Shocking moment
-
షాకింగ్ ఘటన: మూడేళ్ల చిన్నారిని కర్కశంగా.. రైలు పట్టాలపైకి తోసేసి..
మూడేళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా రైలు పట్టాలపైకి తోసేసింది ఓ మహిళ. దీంతో సదరు బాలిక తీవ్ర గాయాలపాలైంది. ఈ ఘటన అమెరికాలో ఒరెగాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ర్వైలే స్టేషన్లో ఫ్లాట్‌ఫాంపై తన తల్లితో ఉన్న మూడేళ్ల చిన్నారిని గుర్తు తెలియని మహిళ రైలు పట్టాలపైకి తోసేసింది. ఈ మేరకు ముల్ట్నోమా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం తన వెబ్సైట్లో ఈ విషయాన్ని వెల్లడించింది. దీని ప్రకారం...మూడేళ్ల బాలికను 32 ఏళ్ల బ్రియానా లేస్ వర్క్‌మెన్ అనే మహిళ తోసేసినట్లు పేర్కొంది. దీంతో బాలిక తలకు తీవ్ర గాయమై విలవిల్లాడిందని తెలిపారు. ఈ ఘటనతో అక్కడే ఫ్లాట్ ఫాంపై ఉన్న మిగత వ్యక్తులు వెంటనే స్పందించి...సదరు చిన్నారిని రక్షించారు. ఆ చిన్నారి పోర్ట్‌ల్యాండ్‌లో నివసిస్తున్నట్లు పేర్కొంది. ఈ షాకింగ్ ఘటనతో సదరు ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇలాంటి దారుణాలకు ఎందుకు ఒడిగడుతుంటారో అర్థం కాదంటూ.. ప్రయాణికులలో ఒకరు ఆవేదనగా అన్నారు. ఈ మేరకు ఈ దారుణానికి పాల్పడిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడమే గాక బెయిల్ లేకుండా కస్టడీలోనే ఉంచనున్నట్లు అటార్నీ కార్యాలయం పేర్కొంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. (చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో మానవ పుర్రెల కలకలం.. షాక్‌లో అధికారులు) -
రోడ్డుపై చెత్తేసినందుకు... చెంప ఛెళ్లుమనే గుణపాఠం!
తినగానే, అవసరం తీరగానే మిగిలిన చెత్తను తీసి రోడ్డు మీద విసిరెయ్యడం మామూలైపోయింది. స్వచ్ఛ భారత్ మొర్రో అంటూ మొత్తుకున్నా పట్టించుకోని ‘స్వేచ్ఛ’ జీవులం కదా?! సిగ్నల్ వద్ద ఆగిన కారులోంచి ఎవరో చెత్త రోడ్డుపై విసిరిస్తే సాటి పౌరునిగా మనమేం చేస్తాం?.. మనకెందులే అని గమ్మునుంటాం. వీళ్లు మారరని లోలోపలే కుమిలిపోతాం. లేదంటే చెత్తేసిన వాడికి వినపడకుండా తిడతాం. నలుగురం నాలుగు విధాలా గొనుగుతామంతే! వాడికి కళ్లు తెరిపించే సాహసం చేయగలమా? అయితే చెత్తేసినందుకు... చెంప ఛెళ్లుమనే గుణపాఠం చెప్పిందో యువతి! మొన్న సెప్టెంబర్ 17న చైనా రాజధాని బీజింగ్‌లో ఓ సిగ్నల్ వద్ద ఓ కారు ఆగింది. ఆ కారులోంచి ఓ ఆకతాయి మహిళ చెత్త బయటకు విసిరింది. పక్కనే బైక్ మీద ఉన్న ఓ యువతి ఆ చెత్తను తీసి మళ్లీ ఆ కారులోనే వేసింది. ఈ హఠాత్పరిణా మానికి షాకయిన ఆ మహిళ కోపంతో కారు దిగింది. ఇంతలోనే ఆ బైక్ నడుపుతున్న యువతి వేగంగా కంటికి ఆననంత దూరం వెళ్లిపోయింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. స్వచ్ఛత పట్ల ప్రజలకు అవగాహన కలిగించడానికి ఇదో చురుకైన గుణపాఠం అంటూ నెటిజన్లు ఆ యువతిని అభినందనలతో ముంచెత్తుతున్నారు. -
తాగిన మత్తులో మహిళ చిందులు!
-
తాగిన మత్తులో మహిళ చిందులు!
ఓ మహిళ మద్యం మత్తులో విచక్షణ కోల్పోయింది. తనకు మరింతగా మద్యం ఇవ్వలేదన్న కోపంతో దుకాణంలో వీరంగం వేసింది. దుకాణం సిబ్బందిని నోటికోచ్చినట్టు తిట్టింది. వారిపై జాతివివక్షాపూరితమైన వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటన తూర్పు లండన్‌లో జరిగింది. తూర్పు లండన్ బెథ్నాల్ గ్రీన్‌లోని "ఫ్రెష్గో' షాపులో ఓ నల్లజాతి యువతి ఇలా చిందులు తొక్కింది. ఆ షాపులోని వస్తువులను చిందరవందరగా పారేసింది. ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆ షాపులోని ఆసియా సంతతి వ్యక్తులపై జాత్యాంహకారపూరితమైన వ్యాఖ్యలు చేసింది. వారిని నానా దుర్భాషలాడింది. తనకు మరింత మద్యం ఇచ్చేవరకు షాపులోపలికి ఎవరినీ రానీయనంటూ తలుపులు మూసేసి నానా బీభత్సం సృష్టించింది. దీంతో షాపు యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితురాలిని గురించి పోలీసులు గాలిస్తున్నారు. నిందితురాలు 20 ఏళ్లకుపైగా వయస్సున్న నల్లజాతి యువతి అని, 5.5 అడుగుల ఎత్తు ఉండి దృఢంగా ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆమె వీరంగం సృష్టించిన సీసీటీవీ వీడియో దృశ్యాలను విడుదల చేశారు.