ఓ మహిళ మద్యం మత్తులో విచక్షణ కోల్పోయింది. తనకు మరింతగా మద్యం ఇవ్వలేదన్న కోపంతో దుకాణంలో వీరంగం వేసింది. దుకాణం సిబ్బందిని నోటికోచ్చినట్టు తిట్టింది. వారిపై జాతివివక్షాపూరితమైన వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటన తూర్పు లండన్‌లో జరిగింది. తూర్పు లండన్ బెథ్నాల్ గ్రీన్‌లోని "ఫ్రెష్‌గో' షాపులో ఓ నల్లజాతి యువతి ఇలా చిందులు తొక్కింది. ఆ షాపులోని వస్తువులను చిందరవందరగా పారేసింది. ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆ షాపులోని ఆసియా సంతతి వ్యక్తులపై జాత్యాంహకారపూరితమైన వ్యాఖ్యలు చేసింది. వారిని నానా దుర్భాషలాడింది.
Published Mon, Aug 1 2016 8:38 PM | Last Updated on Thu, Mar 21 2024 5:24 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement