Watch: Woman In US Pushing 3 Year Old Girl Onto Train Tracks, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Viral Video: మూడేళ్ల చిన్నారిని కర్కశంగా.. రైలు పట్టాలపైకి తోసేసి..

Published Mon, Jan 2 2023 3:39 PM | Last Updated on Mon, Jan 2 2023 4:54 PM

Viral Video: Woman In US Pushing 3 Year Old Girl Onto Train Tracks - Sakshi

మూడేళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా రైలు పట్టాలపైకి తోసేసింది ఓ మహిళ. దీంతో సదరు బాలిక తీవ్ర గాయాలపాలైంది. ఈ ఘటన అమెరికాలో ఒరెగాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..  ర్వైలే స్టేషన్‌లో ఫ్లాట్‌ఫాంపై తన తల్లితో ఉన్న మూడేళ్ల చిన్నారిని గుర్తు తెలియని మహిళ రైలు పట్టాలపైకి తోసేసింది. ఈ మేరకు ముల్ట్‌నోమా కౌంటీ డిస్ట్రిక్ట్‌ అటార్నీ కార్యాలయం తన వెబ్‌సైట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది.

దీని ప్రకారం...మూడేళ్ల బాలికను 32 ఏళ్ల బ్రియానా లేస్‌ వర్క్‌మెన్‌ అనే మహిళ తోసేసినట్లు పేర్కొంది. దీంతో బాలిక తలకు తీవ్ర గాయమై విలవిల్లాడిందని తెలిపారు. ఈ ఘటనతో అక్కడే ఫ్లాట్‌ ఫాంపై ఉన్న మిగత వ్యక్తులు వెంటనే స్పందించి...సదరు చిన్నారిని రక్షించారు. ఆ చిన్నారి పోర్ట్‌ల్యాండ్‌లో నివసిస్తున్నట్లు పేర్కొంది.

ఈ షాకింగ్‌ ఘటనతో సదరు ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇలాంటి దారుణాలకు ఎందుకు ఒడిగడుతుంటారో అర్థం కాదంటూ.. ప్రయాణికులలో ఒకరు ఆవేదనగా అన్నారు. ఈ మేరకు ఈ దారుణానికి పాల్పడిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడమే గాక బెయిల్‌ లేకుండా కస్టడీలోనే ఉంచనున్నట్లు అటార్నీ కార్యాలయం పేర్కొంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

(చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో మానవ పుర్రెల కలకలం.. షాక్‌లో అధికారులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement