latest movie news in telugu, latest film news in telugu, latest tollywood news in telugu, - Sakshi
Sakshi News home page

RRR Movie: ఫ్యాన్స్‌పై పేపర్లు విసురుతూ థియేటర్‌లో రచ్చ చేసిన ఉపాసన

Published Fri, Mar 25 2022 8:25 AM | Last Updated on Fri, Mar 25 2022 9:57 AM

Upasana Throws Papers in Theatre During the Naatu Naatu Song - Sakshi

ఎక్కడ చూసినా, ఎవరిని కదిలించినా ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం.. రణం.. రుధిరం) గురించే ప్రస్తావన. సినీ ప్రియుల ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు నేడు (మార్చి 25న) ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ  రిలీజైంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ థియేటర్‌ వైపు పరుగులు తీస్తూ సినిమా చూసి ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో రామ్‌చరణ్‌ భార్య ఉపాసన సైతం థియేటర్‌కు వెళ్లి ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ చూసింది. అంతేకాదు, పేపర్లు చింపుతూ, వాటిని గాల్లోకి ఎగరేస్తూ సంతోషం వ్యక్తం చేసింది.

నాటు నాటు సాంగ్‌కు కేకలు పెడుతున్న ఫ్యాన్స్‌పైనా పేపర్లు చల్లింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే నెట్టింట ఆర్‌ఆర్‌ఆర్‌కు సౌత్‌ నుంచి నార్త్‌ దాకా అంతటా పాజిటివ్‌ టాక్‌ వినిపిస్తోంది. ఇందులో కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటించారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

చదవండి: ఆ సీన్‌ సినిమాకే హైలైట్‌.. జక్కన్న మాటలతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement