shoab akthar
-
'నా కెరీర్లో ఆ స్పెల్ ఎప్పటికి మరిచిపోను'
-
వారిద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాం..
-
సల్మాన్ జైలు శిక్షపై షోయబ్ అక్తర్ కామెంట్
ఇస్లామాబాద్ : బాలీవుడ్ కండల నటుడు సల్మాన్ ఖాన్ జైలు శిక్షపై రావల్పిండి ఎక్స్‌ప్రెస్, పాకిస్తాన్ మాజీ దిగ్గజ బౌలర్ షోయబ్ అక్తర్ ట్విటర్లో స్పందించారు. సల్మాన్ ఖాన్‌కు కృష్ణ జింకల వేట కేసులో శిక్ష పడటం పట్ల విచారం వ్యక్తం చేశారు. సల్మాన్‌కు ఐదేళ్ల శిక్ష విధించడం చాలా కఠినమని పేర్కొన్నారు. తన స్నేహితుడు సల్మాన్ ఖాన్‌కు ఐదు సంవత్సరాలు జైలు శిక్షపడటం చాలా బాధ కలిగిందని ట్విటర్ ద్వారా తెలిపారు. కానీ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పును తాను గౌరవిస్తున్నానని వెల్లడించారు. సల్మాన్ కుటుంబసభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలిపారు. త్వరలోనే సల్మాన్ తిరిగి వస్తాడని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. కృష్ణ జింకలను వేటాడినట్లు నిరూపితం కావడంతో జోథ్‌పూర్ కోర్టు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ దేవ్ కుమార్ ఖత్రి గురువారం సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధించిన సంగతి తెల్సిందే. -
సచిన్ కెప్టెన్సీలో షోయబ్ అక్తర్
-
సచిన్ కెప్టెన్సీలో షోయబ్ అక్తర్
న్యూయార్క్: పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ సచిన్ కెప్టెన్సీలో క్రికిట్ ఆడబోతున్నందుకు సంతోషం వ్యక్తం చేశాడు. అమెరికాలోని న్యూయార్క్, హ్యూస్టన్, లాస్ ఎంజిల్స్లలో జరగనున్న మూడు టీట్వంటీ ఆల్ స్టార్స్ క్రికెట్ టోర్నీలో సచిన్ జట్టులో అక్తర్ ఆడనున్నాడు. టాస్ వేయడం ద్వారా ఆటగాళ్లను సచిన్ బ్లాస్టర్స్, వార్న్ వారియర్స్ జట్లు పంచుకున్నాయి. ఈ సందర్భంగా అక్తర్‌కు సచిన్ జట్టులో ఆడే అవకాశం వచ్చింది. దీనిపై అక్తర్ మాట్లాడుతూ.. 'థ్యాంక్ గాడ్ సచిన్ జట్టలో క్రికెట్ ఆడబోతున్నాను, అతని కెప్టెన్సీని నేనెప్పుడూ దగ్గరగా చూడలేదు' అని సంతోషం వ్యక్తం చేశాడు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ల సందర్భంగా గతంలో సచిన్‌కు ప్రత్యర్థిగా బౌలింగ్ చేసిన ఈ ఫాస్ట్ బౌలర్ ఆల్ స్టార్స్ టోర్నీలో మ్యాచ్ సందర్భంగా తనకు సచిన్ ఎలాంటి సలహాలు, వ్యూహాలు అందిస్తాడో చూడాలని ఆతృతగా ఉన్నాడు. సచిన్‌కు బౌలింగ్ చేస్తే చూడాలని ప్రజలు కోరుకుంటారని తెలుసు గానీ తనకు మాత్రం అతని కెప్టెన్సీలో ఆడాలని ఉన్నట్లు తెలిపాడు.