ప్రతీకాత్మక చిత్రం
తినగానే, అవసరం తీరగానే మిగిలిన చెత్తను తీసి రోడ్డు మీద విసిరెయ్యడం మామూలైపోయింది. స్వచ్ఛ భారత్ మొర్రో అంటూ మొత్తుకున్నా పట్టించుకోని ‘స్వేచ్ఛ’ జీవులం కదా?! సిగ్నల్ వద్ద ఆగిన కారులోంచి ఎవరో చెత్త రోడ్డుపై విసిరిస్తే సాటి పౌరునిగా మనమేం చేస్తాం?.. మనకెందులే అని గమ్మునుంటాం. వీళ్లు మారరని లోలోపలే కుమిలిపోతాం. లేదంటే చెత్తేసిన వాడికి వినపడకుండా తిడతాం. నలుగురం నాలుగు విధాలా గొనుగుతామంతే! వాడికి కళ్లు తెరిపించే సాహసం చేయగలమా? అయితే చెత్తేసినందుకు... చెంప ఛెళ్లుమనే గుణపాఠం చెప్పిందో యువతి! మొన్న సెప్టెంబర్ 17న చైనా రాజధాని బీజింగ్‌లో ఓ సిగ్నల్ వద్ద ఓ కారు ఆగింది. ఆ కారులోంచి ఓ ఆకతాయి మహిళ చెత్త బయటకు విసిరింది. పక్కనే బైక్ మీద ఉన్న ఓ యువతి ఆ చెత్తను తీసి మళ్లీ ఆ కారులోనే వేసింది. ఈ హఠాత్పరిణా మానికి షాకయిన ఆ మహిళ కోపంతో కారు దిగింది. ఇంతలోనే ఆ బైక్ నడుపుతున్న యువతి వేగంగా కంటికి ఆననంత దూరం వెళ్లిపోయింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. స్వచ్ఛత పట్ల ప్రజలకు అవగాహన కలిగించడానికి ఇదో చురుకైన గుణపాఠం అంటూ నెటిజన్లు ఆ యువతిని అభినందనలతో ముంచెత్తుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment