Shobha Hymavathi
-
కుమారుడి వివాహానికి సీఎం జగన్‌ను ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే
సాక్షి, విజయనగరం: ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి తన కుమారుడు అన్వేష్‌కుమార్ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కోరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాయలంలో ముఖ్యమంత్రిని శుక్రవారం కలిసి వివాహ ఆహ్వానపత్రికను అందజేశారు. హైమావతి వెంట జీసీసీ చైర్పర్సన్ డాక్టర్ శోభాస్వాతిరాణి ఉన్నారు. చదవండి: (చెన్నై ఆస్పత్రిలో నారాయణ కాలేజ్ విద్యార్థి మృతి..) -
సీమాంధ్రలో ఆదాయ వనరులు తక్కువ
తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శోభాహైమవతి విజయనగరం ఫూల్‌బాగ్, న్యూస్‌లైన్ : తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తాయని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శోభాహైమవతి అన్నారు. పట్టణంలోని అశోక్ బంగ్లాలో శుక్రవారం టీడీపీ జిల్లాస్థాయి ‘మినీ తెలుగునాడు’జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 40 శాతం విస్తీర్ణం ఉన్న తెలంగాణ ప్రాంతానికి 60 శాతం ఆదా య వనరులు ఉంటే, 60 శాతం విస్తీర్ణం ఉన్న సీమాంధ్ర ప్రాంతానికి 40 శాతం మాత్రమే ఆదాయ వనరులు ఉన్నాయని చెప్పారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు లాంటి అనుభవజ్జుడైన ముఖ్యమంత్రి అవసరం సీమాంధ్రకు ఉం దని చెప్పారు. దేశానికి నరేంద్రమోడీ నాయకత్వం ఎంతో అవసరమన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న వారిపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తి వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతకుముందు ఆమె ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపూడి జగదీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్. కోట, నెల్లిమర్ల, విజయనగరం, గజపతినగరం, చీపురు పల్లి, పార్వతీపురం నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, పతివాడ నారాయణస్వామినాయు డు, మీసా ల గీత, కె.ఎ. నాయుడు, కిమిడి మృణాళిని, బొబ్బిలి చిరంజీవులు, జెడ్పీ చైర్మన్ అభ్యర్థి శోభాస్వాతీరాణి, టీడీపీ జిల్లా కార్యదర్శి ఐవీ పీ రా జు, బొబ్బిలి నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జి తెంటు లక్ష్మునాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
ఆ నలుగురిని బహిరంగంగా ఊరి తీయాలి: టీడీపీ
నిర్భయ కేసులో ఉరిశిక్ష ఖరారైన నిందితులను బహిరంగంగా ఉరితీయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. బాధితురాలి పట్ల రాక్షసంగా ప్రవర్తించిన అరుదైన నిర్భయ కేసులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును పార్టీ స్వాగతిస్తుందని ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు శోభా హైమావతి తెలిపారు. పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిర్భయ చట్టం అమలు సరిగాలేదని తప్పుపట్టారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ రోజురోజుకూ మహిళలపై లైంగిక వేధింపులు పెరుగుతున్న పరిస్థితులలో నిర్భయ చట్టం వచ్చిందని, ఈ చట్టం అమలులోకి వచ్చిన ఈ ఆరు నెలల కాలంలో మహిళలపై దాడులు పెరిగిపోవడం దారుణమన్నారు. నిర్భయ కేసుపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లో వెంటనే తీర్పు వచ్చి ఉన్నట్టయితే పరిస్థితులు వేరుగా ఉండేవని అభిప్రాయపడ్డారు. తీర్పు ఆలస్యమైన నేపథ్యంలోనే ముంబయిలో మహిళా ఫోటోగ్రాపర్పై లైంగిక దాడి చోటుచేసుకుందన్నారు. మన రాష్ట్రంలోనూ శ్రీకాకుళం జిల్లాలో ఆరేళ్ల బాలికపై, విశాఖపట్నం జైలు వద్ద మహిళప ఇద్దరు కానిస్టేబుల్స్ లైంగిక దాడి చేయడం లాంటి ఘటనలు కొంత వరకు తగ్గేవన్నారు. నిర్భయ కేసు నిందితులలో మైనర్ అన్న కారణంగా ఒకరికి కేవలం మూడేళ్లే శిక్ష విధించడం దారుణమన్నారు. అతనికీ ఖచ్చితంగా నలుగురి నిందితులతో పాటు తీవ్రమైన శిక్ష విధించాలని సూచించారు.