Shobana Kamineni
-
మనవరాలు ఇంటికి వచ్చిన శుభవేళ... ఉపాసన తల్లి ఏం చేసిందంటే?
వారసురాలి రాకతో మెగా కుటుంబం ఉబ్బితబ్బిబ్బవుతోంది. భార్య ఉపాసన గర్భంతో ఉన్నప్పుడే క్లీంకార ఎన్నో సంతోషాలను, అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని మురిసిపోయాడు రామ్‌చరణ్. ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ రావడం, ప్రపంచవ్యాప్తంగా తన నటనకు ప్రశంసలు దక్కడం, ఈ శుభసూచకాలన్నీ తన కూతురు వల్లే జరిగాయని మురిసిపోయాడు. క్లీంకార పుట్టిన తర్వాత వారి సంతోషం రెట్టింపయింది. ఇకపోతే చిరంజీవికి కోకాపేటలో ఉన్న ఆస్తుల రేట్లు పెరగడాన్ని కూడా క్లీంకారతో ముడిపెడుతున్నారు మెగా అభిమానులు. క్లీంకార అడుగుపెట్టిన వేళావిశేషం.. చిరు కుటుంబానికి అన్నీ కలిసొస్తున్నాయని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే బిడ్డ పుట్టిన తర్వాత తొలిసారి ఉపాసన పుట్టింటికి వెళ్లినట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త వైరలవుతోంది. ఈ క్రమంలో ఉపాసన తల్లి శోభన మనవరాలి కోసం ఘనమైన ఏర్పాట్లు చేసిందట! తన మనవరాలిని ఇంట్లోకి తీసుకొచ్చేముందు పనివాళ్లతో దిష్టి తీయించిందట! అంతేకాదు, దిష్టి తీసిన పనివాళ్లకు ఏకంగా రూ.10 లక్షలు ఇచ్చినట్లు ఓ వార్త వైరలవుతోంది. తర్వాత కూతురిని ఇంట్లోకి తీసుకెళ్లిన ఆమె మనవరాలితో ఆడుకుందట! అయినా దిష్టి తీసినందుకు వందలు, వేలు ఇస్తారు, అంతేకానీ ఇలా లక్షల్లో డబ్బు ఇవ్వడమేంటని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మెగా అభిమానులు మాత్రం.. తన మనవరాలు తొలిసారి ఇంటికి వచ్చిన శుభ సందర్భంలో పనివాళ్లకు బహుమతి ఇచ్చిందనుకోవచ్చుగా.. అని కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా మెగా మనవరాలు క్లీంకార మాత్రం అప్పుడే పెద్ద సెలబ్రిటీ అయిపోయింది! చదవండి: రూ.2 లక్షలిస్తా.. కమిట్మెంట్ ఇస్తావా? అని అడిగాడు: హీరోయిన్ లలిత్ మోదీతో బ్రేకప్.. క్లారిటీ ఇచ్చేసిన సుష్మితా సేన్ -
రామ్ చరణ్- ఉపాసన బిడ్డకు ఆ పేరు.. అసలు కారణం ఇదేనా?
మెగా ఇంట్లో ఈ ఏడాది పండగ వాతావరణం నెలకొంది. దాదాపు 11 ఏళ్ల తర్వాత మెగా వారసురాలు అడుగుపెట్టింది. జూన్ 20న రామ్ చరణ్ భార్య ఉపాసన పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్‌తో పాటు మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకున్నారు. తాజాగా మెగా వారసురాలి బారసాల కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. (ఇది చదవండి: రామ్ చరణ్ -ఉపాసన బిడ్డకు ఖరీదైన గిఫ్ట్.. స్పందించిన మెగా టీం!) ఈ వేడుకలో తన మనవరాలి పేరును మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. రామ్ చరణ్-ఉప్సీల బిడ్డ పేరును క్లీంకార అంటూ రివీల్ చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ వేడుకలో ఉపాసన తల్లిదండ్రులు పాల్గొన్నారు. అయితే మెగా వారసురాలి పేరుపై ఉపాసన మదర్ శోభన కామినేని ఇన్‌స్టాలో ఆసక్తికర పోస్ట్ చేసింది. ఉపాసన బిడ్డ పేరును ప్రస్తావిస్తూ ఫోటోలను షేర్ చేసింది. మొదట ఉపాసన పుట్టినప్పుడు ఈ పేరునే పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఉపాసన బిడ్డకు ఈ పేరు పెట్టడంతో చాలా సంతోషంగా ఉందని వెల్లడించింది. ఉపాసన రిప్లై ఈ పోస్ట్ చూసిన ఉపాసన కూడా స్పందించింది. తన ఇన్‌స్టా స్టోరీస్‌లో తన తల్లి శోభన పోస్ట్‌ను షేర్ చేసింది. లవ్ యూ మామ్ అంటూ మదర్‌కు ధన్యవాదాలు తెలిపింది. (ఇది చదవండి: రాకేశ్ మాస్టర్ ఇచ్చిన ఆస్తి పేపర్లు చించేశాడు.. ఎందుకో తెలిస్తే) View this post on Instagram A post shared by Shobana Kamineni (@shobanakamineni) -
నాటు నాటు పాటకు చరణ్ అత్తయ్య డ్యాన్స్
-
నాటు నాటు పాటకు వీధుల్లో స్టెప్పులేసిన రామ్‌చరణ్ అత్తయ్య
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట తెలుగు రాష్ట్రాలనే కాదు, ఇండియాను ఓ ఊపు ఊపేసింది. పాన్ ఇండియా లెవల్లోనే కాదు పాన్ వరల్డ్ రేంజ్లోనూ నాటు సాంగ్ వీరనాటు హిట్టయిందని గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో నిరూపితమైంది. తాజాగా ఈ పాటకు ఉపాసన తల్లి, అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ శోభన కామినేని కాలు కదిపారు. నాటునాటు పాట పాడుతూ స్టెప్పులేశారు. ఈ వీడియోను ఉపాసన ట్విటర్లో షేర్ చేస్తూ.. 'అల్లుడి ఘనతకు సంతోషంతో గర్విస్తున్న అత్తయ్య.. లవ్ యూ మామ్' అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ సదస్సులో శోభన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న ఆదరణ చూస్తుంటే మనసు ఉప్పొంగుతోంది. ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పరిణామం ఎంతోమంది భారతీయుల్లో ఆశ కలిగించింది' అని చెప్పుకొచ్చారు. చదవండి: కాజోల్ భర్త లేనప్పుడు ఆమెకు ముద్దు పెట్టా: నటుడు -
పుట్టింటికి వెళ్లిన ఉపాసన.. మిస్ యూ అత్తమ్మ అంటూ పోస్ట్
మెగా కోడలు ఉపాసన త్వరలో తల్లి కాబోతోంది. ఈ శుభవార్తతో ఉపాసన మెట్టినింట, పుట్టినింట సంతోషాలు మిన్నంటాయి. జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్న ఉపాసన- రామ్‌చరణ్ దంపతులకు బంధుమిత్రులు, సెలబ్రిటీలు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఉపాసన అత్తారింటి నుంచి పుట్టినింటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తన తల్లితో పాటు అపోలో హాస్పిటల్ ప్రతినిధులతో కలిసి దిగిన ఫోటోను ట్విటర్లో షేర్ చేసింది. కాకపోతే అత్తమ్మ సురేఖను మిస్ అవుతున్నట్లు తెలిపింది. 'నా జీవితంలో అత్యంత ముఖ్యమైన మహిళల ఆశీర్వాదాలతో మాతృత్వంలోకి అడుగుపెట్టబోతున్నాను. కానీ ఇక్కడ అత్తమ్మను మిస్ అవుతున్నాను అని రాసుకొచ్చింది. ఇక ఈ ఫోటోలో ఉపాసన తల్లి శోభనా కామినేనితో పాటు అపోలో హాస్పిటల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి, అపోలో హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ ప్రీతారెడ్డి అలాగే ఆమె మిత్రురాలు సునీతా రెడ్డి ఉన్నారు. Entering motherhood with the blessings of the most important women in my life. ❤️ Missing athama. 🤗@shobanakamineni @drsangitareddy @preethareddy28 #suneetareddy pic.twitter.com/tkbCntSrc4 — Upasana Konidela (@upasanakonidela) December 15, 2022 చదవండి: నా కొడుకు నన్ను చంపలేదు, నేను బతికే ఉన్నా: నటి హీరోయిన్‌పై కోప్పడ్డాను.. ఇప్పుడేం చేయాలో చెప్పి చావని తిట్టింది: పూరీ -
వయసును వెనుకే వదిలి పెట్టెయ్
60 ఏళ్ల శోభనా కామినేని 600 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేశారు. హైదరాబాద్ నుంచి చెన్నై వరకు తన భర్త, కుమార్తెతో కలిసి సైకిల్ మీద ప్రయాణించారు. స్త్రీలు ఏ వయసులోనైనా ఏదైనా సాధించగలరు... ఆరోగ్యాన్ని కాపాడుకుంటే విజయాన్ని అందుకోగలరు అనే సందేశం ఇవ్వడానికే ఈ యాత్ర చేశానని శోభన అన్నారు. శోభనా కామినేని నటుడు చిరంజీవికి వియ్యపురాలు. ఉపాసన తల్లి. రోజుకు వంద కిలోమీటర్ల చొప్పున సైకిల్ తొక్కుతూ ఆరు రోజుల్లో పూర్తయిన ఈ స్ఫూర్తివంతమైన యాత్రా విశేషాలు... జీవితాన్ని ఎప్పటికప్పుడు కొత్తగా ప్రారంభించాలి. ఉత్సాహపరుచుకోవాలి. ఉరకలెత్తించాలి. జీవితాన్ని ప్రతి క్షణం పరిపూర్ణంగా అనుభవించాలి. మన దేశంలో ఒకటి రెండు దశాబ్దాల కింద వరకూ 60 ఏళ్లు అనేది చాలా పెద్ద వయసుగా భావన ఉండేది. 60 రాగానే వయసైపోయింది కదా అనే మాట వినిపించేది. కాని ఇప్పుడు 60 అనేది దాదాపుగా ఒక మధ్యవయసు అనే పునరుత్సాహం చాలామందిలో కనిపిస్తోంది. ముఖ్యంగా స్త్రీలు 60 అనే అంకెను ఒక భారంగా ఎంచి తద్వారా శారీరకంగా మానసికంగా అలసటను దరి చేరనివ్వరాదని, నిర్లిప్తతను కలిగి ఉండరాదని స్ఫూర్తి నింపేవారు చాలామంది ఉన్నారు. అలాంటివారిలో అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్పర్సన్ శోభనా కామినేని ఒకరు. ఛాలెంజ్‌ను స్వీకరించు... ఆరోగ్యరంగ దిగ్గజం ప్రతాప్ రెడ్డి కుమార్తె శోభనా కామినేని అపోలో హాస్పిటల్స్ విజయానికి కారణకర్తగా మాత్రమే కాక నటుడు చిరంజీవికి వియ్యపురాలుగా కూడా అందరికీ తెలుసు. ఉపాసన తల్లిగా రామ్ చరణ్ అత్తగారిగా అమె తరచూ వార్తల్లో ఉంటారు. ఇటీవల ఆమె తన 60వ పుట్టినరోజును భిన్నంగా... సందేశాత్మకంగా చేసుకోదలిచారు. ‘ఛాలెంజ్‌ను స్వీకరించు.. నెరవేర్చు’ నినాదం తో ఆమె హైదరాబాద్ నుంచి చెన్నై వరకూ ఏకంగా 642 కిలోమీటర్ల సైకిల్ యాత్ర పెట్టుకున్నారు. 60 ఏళ్ల వయసులో చాలా ఎనర్జీని డిమాండ్ చేసే ఈ పనిని చేసి చూపించాలనుకున్నారు. ఇంకేముంది.. రంగంలో దిగారు. భర్త, కుమార్తెతో కలిసి... శోభనా కామినేని సైకిల్ యాత్ర సంకల్పాన్ని విని ఆమె భర్త అనిల్ కామినేని, కుమార్తె అనుష్పలా కామినేని తాము కూడా పాల్గొంటాం అని ఉత్సాహ పడ్డారు. ముగ్గురు హైదరాబాద్ మసాబ్ ట్యాంక్ నుంచి యాత్రను మొదలుపెట్టారు. ‘దారిలో చాలామంది నన్ను ఈ యాత్ర ఎందుకు చేస్తున్నారని అడిగారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఏ పనైనా చేయొచ్చని వయసును కేవలం ఒక అంకెగా మాత్రమే చూడాలని చెప్పడానికే చేశాను అని జవాబిచ్చాను.’ అని చెప్పారు శోభనా కామినేని. ఆమె సైకిల్ యాత్ర 6 రోజుల పాటు సాగింది. రోజుకు వంద కిలోమీటర్ల లెక్కన సైకిల్ తొక్కారు. ఇది చిన్న విషయం కాదు. ‘తెల్లవారుజామున మూడున్నరకంతా నిద్ర లేవడం కొంచెం కష్టమనిపించినా లేచి ప్రయాణం కట్టాను. ఒకటి రెండుసార్లు డీహైడ్రేషన్‌గా అనిపించింది. తగిన ఆహారం తీసుకుంటూ యాత్ర సాగించాను. దారిలో పంట పొలాలు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించాయి. మా తాతగారు రైతు. మా నాన్నను మెడిసిన్ చదివించారు. ఆ జ్ఞాపకాలు చుట్టుముట్టాయి’ అన్నారామె. మాత్రోత్సాహం కూతురు ఏదైనా మంచి పని చేస్తే పుత్రికోత్సాహం అనొచ్చు. తల్లి ఏదైనా మంచి పని చేస్తే ఆ కూతురికి కలిగేది మాత్రోత్సాహం అనాలేమో. తన తల్లి శోభన చేసిన యాత్రను చూసి కుమార్తె ఉపాసన చాలా సంతోష పడ్డారు. ‘మా అమ్మను చూసి నేనెప్పుడూ గర్వపడుతుంటాను’ అని ట్వీట్ చేశారామె. తల్లి తన తాతను కలవడానికి చేసిన ప్రయాణంగా, పిల్లలకు ఒక తార్కాణంగా నిలవడానికి చేసిన ప్రయత్నంగా కూడా ఉపాసన ఈ సైకిల్ యాత్రను చూశారు. కొత్త సంవత్సరం ఇలాంటి ఉత్సాహకరమైన పనులను వినడం బాగుంది కదూ. – సాక్షి ఫ్యామిలీ -
తల్లి సైకిల్ యాత్ర: ఉపాసన భావోద్వేగం
బంజారాహిల్స్ : అపోలో ఆస్పత్రుల వైస్ చైర్పర్సన్ శోభనా కామినేని తన 60వ పుట్టినరోజు వేడుకను వినూత్నంగా జరుపుకున్నారు. ఈ నెల 25న ఉదయం తన భర్త అనిల్ కామినేనితో కలసి చాలెంజ్ టు సైకిల్ టు చెన్నై ఫ్రం హైదరాబాద్ అనే నినాదాన్ని ఎంచుకొని బయల్దేరారు. రోజుకు వంద కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తూ ఆరు రోజుల్లో 600 కిలోమీటర్లు వెళ్ళి చెన్నైలో తన తండ్రి ప్రతాప్.సి.రెడ్డిని బుధవారం కలుసుకొని సంతోషం పంచుకున్నారు. సైక్లింగ్‌తో తన భర్త, కూతురుతో కలసి ఔటింగ్‌కు వెళ్లిన ఆనందం కలిగించిందని ఆమె తెలియజేశారు. సైకిల్ రైడింగ్ తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా ఒక మహిళ తలచుకుంటే ఏదైనా సాధించగలదనే నమ్మకానికి పునాది వేసిందని పేర్కొన్నారు. తన తల్లి శోభనా కామినేని తన 60వ పుట్టినరోజున హైదరాబాద్ నుంచి చెన్నైకి 600 కిలోమీటర్లు సైకిల్ రైడింగ్ చేస్తూ వెళ్లడం తనకెంతో గర్వంగా ఉందని ఆమె కూతురు, సినీహీరో రామ్‌చరణ్ తేజ్ సతీమణి ఉపాసన కొణిదెల బుధవారం ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. -
పదేళ్ల క్రితం వచ్చిన ఆలోచన ఇది
‘‘కళాకారులకు జాతీయ స్థాయిలో ఫిల్మ్ అవార్డులు ఇవ్వాలని పదేళ్ల కిత్రం నాకో ఆలోచన వచ్చింది. అదీ ప్రజాభిప్రాయం తెలుసుకుని ఇవ్వాలని. ప్రజాభిప్రాయ సేకరణకు టీవీ చానల్ ఉంటే బాగుంటుందని టీ వీ9తో కలిసి ‘టీఎస్ఆర్ టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’ని స్థాపించా’’ అని కళాబంధు, ‘టీఎస్ఆర్ టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’ చైర్మన్ టి.సుబ్బరామి రెడ్డి అన్నారు. 2017, 2018 సంవత్సరాలకు ‘టీఎస్ఆర్ టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’కి ఎంపికైన వారి వివరాలను గురువారం సుబ్బరామిరెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ఈ అవార్డ్స్ ఫంక్షన్‌ని ఈ నెల 17న విశాఖపట్నంలోని పోర్ట్ స్టేడియంలో నిర్వహిస్తున్నాం. తెలుగు, హిందీ, పంజాబీ, భోజ్‌పురి, తమిళ్, కన్నడ, మలయాళం.. ఇలా భారతదేశంలోని అన్ని భాషల నటీనటులకు అవార్డులు ఇస్తున్నాం. ఈ అవార్డుల జ్యూరీ మెంబర్లుగా నగ్మా, జీవితా రాజశేఖర్, మీనా, పరుచూరి గోపాలకృష్ణ, కేఎస్ రామారావు, నరేశ్, రఘు రామకృష్ణంరాజు, పింకీ రెడ్డి, శోభన కామినేని వ్యవహరించారు. వేలాది మంది ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అన్ని భాషల నుంచి దాదాపు 60మంది ఫిల్మ్ స్టార్స్ అవార్డులు తీసుకోనున్నారు’’ అన్నారు. జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికైన నటి నగ్మా మాట్లాడుతూ –‘‘నా లైఫ్ ఇంకా చాలా ఉంది.. ఇంకా చాలా సినిమాలు చేయాలి. అప్పుడే మీరు (సుబ్బరామిరెడ్డి) లైఫ్‌టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు ప్రకటించారు (నవ్వుతూ). ఈ అవార్డుతో పాటు సామాజిక సేవ చేసినందుకు మార్చిలో ‘రాజీవ్‌గాంధీ’ అవార్డుకూడా అందుకోబోతున్నా. తెలుగులో నా సినీ ప్రయాణం ఇంకా కొనసాగాలి’’ అన్నారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘అందరికంటే కష్టమైన పని ఏంటంటే జ్యూరీ సభ్యునిగా ఉండటం. నక్షత్రాల్లో చంద్రుడ్ని చూపించి ఇందులో ఎవరు పెద్ద, గొప్ప అంటే చంద్రుడ్ని చూపిస్తాం. అందరి చంద్రుల్ని చూపించి ఇందులో ఏ చంద్రుడు గొప్ప అంటే ఏం చెబుతాం? అలా ఈ హీరోలు, హీరోయిన్లందరూ చందమామలే. మా అదృష్టం ఏంటంటే కొన్ని వేలమంది చక్కగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. మేం రెండు మూడుసార్లు చర్చించుకుని ఫైనల్ లిస్ట్ తయారు చేశాం. వర్షం పడితే రైతుకు ఆనందం. కళాకారుల ముఖం ఆనందంతో తడిస్తే మా సుబ్బరామిరెడ్డిగారికి ఆనందం. మహాభారతంలో ధర్మరాజును అజాతశత్రువు అంటారు. ఈ భారతదేశంలో నాకు సజీవంగా కనిపిస్తున్న ఏకైక అజాత శత్రువు సుబ్బరామిరెడ్డిగారు’’ అన్నారు. జ్యూరీ సభ్యులు శోభన కామినేని, రఘురామ కృష్ణంరాజు పాల్గొన్నారు. -
అపోలో సారథ్యంలో ‘బయోబ్యాంక్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చౌక ఔషధాల తయారీతోపాటు ‘పర్సన లైజ్డ్’ వైద్య సేవలకూ ఉపయోగపడే బయోబ్యాంక్ ‘సేపియన్ బయోసెన్సైస్’ సంస్థను అపోలో హాస్పిటల్స్ ప్రారంభించింది. సారమ్ ఇన్నోవేషన్స్ సంస్థతో కలిసి దీన్ని ఏర్పాటు చేసింది. కంపెనీ ప్రారంభం సందర్భంగా సోమవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ శోభన కామినేని ఈ విషయాలు తెలిపారు. ఆస్పత్రికి వచ్చే పేషెంట్ల దగ్గర్నుంచి సేకరించే కణాలను.. ఇతర సమాచారాన్ని భద్రపర్చి, వివిధ వ్యాధులపై పరిశోధనలకు ఉపయోగించ నున్నట్లు ఆమె వివరించారు. దీనివల్ల ఆయా వ్యాధులకు తగిన ఔషధాలను రూపొందించేందుకు పట్టే సమయం, వ్యయాలు కూడా గణనీయంగా తగ్గగలవని పేర్కొన్నారు. ఫలితంగా ఔషధాల ధర సైతం తగ్గగలదన్నారు. నమూనాల సేకరణ పూర్తిగా దాతల అంగీకారానికి లోబడే జరుగుతుందని శోభన పేర్కొన్నారు. మరోవైపు, ఒకే రకమైన ఔషధానికి వేర్వేరు వ్యక్తులు వివిధ రకాలుగా స్పందిస్తుంటారని, ఈ నేపథ్యంలో ఆయా వ్యక్తుల తత్వానికి అనుగుణమైన ఔషధాలను, పాటించాల్సిన చికిత్స రీతులను (పర్సనలైజ్డ్) తెలియజేసే పరీక్షలను కూడా సేపియన్ బయోసెన్సైస్ రూపొందించిందని సంస్థ సీఈవో శ్రీవత్స నటరాజన్ తెలిపారు. పాటించాల్సిన విధానంపై వైద్యులకు మరింత స్పష్టత రావడం వల్ల పేషెంట్లకు కూడా గణనీయంగా వ్యయాలు తగ్గగలవన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 150 దాకా ఇలాంటి బయోబ్యాంకులు ఉన్నాయని నటరాజన్ వివరించారు. దేశీయంగానూ కొన్ని ఉన్నప్పటికీ.. అవి ఆస్పత్రుల్లో అంతర్భాగంగా చిన్నస్థాయిలోనే ఉంటున్నాయన్నారు. వాణిజ్యపరంగా సేపియన్ బయోసెన్సైస్ ఈ తరహావాటిలో మొట్టమొదటిది అవుతుందని నటరాజన్ పేర్కొన్నారు. మధుమేహం వంటి వ్యాధుల రాకను ముందస్తుగానే గుర్తించేందుకు ఉపయోగపడే పరీక్షలను కూడా అందిస్తున్నట్లు అపోలో హాస్పిటల్స్ సీఈవో (సెంట్రల్ రీజియన్) కె.హరిప్రసాద్ చెప్పారు. ఈ పరీక్షలకు దాదాపు రూ. 750 వ్యయం అవుతుందన్నారు. సేపియన్ బయోసెన్సైస్లో అపోలో హాస్పిటల్స్‌కి సుమారు 70% వాటాలు ఉంటాయి. వచ్చే రెండేళ్లలో నగదు, మౌలిక సదుపాయాలు తదితర రూపంలో సుమారు 3-4 మిలియన్ డాలర్లు (దాదాపూ రూ. 25 కోట్లు) దీనిపై ఇన్వెస్ట్ చేయనున్నారు.