Sicily
-
ఆ ఊళ్లో.. ఇళ్లు, కారు చౌక! ధర ఎంతంటే? కేవలం...
ఆ ఊళ్లో ఇళ్లు కారుచౌకగా దొరుకుతాయి. అక్కడి ఇళ్ల ధరలు తెలుసుకుంటే, ఇక్కడి జనాలు ఏమాత్రం నమ్మలేరు. ఆ ఊరు ఇటలీలో ఉంది. సిసిలీ స్వయంప్రతిపత్తి ప్రాంతంలోని సంబూకా అనే పట్టణంలో ఒక్కో ఇల్లు ఒక యూరో నుంచి మూడు యూరోల (దాదాపు రూ. 90 నుంచి రూ. 270) ధరకే దొరుకుతాయి.సరిగా చెప్పాలంటే, ఈ ఇళ్లు మామూలు పిజ్జా ధర కంటే తక్కువే! ఇటలీలో పిజ్జా ధర దాదాపు 5 యూరోల (రూ.446) వరకు ఉంటుంది. ఈ పట్టణంలో ఇప్పటికే రెండుసార్లు– 2019లో ఒకసారి, 2021లో ఒకసారి ఇళ్ల వేలం నిర్వహించారు. ఆ వేలం పాటల్లో ఇళ్ల ధరలు ఒక యూరో నుంచి మూడు యూరోల వరకు పలికాయి.త్వరలోనే మరోసారి ఈ ఊళ్లో ఇళ్ల వేలం నిర్వహించనున్నారు. ఈసారి కూడా వేలంలో ఇళ్ల ధరలు పెద్దగా పెరిగే అవకాశం లేదని, ఇళ్ల ప్రారంభ ధరలు 3 యూరోల (సుమారు రూ.270) నుంచి మొదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. చాలాకాలంగా ఖాళీగా మిగిలిపోయి, పాడుబడిన ఇళ్లను ఈ పట్టణ సంస్థ ఇలా వేలంలో విక్రయిస్తోంది. వీటిని కొనుగోలు చేసేందుకు ఇటాలియన్లతో పాటు ఇటలీకి వచ్చే విదేశీ పర్యాటకులు కూడా ఆసక్తి చూపుతున్నారు.పురాతనమైన పాడుబడిన ఇళ్లకు పన్నులు కట్టలేక కొందరు యజమానులు వాటిని ఎలాగైనా వదిలించుకోవాలనుకుంటున్నారని, అందుకే ఇక్కడ ఇళ్లు ఇంత చౌకగా దొరుకుతున్నాయని రియల్ ఎస్టేట్ ఏజెంట్ మారిజియో బెర్తీ చెబుతున్నారు. ఇక్కడ చౌకగా దొరికే ఇళ్లలో ఎక్కువగా శతాబ్దాల కిందట నిర్మించినవి. ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే, మసూద్ అహ్మది అనే వ్యక్తి, ఆయన భార్య షెల్లీ ఇక్కడ మూడు యూరోలకు 2019లో పద్దెనిమిదో శతాబ్ది నాటి ఇల్లు కొన్నారు.దానిని 8400 యూరోల (సుమారు రూ.7.50 లక్షలు) ఖర్చుతో బాగు చేయించుకున్నారు. ఇక్కడ ఇళ్ల ధరల కంటే, వాటి మరమ్మతుల ఖర్చే ఎక్కువగా ఉంటుంది. మరమ్మతు ఖర్చులు కలుపుకున్నా, ఇక్కడి ఇళ్ల ధరలు కారుచౌక అనే చెప్పాలి. -
పాతాళవనం కాదు! అదొక 'నేలమాళిగలో ఉద్యానవనం..!'
'మన జీవితంలో మనం ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు చూసుంటాం. ఎన్నో అద్భుతాలను చూసుంటాం. అవి మనకు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చి ఉంటాయి. కానీ ఇలాంటి పాతాళవనాన్ని కాదు కాదు, ఉద్యానవనాన్ని మీరెప్పుడైనా చూశారా! చూడాలంటే.. పాతాళంలోకి దిగాల్సిందే.., దిగాలంటే.. అమెరికాకు వెళ్లాల్సిందే..! ఆశ్చర్యం, అద్భుతం రెండూ కలిస్తేనే ఈ వనం. మరి అదేంటో కాస్త ముందే తెలుసుకుందామా..!' ఈ పాతాళవనం అమెరికాలో ఉంది. కాలిఫోర్నియాలోని ఫ్రెస్నోలో ఉన్న ఈ ఉద్యానవనం వెనుక కొంత చరిత్ర ఉంది. ఇటలీలోని సిసిలీ నుంచి అమెరికాకు వలస వచ్చిన బాల్డసరె ఫారెస్టీరె ఫ్రెస్నోలో 1904లో పది ఎకరాల భూమి కొన్నాడు. ఇక్కడి మట్టి నిమ్మ, నారింజ వంటి పండ్లతోటల పెంపకానికి అనుకూలంగా లేకపోవడమే కాదు, ఇక్కడి వాతావరణం కూడా వేసవిలో విపరీతమైన వేడిగా ఉండేది. వేసవి తాపాన్ని తట్టుకునే విశ్రాంతి మందిరం కోసం బాల్డసరె ఈ భూమిలో ఇరవైమూడు అడుగుల లోతున నేలమాళిగను తవ్వించాడు. నేలమాళిగలోనే గదులు గదులుగా నిర్మాణం చేపట్టి, లోపలకు గాలి వెలుతురు సోకేలా తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. చుట్టూ తవ్వకాన్ని విస్తరించి, చిన్న చిన్న మొక్కలతో ఉద్యానవనాన్ని పెంచాడు. గాలి వెలుతురు ధారాళంగా ఉండటంతో ఈ నేలమాళిగలో మొక్కలు ఏపుగా పెరిగాయి. బాల్డసరె 1946లో మరణించాడు. అమెరికా ప్రభుత్వం 1977లో దీనిని చారిత్రక ప్రదేశంగా గుర్తించింది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా నేలమాళిగలో పెరిగిన ఈ ఉద్యానవనం నేటికీ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఇవి చదవండి: చిపి చిపీ చాపా... డుబిడుబిడు -
సముద్ర జలాల్లో రూ.3,700 కోట్ల కొకైన్ పట్టివేత
రోమ్: ఇటలీలోని సిసిలీకి సమీపంలోని సముద్ర జలాల్లో తేలియాడుతున్న కొకైన్ ప్యాకెట్లివి. సుమారు రెండు టన్నుల బరువున్న 70 బండిళ్లలో 1,600 ప్యాకెట్లలోని ఈ కొకైన్ విలువ ఏకంగా రూ.3,700 కోట్లు! స్మగ్లర్లు వీటిని బహుశా నౌకలో తెచ్చి ఇక్కడ వదిలేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నీటిపై తేలియాడుతున్న వీటి జాడ తెలుసుకునేందుకు వీలుగా ప్యాకెట్లకు ట్రాకింగ్ డివైజ్ను కూడా అమర్చారని చెప్పారు. హెలికాప్టర్ ద్వారా పెట్రోలింగ్ చేస్తుండగా ఇవి కనిపించాయి. -
వందేళ్ల క్రితం చనిపోయిన చిన్నారి... ఇంకా ఇప్పటికీ చెక్కుచెదరకుండా..
ఇంతవరకు ఎన్నోరకాల మమ్మీలు గురించి చదివాం. పైగా వాటి అవయవాలు జాలా జాగ్రత్తగా భద్రపర్చారంటూ విన్నాం. ఆయా మమ్మీల వద్ద విలువైన నాణేలు, బంగారం వంటి వస్తువులను చూశాం. ఇంతవరకు చూసిన మమ్మీలన్నీ చాలా వరకు కాస్త డికంపోజ్ అయినట్లుగానే ఉన్నాయి. చనిపోయినప్పుడు ఎలా ఉండేవో అలానే యథాతథంగా ఉండటం అసాథ్యం. కానీ ఇక్కడొక చిన్నారి మమ్మీ మాత్రం తాజా మృతదేహంలా చెక్కు చెదరకుండా ఉండటమే కాకుండా ప్రపంచంలో అందమైన మమ్మీగా పేరుగాంచింది. వివరాల్లోకెళ్తే....రోసాలియా లాంబార్డో అనే రెండేళ్ల చిన్నారి డిసెంబర్ 2, 1920న తన రెండో పుట్టిన రోజున చనిపోయింది. వాస్తవానికి 1918 నుంచి 1920 మధ్య కాలంలో స్పానిష్ ప్లూ మహమ్మారీ ప్రబలంగా ఉండేది. ఆ సమయంలో ఈ చిన్నారి ఆ మహమ్మారి బారిన పడి మృతి చెందింది. అప్పటి నుంచి ఆ చిన్నారి మృతదేహాన్ని మమ్మీలా అత్యంతా జాగ్రత్తగా భద్రపరిచారు. ఈ మేరకు ఆ చిన్నారి మృతదేహం ఉత్తర సిసిలీలో పలెర్మోలోని కాపుచిన్ కాటాకాంబ్స్ అనే చోట భద్రపరచారు. వందేళ్ల తర్వాత కూడా ఆ చిన్నారి మృతదేహం ఆమె చనిపోయినప్పుడూ ఎలాగా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉండటం గమనార్హం. పర్యావరణ కారకాల నుంచి ఆ మృతదేహం పాడవకుండా అత్యంత బహు జాగ్రత్తగా నైట్రోజన్తో నిండిన గాజు సేవ పేటికలో భద్రపరిచారు. ఈ చిన్నారి మమ్మీ ప్రస్తుతం పర్యాటక ఆకర్షణగా మారింది. ఈ కాపుచిన్ కాటాకాంబ్స్ అనేది దక్షిణ ఇటలీలో ఉండే అతి పెద్ద మమ్మీల పరిశోధన కేంద్రం లేదా మమ్మీలను భద్రపరిచే భూగర్భ శ్మశాన వాటిక. ఇందులో దాదాపు ఎనిమిది వేల మమ్మీలు ఉన్నాయి. రోసాలియా అనే రెండెళ్ల చిన్నారిని భద్రపరిచినంతగా మిగతా వాటిని భద్రపర్చలేదు. ఆ చిన్నారి రాగి జుట్టు, చర్మం రంగు మారకుండా ఏదో మనిషి నిద్రపోతున్నట్లుగా ఉంటుంది. చాలామంది నకిలీ మమ్మీ అని, మైనపు ముద్ద అంటూ పుకార్లు సృష్టించారు. మరికొంతమంది ఆ చిన్నారిని చూసినప్పుడు మమ్మల్ని చూసి రెప్పవేసిందని కూడా చెప్పారు. ఐతే వాటన్నింటిని కొట్టి పారేస్తూ...ఆ చిన్నారి శరీరం పై చేసిన పరిశోధనల్లో శరీరం, ఎముకలు, అవయవాలు ఏ మాత్రం చెక్కు చెదరలేదని, కేవలం మెదడు మాత్రమే ఉండాల్సిన పరిమాణం నుంచి 50% తగ్గిపోయిందని నిర్థారించారు ఆర్కియాలజిస్ట్లు. ఏ మాత్రం పాడవకుండా ఉన్న ఈ చిన్నారి మమ్మీ ఇటలీ పురాణాల్లో ప్రసిద్ద అంశంగా మారింది. ఈ చిన్నారిని టాక్సీడెర్మిస్ట్, ఎంబాల్మర్ ఆల్ఫ్రెడో సలాఫియాలు మమ్మీగా మార్చారని చెబుతున్నారు. కానీ కొంతమంది శాస్తవేత్తలు మాత్రం ఈ మమ్మీ శవపేటికలో ఉండటం వల్ల ఇరు పక్కల ఉండే గాజు విండోలు ఒక ఆప్టికల్ ఇల్యూషన్ కలిగించి ఆ మమ్మీ చెక్కుచెదరకుండా ఉన్నట్లు కనిపించేలా చేస్తున్నాయని, పగటి పూట వేరేలా ఉంటుందని చెబుతున్నారు. (చదవండి: ఏనుగులతో సెల్ఫీ అంటే... అట్లుంటది మరీ!) -
భలే మంచి చౌక బేరం: రూ.86కే ఇల్లు
రోమ్: ఇల్లు కట్టి చూడు - పెళ్లి చేసి చూడు అనే సామెత ఊరికే రాలేదు. ఈ రెండు కార్యాలలో దేన్ని మొదలు పెట్టినా ఊహించిన దానికన్నా భారీ ఖర్చు జరిగి నెత్తిన అప్పుల భారం పడటం ఖాయం. నేటి కాలంలో ఇల్లు లేనిదే ఇల్లాలు కూడా కన్నెత్తి చూడని పరిస్థితి. దీంతో చాలామంది సొంతింటి కోసం కలలు కంటూ ఆ పగటి కలల్లోనే సగం జీవితం బతికేస్తారు. అలాంటి వారికి బంపరాఫర్... కేవలం 86 రూపాయలకే ఇల్లు సొంతం చేసుకునే సువర్ణావకాశం. హుర్రే, ఎక్కడ అని తెగ సంబరపడిపోకండి. ఎందుకంటే ఇది మనదగ్గర కాదు! ఇటలీలోని సలేమీలో సిసిలో పట్టణంలో ఈ ఆఫర్ ప్రకటించారు. ఒక్క యూరోకే ఇల్లు తీసుకోండి అంటూ జనాలను ఆకర్షించే పనిలో పడ్డారు అక్కడి పాలకులు. (చదవండి: నీ ఆఫర్ తగలెయ్య, మీరు మారరా!) గృహాలను మరీ ఇంత చౌకగా ఎందుకు ఇస్తున్నారంటే.. 1968లో సిసిలీలో భూకంపం వచ్చి అక్కడి ప్రాంతాన్ని, జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. అప్పటి నుంచి అక్కడి ప్రజలు బతుకుదెరువు కోసం నగరాలకు వలస వెళ్తూనే ఉన్నారు. దీంతో అక్కడ నివసించేవారి జనాభా పూర్తిగా తగ్గిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఆ ప్రాంతం పూర్తిగా నిర్మానుష్యంగా మారి దెయ్యాల కొంపగా మారుతుందేమో అని పాలకులకు భయం పట్టుకుంది. అందుకని "ఒక్క యూరోకే ఇల్లు" పథకం ప్రకటించారు. ఒక్క యూరో అంటే భారత కరెన్సీలో 86 రూపాయలు. కనీసం ఈ ఆఫర్ ద్వారానైనా జనాలను ఆకర్షించి ఆ ప్రాంతాన్ని తిరిగి కళకళలాడేలా చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే సలేమీలో నివాసయోగ్యమైన పాత ఇళ్లను గుర్తించి వేలానికి సిద్ధంగా ఉంచారు. అయితే అక్కడ ఇల్లు కొనాలంటే ఓ కండీషన్.. ఇళ్లను కొనుగోలు చేసేవారు వాటికి తప్పకుండా రిపేర్లు చేయించుకోవాల్సి ఉంటుంది. (చదవండి: లవర్ను ఇలా కూడా నిద్రలేపుతారా?) -
పది యూరోల కోసం వృద్ధురాలిని చంపేశాడు
రోమ్: కేవలం పది యూరోల అప్పు తీర్చనందుకు 75 సంవత్సరాల వృద్ధురాలిని ఏమాత్రం కనికరం లేకుండా చంపేశాడో దుర్మార్గుడు. ఈ ఘటన ఇటలీలోని సిసిలీలో జరిగింది. మారియా రస్సెల్లా అనే వృద్ధురాలు తన దగ్గర తీసుకున్న పది యూరోల అప్పు తిరిగి చెల్లించడానికి నిరాకరించడంతో ఆమెను చంపేసినట్టు పావోలో కర్టెల్లి (36) పోలీసుల ముందు నేరం అంగీకరించాడు. కాలటబియానో నగరంలోని తన అపార్ట్మెంట్లో రక్తపుమడుగులో పడిఉన్న రస్సెల్లా మృతదేహాన్ని శనివారం పోలీసులు గుర్తించారు. ఈ హత్యకేసులో నిందితుడిగా అనుమానిస్తూ కార్టెల్లిని పోలీసులు ఇదివరకే అరెస్టుచేశారు. ఈ దారుణానికి ఒడిగట్టింది తానేనని అతను సోమవారం అంగీకరించాడు.