Upasana: Entering Motherhood With Blessings of Important Women In My Life - Sakshi

Upasana: త్వరలో అమ్మను కాబోతున్నాను, అందుకే ఈ ఆశీర్వాదాలు: ఉపాసన

Published Thu, Dec 15 2022 8:04 PM | Last Updated on Thu, Dec 15 2022 9:31 PM

Upasana: Entering Motherhood With Blessings of Important Women In My Life - Sakshi

మెగా కోడలు ఉపాసన త్వరలో తల్లి కాబోతోంది. ఈ శుభవార్తతో ఉపాసన మెట్టినింట, పుట్టినింట సంతోషాలు మిన్నంటాయి. జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్న ఉపాసన- రామ్‌చరణ్‌ దంపతులకు బంధుమిత్రులు, సెలబ్రిటీలు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

తాజాగా ఉపాసన అత్తారింటి నుంచి పుట్టినింటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తన తల్లితో పాటు అపోలో హాస్పిటల్‌ ప్రతినిధులతో కలిసి దిగిన ఫోటోను ట్విటర్‌లో షేర్‌ చేసింది. కాకపోతే అత్తమ్మ సురేఖను మిస్‌ అవుతున్నట్లు తెలిపింది. 'నా జీవితంలో అత్యంత ముఖ్యమైన మహిళల ఆశీర్వాదాలతో మాతృత్వంలోకి అడుగుపెట్టబోతున్నాను. కానీ ఇక్కడ అత్తమ్మను మిస్‌ అవుతున్నాను అని రాసుకొచ్చింది. ఇక ఈ ఫోటోలో ఉపాసన తల్లి శోభనా కామినేనితో పాటు అపోలో హాస్పిటల్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగీతారెడ్డి, అపోలో హాస్పిటల్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ప్రీతారెడ్డి అలాగే ఆమె మిత్రురాలు సునీతా రెడ్డి ఉన్నారు.

చదవండి: నా కొడుకు నన్ను చంపలేదు, నేను బతికే ఉన్నా: నటి
హీరోయిన్‌పై కోప్పడ్డాను.. ఇప్పుడేం చేయాలో చెప్పి చావని తిట్టింది: పూరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
 
Advertisement