నిర్భయ కేసులో ఉరిశిక్ష ఖరారైన నిందితులను బహిరంగంగా ఉరితీయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. బాధితురాలి పట్ల రాక్షసంగా ప్రవర్తించిన అరుదైన నిర్భయ కేసులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును పార్టీ స్వాగతిస్తుందని ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు శోభా హైమావతి తెలిపారు. పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిర్భయ చట్టం అమలు సరిగాలేదని తప్పుపట్టారు.
దేశంలోనూ, రాష్ట్రంలోనూ రోజురోజుకూ మహిళలపై లైంగిక వేధింపులు పెరుగుతున్న పరిస్థితులలో నిర్భయ చట్టం వచ్చిందని, ఈ చట్టం అమలులోకి వచ్చిన ఈ ఆరు నెలల కాలంలో మహిళలపై దాడులు పెరిగిపోవడం దారుణమన్నారు. నిర్భయ కేసుపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లో వెంటనే తీర్పు వచ్చి ఉన్నట్టయితే పరిస్థితులు వేరుగా ఉండేవని అభిప్రాయపడ్డారు. తీర్పు ఆలస్యమైన నేపథ్యంలోనే ముంబయిలో మహిళా ఫోటోగ్రాపర్‌పై లైంగిక దాడి చోటుచేసుకుందన్నారు.
మన రాష్ట్రంలోనూ శ్రీకాకుళం జిల్లాలో ఆరేళ్ల బాలికపై, విశాఖపట్నం జైలు వద్ద మహిళప ఇద్దరు కానిస్టేబుల్స్ లైంగిక దాడి చేయడం లాంటి ఘటనలు కొంత వరకు తగ్గేవన్నారు. నిర్భయ కేసు నిందితులలో మైనర్ అన్న కారణంగా ఒకరికి కేవలం మూడేళ్లే శిక్ష విధించడం దారుణమన్నారు. అతనికీ ఖచ్చితంగా నలుగురి నిందితులతో పాటు తీవ్రమైన శిక్ష విధించాలని సూచించారు.
ఆ నలుగురిని బహిరంగంగా ఊరి తీయాలి: టీడీపీ
Published Fri, Sep 13 2013 9:57 PM | Last Updated on Fri, Aug 10 2018 7:58 PM
Advertisement