మన్యంకొండలో శ్రావణ ఉత్సవాలు ప్రారంభం
మన్యంకొండలో శ్రావణ ఉత్సవాలు ప్రారంభం
మన్యంకొండ (దేవరకద్ర రూరల్): మన్యంకొండ శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో బుధవారం శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం దేవస్థానంలో శ్రావణమాసంలో 45 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే స్వామివారి సన్నిధిలో ప్రత్యేక హోమం, అఖండ భజన తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ వెంకటాచారి, ఛైర్మన్ ఆళహరి నారాయణస్వామి, మధుసూదన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.