్లుగా చిహ్నాలున్నాయి. అలాగే పర్వత శిఖరాన కోదండరాముని ఆలయం కూడా ఉంది. ఆలయం పక్కనే ఎప్పటికీ ఎండిపోని పాతాళగంగ అనే పేరు గల నీటికొలను ఉంది. ఈ నీటి మడుగు నుంచి పడమర దిశగా ఇరుకురాయి, దాని మధ్య నుంచి వెళితే భీముని బుర్ర చిహ్నం ఉంటుంది. అక్కడే భీముడు వంట చేయడానికి ఉపయోగించిన గాడిపొయ్యి కూడా ఉంది. దీనికి సమీపంలో ఉన్న గుహలో బుద్ధ విగ్రహం, పలుకురాయి ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒకసారి పిలిస్తే ఆ పిలుపు మూడు సార్లు ప్రతిధ్వనిస్తుంది. అలాగే పాండవుల ఐదు పంచలు, సీతమ్మవారి పురిటి మంచం తదితర చిహ్నాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఈ కొండ పక్కనే దుర్గాభైరవ కొండ, బౌద్ధుల నివాస గుహలు ఉన్నాయి. చారిత్రక గుర్తులను చూసేందుకు భక్తులు, సందర్శకులు అధిక సంఖ్యలో పర్వతంపైకి వెళుతుంటారు. రామతీర్థం రామాలయంలో వైకుంఠనాథస్వామి, వేణుగోపాలస్వామి, లక్షీ్మదేవి, మాధవ స్వామి, భూభుజంగ వరహాలక్షీ్మ స్వామి, ఆళ్వారుల సన్నిధి, శ్రీరామక్రతువు స్తంభం, సదాశివస్వామి వార్ల ఉపాలయాలు ఉన్నాయి. నిర్విరామంగా ప్రతినిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి శివరాత్రి జాగరణ ఏటా శ్రీ స్వామివారి కల్యాణోత్సవములు, రథయాత్ర, మహాశివరాత్రి, శ్రీరామనవమి ఉత్సవాలు, జ్యేష్టాభిషేకాలు, విఖసన జయంతి, పవిత్రోత్సవాలు, శ్రీవారి బ్రహ్మోత్సవాలు, తెప్పోత్సవం, గోపురోత్సవం, అధ్యయనోత్సవాలు, వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతుంటాయి. అలాగే ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశి పర్వదినాన అశేష జనావళి నడుమ గిరిప్రదక్షణం కూడా జరుగుతుంది. వైష్ణవాలయంలో శివరాత్రి ఉత్సవాలు జరపడమనేది ఇక్కడి ప్రత్యేకత. ఆ ఉత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు ముందురోజే క్షేత్రానికి చేరుకుని కోనేటిలో స్నానమాచరించి నిష్టాగరిష్టులై శివరాత్రి జాగరణ చేసి తరిస్తుంటారు. బోణం గణేష్, సాక్షి ప్రతినిధి, విజయనగరం. ఫొటోలు: డి.సత్యనారాయణ, పక్కి సురేష్ పట్నాయక్ -
అచంటలో పోలీసుల ఓవరాక్షన్..వీడియో వైరల్ !
సాక్షి, పశ్చిమ గోదావరి: జిల్లాలోని అచంటలో పోలీసుల ఓవరాక్షన్ కలకలం రేపింది. శివరాత్రి వేడుకల్లో యువతులను ఈవ్‌టీజింగ్ చేశారని కొంతమంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఏ విధమైనా విచారణ చేయకుండా వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంతటితో అగకుండా పీఎస్‌లోనే ఆ యువకులపై చేయి చేసుకున్నారు. ఈ దృశ్యాలను వీడియో చిత్రీకరిస్తున్న మీడియాపై పోలీసులు చిందులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. -
ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
సిటీబ్యూరో:ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు మంగళవారం నగరంలో ఘనంగా జరిగాయి. మంత్రులు, టీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు వివిధ చోట్ల జరిగిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు సీఎం పుట్టిన రోజు, శివరాత్రి వేడుకలు ఒకే రోజురావడంతో పలు చోట్ల దేవాలయాల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రత్యేక పూజలు జరిపించారు. భక్తులకు పండ్లు పంపిణీ చేశారు. కొన్నిచోట్ల ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు అందజేశారు. పలు చోట్ల రక్తదాన శిబిరాలు జరిగాయి. సికింద్రాబాద్ సీఎస్ఐ వెస్లీ చర్చిలో కేసీఆర్ అభిమానులు కేక్ కట్ చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో, ఎంజే మార్కెట్లో జరిగిన కేసీఆర్ జన్మదిన వేడుకల్లో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. ఉస్మానియాలో అంబులెన్స్ కోసం ఆయన ఎమ్మెల్సీ నిధులను అందజేశారు. ఆగాపురాలో టీఆర్ఎస్ కార్యకర్తలు అన్నదానం ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ తదితరచోట్ల కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. మరోవైపు సికింద్రాబాద్‌లో ఫోరమ్ ఫర్ స్ట్రీట్ చిల్డ్రన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎక్సైజ్ మంత్రి పద్మారావు పాల్గొని పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు. అంబర్పేట్ ఛేనెంబర్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో టీఆర్ఎస్ నగర కన్వీనర్ మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్ధనలు... సికింద్రాబాద్ సీఎస్ఐ వెస్లీ చర్చిలో కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలు జరిపి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. మైనారిటీ సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని ఈ సందర్భంగా నాయిని తెలిపారు. సీఎం కేసీఆర్ క్రైస్తవుల అభివృద్ధి, సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు చెప్పారు. బాచుపల్లి సాయినగర్‌లో జరిగిన వేడుకల్లో ఎంపీ కవితతో పాటు, మంత్రి జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. మియాపూర్‌లో జరిగిన రక్తదాన శిబిరంలో రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మలక్‌పేట్ బాలికల అంధుల పాఠశాలలోనూ కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.