shortest couple
-
ప్రపంచంలోనే అత్యంత పొట్టి జంట.. ఇంట్రెస్టింగ్ ఫోటోలు!
-
ప్రపంచంలోనే అత్యంత పొట్టి జంటగా రికార్డు!
పెళ్లి అంటే ఈడు జోడు ఉండాలి, ఇరు సంప్రదాయాలు అన్ని కలవాలి అని చెబుతుంటారు పెద్దలు. ఇప్పుడూ ఈ రోజుల్లో అదంతా కష్టంగా మారింది.కెరీర్ అంటూ.. ముప్పై, నలభైల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్థిక స్థితికే ప్రాధాన్యత, మిగతా అంతా ఎలా ఉన్న పర్లేదు అన్నట్లుగా ఉంది వ్యవహారం. అలాంటి పరిస్థితుల్లో శారీరకపరంగా పొట్టిగా ఉన్న ఓ జంట మాత్రం తమలాంటి ఆహార్యం ఉన్న వ్యక్తులు దొరికే వరకు నిరీక్షించి మరీ పెళ్లి చేసుకున్నారు. పైగా అదే వారిని విలక్షణమైన జంటగా రికార్డులకెక్కేలా చేసింది. వివరాల్లోకెళ్తే..బ్రెజిలియన్కి చెందిన పాలో గాబ్రియేల్ డా సిల్వా బారోస్, కటియుసియా లీ ఇద్దరూ ఆహార్యం పరంగా అత్యంత పొట్టి వ్యక్తులు. సమాజం నంచి ఎదురైనా అవహేళనలు, ఒత్తిళ్లకు తగ్గకుండా..తమలాంటి వ్యక్తులు కోసం అన్వేషించారు. వారి భౌతిక లక్షణాలను అంగీకరించి మరీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. వారి అన్వేషణ ఎట్టకేలకు ఫలించి 2006లో ఇరువురు కలుసుకోవడం జరిగింది. దాదాపు 15 ఏళ్లుగా ఒకరి అభిప్రాయాలను ఒకరు షేర్ చేసుకుంటూ..వారి మధ్య బలమైన సంబంధాన్ని పెంపొందించుకున్నారు.ఆ తర్వాత ఇరువురు వివాహ బంధంతో ఒక్కటి అవ్వాలని భావించి పెళ్లి చేసుకున్నారు. దీంతో ప్రపంచంలోని అత్యంత పొట్టి వివాహిత జంటగా గిన్నిస్ రికార్డులకెక్కారు. జీవతంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగాం. తామిరువురం ఎదురపడతామనే ఊహించలేదు. అలాగే మా బంధాన్ని కొనసాగించగలమా? లేదా ఎలాంటి సవాళ్లనైనా తట్టుకుని ఇరువరి నిలబడగలుగుతామా అని నిర్ణయించుకుని, ఒకరిపై ఒకరికి అవగాహన ఏర్పడ్డాక తాము వివాహ బంధంలోకి అగుడుపెట్టాం అని చెబుతోంది ఆ జంట. అంతేగాదు తాము చూసేందుకు చిన్నగా ఉన్నా తమ ఇద్ది\రి మనసులు చాలా విశాలమని, జీవితం విసిరే ప్రతి సవాలుని ఎదుర్కొని సంతోషంగా జీవించగలమని నమ్మకంగా చెబుతున్నారు. కాగా, గిన్నిస్ వరల్డ్ రికార్డ్సు ప్రకారం..ఈ జంట ఉమ్మడి ఎత్తు 181.41 సెం.మీ (71.42 అంగుళాలు). పాలో ఎత్తు 90.28 cm (35.54 in) అయితే కటియుసియా ఎత్తు 91.13 సెం.మీ(35.88 అంగుళాలు). ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామం వేదికగా వెల్లడించింది గిన్నిస్ వరల్డ్ రికార్డ్సు. అంతేగాదు నెజన్టు కూడా ది బెస్ట్ కపుల్, ఈ జంట సూపర్ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) (చదవండి: పెద్ద వయసులో.. పెద్ద గుర్తింపు) -
ప్రేమకు ఎత్తుతో పనేంటి?
వాళ్లిద్దరి ఎత్తు కూడా మూడు అడుగుల కంటే తక్కువే. కానీ.. ఇద్దరూ ఘాటుగా ప్రేమలో మునిగిపోయారు. అవును.. వాళ్లిద్దరూ ప్రపంచంలోనే అత్యంత పొట్టి ప్రేమజంటగా పేరొందారు. బ్రెజిల్‌కు చెందిన పౌలో గాబ్రియెల్ డా సిల్వా బారోస్ ఎత్తు 34.8 అంగుళాలు కాగా, అతడి ప్రియురాలు కట్యూషియా హొషినో ఎత్తు 35.2 అంగుళాలు. వీళ్లిద్దరూ పదేళ్ల క్రితం ఎంఎస్ఎన్ మెసెంజర్ చాటింగ్‌లో కలిశారు. తాను ఆమెతో తొలిచూపులోనే ప్రేమలో పడ్డానని పౌలో చెబుతున్నాడు. తాను చూసినప్పుడు ఆమె చాలా అందంగా కనిపించిదన్నాడు. కానీ మొదట్లో ఆమె మాత్రం అంతగా స్పందించలేదు. పైగా, సోషల్ మీడియాలో అతడిని బ్లాక్ చేసింది కూడా. మొదట్లో అతడంటే విసుగుపుట్టేదని ఆమె చెప్పింది. ఎట్టకేలకు ఏడాదిన్నర తర్వాత ఆమె అతడిని మళ్లీ అన్‌బ్లాక్ చేసింది. అనుకోకుండా తాను కూడా అతడిని ఆరాధించడం మొదలుపెట్టానని ప్రస్తుతం బ్యూటీ సెలూన్ నడుపుతున్న కట్యూషియా సిగ్గుపడుతూ చెప్పింది. ఆమె అన్‌బ్లాక్ చేయగానే, ఒక్క నిమిషంలోనే అతడు హలో చెప్పాడు. రెండు నెలలు అలా మాట్లాడుకున్నాక పౌలో 186 మైళ్లు ప్రయాణించి కట్యూషియా ఇంటికి వెళ్లి ఆమెను కలిశాడు. ఆమె అందం చూసి పడిపోయానని, కానీ ఆమె మాత్రం తన డ్రస్ సెన్స్ బాగోలేదని చెప్పిందని అన్నాడు. అతడు ఆరంజ్ షర్టు, జీన్సు ధరించి సన్‌గ్లాసెస్ పెట్టుకుని వచ్చాడని, అప్పటి నుంచి ఇప్పటికి ఎలాగో కష్టపడి బాగుపడ్డాడని ఆమె చెప్పింది. గత నాలుగేళ్లుగా వీళ్లిద్దరూ కలిసి ఉంటున్నారు. పౌలో తన మొట్టమొదటి బోయ్‌ఫ్రెండు అని, అతడే తన సర్వస్వమని కట్యూషియా చెబుతోంది. తాము కూడా అందరు జంటల్లాగే ఉంటామని, తమ కోసం ప్రత్యేకంగా ఒక కారు డిజైన్ చేయించుకున్నామని తెలిపింది. ఇక ఆమె నడిపే బ్యూటీ సెలూన్లో కూడా కుర్చీలతో సహా అన్నీ ఆమె ఎత్తుకు తగినట్లుగానే ఉంటాయి. తన సొంత ఊరైన ఇటాపెవాకు మేయర్ పదవికి పోటీ చేయాలని పౌలో భావిస్తున్నాడు. అందరు భార్యాభర్తల్లాగే తమ మధ్య కూడా గొడవలు జరుగుతాయని, అసలు కొట్టుకోనివాళ్లు సాధారణ జంట కానే కాదని కట్యూషియా చెప్పింది.