shops allocation
-
మద్యం షాపులన్నీ మావే: ‘జేసీ’ బెదిరింపులు
సాక్షి,అనంతపురం:తాడిపత్రిలో టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మద్యం మాఫియా గుట్టు బయటపడింది.మద్యం షాపులన్నీ మాకే కావాలని జేసీ వర్గీయులు అంటున్నారు. ఎవరైనా టెండర్లు వేస్తే అంతు చూస్తామని బెదిరిస్తున్నారు.తమ అనుమతి లేనిదే తాడిపత్రిలో ఎవరికీ రూములు అద్దెకు ఇవ్వొద్దని హెటల్ యజమానులకు టీడీపీ నేతలు అల్టిమేటం జారీ చేశారు.ఇంత జరుగుతున్నా తాడిపత్రిలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తుండటం గమనార్హం. మరోవైపు మద్యం షాపులకు దరఖాస్తుల గడువును టీడీపీ నేతల కోసమే పెంచినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నెల్లూరులో మద్యంషాపులన్నీ తమ సిండికేట్‌కే దక్కాలని మంత్రి నారాయణ మాట్లాడిన ఫోన్ సంభాషణ బయటపడిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: ఏపీలో మద్యం షాపులకు దరఖాస్తు గడువు పెంపు -
ఇకపై 83 షాపులు 24 గంటలు ఓపెన్!
దిల్లీ ప్రభుత్వం ఆర్థికంగా బలంగా మారడానికి చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా దుకాణాలను 24 గంటలు తెరిచి ఉంచడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు కొంత సొమ్ము జమవుతుందని భావిస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నగరంలో 83 దుకాణాలు, వాణిజ్య సంస్థలకు 24 గంటలు పనిచేయడానికి అనుమతి ఇచ్చారు. దీంతో దిల్లీలో 24 గంటలపాటు తెరిచి ఉంచే దుకాణాల సంఖ్య 635కు చేరింది. ఈ మేరకు దిల్లీ ప్రభుత్వ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కమిటీ (ఎస్ఈసీ) నిర్ణయం తీసుకుంది. కమిటీకి మొత్తం 122 దరఖాస్తు వచ్చాయి. కానీ సరైన వివరాలు వెల్లడించని కారణంగా 29 దరఖాస్తులను తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. నిర్దిష్ట ప్రదేశాల్లోని దుకాణాలను ఎంపిక చేసి అనుమతించినట్లు చెప్పారు. చట్టంలోని నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించారు. దుకాణాలు, వాణిజ్య సంస్థలు 24 గంటలు పనిచేయడంతో నగర ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. దాంతోపాటు మరింత మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేలా ఈ నిర్ణయం సహకరిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
Srisailam temple: దుకాణాల వేలంలో అందరూ పాల్గొనవచ్చు: సుప్రీం కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీశైలంలోగల భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయ దుకాణాలు, దుకాణ సముదాయాల వేలంలో హిందుయేతరులూ పాల్గొనవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వేలంలో హిందూయేతరులు పాల్గొనరాదంటూ 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం జీవో జారీచేసింది. ఈ జీవోను పలువురు హైకోర్టులో సవాల్ చేశారు. ఆ జీవోను సమర్థిస్తూ 2019లో ఏపీ హైకోర్టు తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పుపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు గతేడాది జనవరిలో స్టే ఇచ్చింది. సుప్రీం ఆదేశాలు అమలు చేయలేదంటూ జానీబాషా, టీఎం రబ్బానీ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ డీవై చంద్రచూడ్ , జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. చదవండి: 2018 డీఎస్సీలో భర్తీ కాని ఖాళీల నియామకాలకు షెడ్యూల్ మతం, విశ్వాసం ప్రాతిపదికన ఆలయ దుకాణాల వేలంలో హిందూయేతరులు పాల్గొనడాన్ని నిరాకరించడం సబబుకాదని పేర్కొంది. ఆలయ ప్రాంగణాల్లో మత విశ్వాసాలకు విఘాతం కలిగించే మద్యం, గ్యాంబ్లింగ్ వంటివి అనుమతించరాదుగానీ పూలు, పళ్లు, చిన్నపిల్లల ఆటబొమ్మలకు సంబంధించిన దుకాణాల వేలంలో హిందూయేతరులను అనుమతించకపోవడం సరికాదని జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. శ్రీశైలం భ్రమరాంబ మలికార్జునస్వామి ఆలయ దుకాణాలు, దుకాణ సముదాయాల వేలంలో హిందుయేతరులనూ అనుమతించాలని స్పష్టం చేస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. -
‘ఎక్సైజ్’కు కాసుల పంట
- లెసైన్స్‌ల ద్వారా ఏడాదికి రూ.52.75 కోట్లు - దరఖాస్తుల అమ్మకాలపై రూ.9.52 కోట్లు - మద్యం విక్రయాలపై వెయ్యికోట్లకు పైగానే... ఖమ్మంక్రైం: ఎక్సైజ్ శాఖకు కాసుల పంట పండింది. జిల్లాలోని వైన్ షాపులను సోమవారం లాటరీ పద్ధతి ద్వారా కేటాయించారు. అటు దరఖాస్తుల అమ్మకం, ఇటు షాపుల కేటాయింపు ద్వారా ఎక్సైజ్ శాఖ భారీస్థాయిలో ఆర్జించింది. ఈనెల 15 నుంచి 21 వరకు జిల్లాలోని మద్యం షాపులకు దరఖాస్తులను స్వీకరించారు. జిల్లాలో మొత్తం 147 షాపులు ఉండగా వీఎం బంజరలో రెండు, గుండాలలో ఒకటి, పెనగడపలో రెండు దుకాణాలకు మినహా 142 షాపులకు3,837 దరఖాస్తులు వచ్చాయి. వీటి చలానాల ద్వారా రూ.9,59,25 వేల ఆదాయం లభించింది. ఖమ్మంలోని న్యూబగ్గా వైన్‌షాపునకు, ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి వద్ద గల పల్లెగూడెం షాపునకు అత్యధికంగా 111 దరఖాస్తులు వచ్చాయి. కేవలం ఈ రెండు షాపుల దరఖాస్తుల అమ్మకం ద్వారానే రూ.55.50 లక్షల ఆదాయం సమకూరింది. ఖమ్మం నగరంలోని షాపులకు వ్యాపారులు ఎక్కువగా పోటీపడ్డారు. ఏజన్సీ ప్రాంతంలోని షాపులకంటే కూడా పట్టణ ప్రాంతాల్లో ఉన్న షాపులపైనే వ్యాపారులు దృష్టి కేంద్రీకరించారు. తొలివిడతలో 17 కోట్లు.. డ్రాలో గెలుపొందిన వ్యాపారి మొదటిసారిగా 33.33 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా తొలి విడతగా 142 మంది వ్యాపారులు చెల్లించిన మొత్తం రూ.17.03 కోట్లకు చేరింది. ఖమ్మం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోని 50 వేల నుంచి 3 లక్షల జనాభా ఉన్న 18 షాపులకు రూ.42 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 10వేల నుంచి 50వేల వరకు జనాభా ఉన్న 32 షాపులకు రూ.34 లక్షలు, 10వేల లోపు జనాభా ఉన్న 24 షాపులకు రూ.32.50 లక్షలు, కొత్తగూడెం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోని 50 వేల నుంచి 3 లక్షల వరకు జనాభా ఉన్న 26 షాపులు రూ.42 లక్షలు, 10వేల నుంచి 50 వేల వరకు జనాభా ఉన్న 19 షాపులు రూ.34లక్షలు, 10వేల లోపు జనాభా ఉన్న 23 షాపులు రూ.32.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఖమ్మం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోని మూడు షాపులకు, కొత్తగూడెం సూపరింటెండెంట్ పరిధిలోని రెండు షాపులకు దరఖాస్తులు రాలేదు. మిగితా దరఖాస్తుల చలానాల ద్వారా రూ.9,59,25 వేలు, లెసైన్స్ ఫీజుల ద్వారా రూ.17.03 కోట్లు.. మొత్తం రూ.26,63,25 వేల ఆదాయం ఆబ్కారీ శాఖకు లభించింది. 147 షాపులకు రూ.52.75 కోట్ల ఆదాయం... ప్రతి నాలుగు నెలలకు ఒకసారి షాపులో 1/3 వంతు లెసైన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వీటి ద్వారా సంవత్సరం మొత్తంలో 147 షాపుల ద్వారా రూ.52.75 కోట్ల ఆదాయం ఆబ్కారీ శాఖకు లభించనుంది. ఇప్పటికే మొదటి విడత ఆదాయం రూ.17.03 కోట్లు వచ్చింది. మరో రూ.35.72 కోట్ల ఆదాయం రావాల్సి ఉంది. కాగా, పోలవరం ముంపునకు గురవుతున్న ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించడంతో ఆ మండలాల్లో ఉన్న తొమ్మిది షాపులు ఆ రాష్ట్రానికి వెళ్లిపోయాయి. వీటి స్థానంలో జిల్లాలో మరో తొమ్మిది కొత్త షాపులు ఏర్పాటు చేయనున్నారు. దీంతో మొత్తం షాపుల సంఖ్య 156కు చేరుతుంది. ఈ అన్ని షాపులలో మద్యం విక్రయాల ద్వారా జిల్లా ఎక్సైజ్ శాఖకు ఏడాదికి సుమారు వెయ్యికోట్లకు పైగానే ఆదాయం లభించే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. -
సిండి‘కేట్లు’
సాక్షి, ఖమ్మం: ముందస్తు సిండి‘కేట్లు’.. మద్యం మాఫియాకు కలిసివచ్చింది. గుట్టుచప్పుడు కాకుండా చక్రం తప్పి మళ్లీ తాము అనుకున్నట్లుగానే మద్యం దుకాణాలను చేజిక్కించుకున్నారు మద్యం డాన్లు. దుకాణాల వారీగా మద్యం మాఫియా లీడర్లు సిండికేట్ చేయడంతో ఎక్కడా అనుమానం రాకుండా డ్రాలో దుకాణాల కేటాయింపు జరిగిపోయింది. ప్రధానంగా ఖమ్మం డివిజన్ పరిధిలో చాలా దుకాణాలు వీరికే దక్కాయి. జిల్లాలో మొత్తం 147 దుకాణాలకుగాను వీఎంబంజరలో రెండు, గుండాలలో ఒకటి, రుద్రంపూర్‌లో రెండు దుకాణాలు మినహా 142 దుకాణాలకు జిల్లా వ్యాప్తంగా 3,837 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో చాలా వరకు సండికేట్తో వచ్చినవే. లాటరీ ద్వారా దుకాణాలు కేటాయింపు పారదర్శకంగా జరుగుతుందని ఎక్త్సెజ్ శాఖ ప్రకటించినా సిండికేట్ దారులు అందివచ్చిన అడ్డదారులను అవకాశంగా మలుచుకొని మళ్లీ మద్యం వ్యాపారంలో పాగా వేశారు. గతంలో దుకాణాలు దక్కించుకున్న వారంతా ముందస్తుగా సిండికేట్‌గా ఏర్పడి దుకాణాల వారీగా టెండర్లు దాఖలు చేశారు. ఇదంతా మద్యం మాఫియా లీడర్ల కనుసన్నల్లోనే జరగడంతో టెండర్ల సమయంలో ఎలాంటి గడబిడా లేకుండా ఈ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం, కొత్తగూడెం యూనిట్ల పరిధిలో గతంలో ఈ వ్యాపారంలో అనుభవం ఉన్నవారు దుకాణాల వారీగా వారి ఆడ్రస్‌లు సేకరించినట్లు సమాచారం. వీరందరితో డ్రాకు మూడు రోజుల ముందుగానే మద్యం డాన్లు చర్చలు జరిపి సిండికేట్ చేసినట్లు తెలిసింది. సిండికేట్‌లో లేకుండా టెండర్ వేసి దుకాణం దక్కించుకున్న వారు వ్యాపారం చేయడం ఇష్టం లేకపోతే వారితో ‘గుడ్ విల్’ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక తమ బినామీలు, ఇతర వ్యక్తుల్లో ఎవరికి దక్కినా అంతా సిండికేటేనని రెండు ప్రాంతాలకు చెందిన పాత వ్యాపారులతో జరిపిన చర్చలు సఫలం కావడంతో డ్రాలో అనుకున్నట్లుగానే వారికే దుకాణాలు దక్కాయి. ప్రధానంగా ఖమ్మం నగరం, చుట్టు పక్కల మండలాల్లో ఎక్కువగా ఈ దుకాణాలు మద్యం మాఫియా లీడర్లు చక్రం తిప్పినట్లుగానే ఈ తతంగం సాఫీగా ముగిసింది. ఒక్కొక్కరి చేతిలోనే గుర్తింపు పత్రాలు.. టెండర్ దాఖలు సమయంలో ప్రతి దారఖాస్తుదారుడికి వారి ఫొటోతో ఉన్న గుర్తింపు పత్రం (హాల్ టికెట్) ఇస్తారు. దీన్ని చూపిస్తేనే వారిని డ్రా కేంద్రంలోకి అనుమతిస్తారు. అయితే ఎవరు టెండర్ దాఖలు చేసినా వారి దగ్గరే ఇవి ఉండాలి. కానీ డ్రా కేంద్రమైన సీక్వెల్ రిసార్ట్స్ సమీపంలో ఇవి ఒక్కొక్కరి దగ్గర ఐదు నుంచి పదివరకు ఉన్నాయి. దుకాణాల వారీగా మద్యం మాఫియా లీడర్ల అనుచరులు ఇవి తమవద్దే పెట్టుకొని డ్రా సమయంలో దరఖాస్తుదారులకు ఇచ్చి పంపారు. ముందస్తుగానే మద్యం డాన్లు సిండికేట్ చేయడంతో ఇలా దరాఖాస్తుదారుల హాల్‌టికెట్లు అన్నీ వారి అనుచరులు తమ వద్దే పెట్టుకున్నారు. డ్రా ముగియగానే దుకాణం దక్కించుకున్న వారు మళ్లీ అనుచరుల వద్దకే వచ్చి చెప్పగా, ఇది వెంటనే తమ నేతలకు సమాచారం చేరవేశారు. మద్యం సిండికేట్‌లో భాగంగా గతంలో దుకాణాలు దక్కించుకున్న వారి బంధువులు, ఆ షాపుల్లో పనిచేసిన వారితో ఎక్కువగా టెండర్లు వేయించారు. అంతేకాకుండా సీక్వెల్ రిసార్ట్స్ సమీపంలో ఓ అపార్ట్మెంట్లో మద్యం డాన్లు మకాం వేసి డ్రా తీస్తున్న తీరు, ఏ దుకాణం ఎవరికి దక్కింది అనే విషయాలను తమ అనుచరుల ద్వారా ఆరా తీసినట్లు సమాచారం. టెండర్లు దాఖలు చేసిన వారిలో కూడా మద్యం మాఫియా లీడర్ల అనుచరులు ఉండడంతో ఏ దుకాణం ఎవరికి దక్కిందో క్షణాల్లో సమాచారం వారికి చేరింది. గుడ్‌విల్‌గా రూ.లక్షలు.. కొన్ని దుకాణాలు తమ సిండికేట్ పరిధిలో లేనివారికి దక్కడంతో గుడ్‌విల్‌గా రూ.లక్షలు ముట్టజెప్పేందుకు డ్రా ముగిసిన వెంటనే మద్యం డాన్లు బేరాసారాలు చేశారు. నయానోభయానో నచ్చజెప్పి వెంటనే ఆయా దుకాణాల్లో చాలా వరకు తమకు దక్కేలా పావులు కదిపారు. మాట వినకుంటే డ్రాలో వచ్చిన వారు ఎవరికిదగ్గరో వారితో నచ్చజెప్పించి వాటిని కూడా తమ వశం చేసుకున్నట్లు తెలిసింది. సిండికేట్‌గా ఏర్పడితే ఒక్కో దుకాణం నుంచి రూ.లక్షల్లో ఆదాయం వస్తుండడంతో గుడ్‌విల్ ఎంత ఇచ్చేందుకైనా మద్యం డాన్లు వెనకాడలేదని తెలిసింది. ఒక్కో దుకాణానికి డ్రా ముగియగానే తమ సిండకేట్కే వచ్చిందా..? లేదా..? సిండికేట్ లేకపోతే ఎవరికి వచ్చింది.. అంటూ తమ అనుచరుల ద్వారా ఆరా తీస్తూ.. వెంటనే వారిని ఫోన్ల మీదనే తమలైన్కి తీసుకొని గుడ్‌విల్ చర్చలు జరపడంలో మద్యం డాన్ చాకచక్యంగా వ్యవహరించారు. అంతేకాకుండా దరఖాస్తు ఫీజు, లెసైన్స్ ఫీజులో 10 శాతం వారే చెల్లించి తమ బినామీలతో టెండర్లు దాఖలు చేయించారు. డ్రా దక్కని వారి డీడీ డబ్బులను వెంటనే తీసుకొని అక్కడే దుకాణాలు దక్కించుకున్న వారికి గుడ్‌విల్ కింద కొంతమందికి ముట్టజెప్పినట్లు సమాచారం. ఇలా మద్యం డాన్లు తమ కనుసన్నల్లోనే గుట్టుచప్పుడు కాకుండా మళ్లీ మద్యం దుకాణాలు దక్కించుకోవడంతో ఎక్త్సెజ్ శాఖ పారదర్శకత గాలికి పోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.