Upasana Mother Shobana Kamineni Dance For Naatu Naatu Song, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Upasana: నాటు నాటు పాటకు చరణ్‌ అత్తయ్య డ్యాన్స్‌.. లవ్‌ యూ అంటూ ఉప్సీ ట్వీట్‌

Published Wed, Jan 18 2023 6:48 PM | Last Updated on Wed, Jan 18 2023 7:00 PM

Upasana Mother Shobana Kamineni Dance for Natu Natu Song - Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటు నాటు పాట తెలుగు రాష్ట్రాలనే కాదు, ఇండియాను ఓ ఊపు ఊపేసింది. పాన్‌ ఇండియా లెవల్‌లోనే కాదు పాన్‌ వరల్డ్‌ రేంజ్‌లోనూ నాటు సాంగ్‌ వీరనాటు హిట్టయిందని గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుతో నిరూపితమైంది. తాజాగా ఈ పాటకు ఉపాసన తల్లి, అపోలో హాస్పిటల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ శోభన కామినేని కాలు కదిపారు. నాటునాటు పాట పాడుతూ స్టెప్పులేశారు. ఈ వీడియోను ఉపాసన ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. 'అల్లుడి ఘనతకు సంతోషంతో గర్విస్తున్న అత్తయ్య.. లవ్‌ యూ మామ్‌' అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా దావోస్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచ సదస్సులో శోభన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న ఆదరణ చూస్తుంటే మనసు ఉప్పొంగుతోంది. ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పరిణామం ఎంతోమంది భారతీయుల్లో ఆశ కలిగించింది' అని చెప్పుకొచ్చారు.

చదవండి: కాజోల్‌ భర్త లేనప్పుడు ఆమెకు ముద్దు పెట్టా: నటుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement